స్టీమ్‌బోట్ బిల్ జూనియర్ (1928 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టీమ్‌బోట్ బిల్ జూనియర్
స్టీమ్‌బోట్ బిల్ జూనియర్ సినిమా పోస్టర్
దర్శకత్వంచార్లెస్ రీస్నర్
స్క్రీన్ ప్లేకార్ల్ హర్బాగ్, బస్టర్ కీటన్ (టైటిల్స్ లో పేరు వేయలేదు)
కథకార్ల్ హార్బర్
నిర్మాతజోసెఫ్ ఎం. స్చెంక్
తారాగణంబస్టర్ కీటన్
ఛాయాగ్రహణందేవ్ జెన్నింగ్స్, బెర్ట్ హైన్స్
కూర్పుషెర్మాన్ కెల్ (టైటిల్స్ లో పేరు వేయలేదు)
పంపిణీదార్లుయునైటెడ్ ఆర్టిస్ట్స్
విడుదల తేదీ
1928 మే 12 (1928-05-12)(యు.ఎస్.)
సినిమా నిడివి
71 నిముషాలు (7 రీల్స్)
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషమూకీ చిత్రం

స్టీమ్‌బోట్ బిల్ జూనియర్ 1928, మే 12న విడుదలైన అమెరికా మూకీ హాస్య చలనచిత్రం. చార్లెస్ రీస్నర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బస్టర్ కీటన్, టామ్ మెగ్వైర్, ఎగ్నెస్ట్ టారెన్స్, మేరియన్ బైరన్ తదితరులు నటించారు.[1] చిత్ర ప్రధాన పాత్రధారి బస్టర్ కీటన్, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భయంకరమైన (ఇంటి ముందుభాగం కూడి కీటన్ పై పడడం) స్టంట్ ను ఈ చిత్రంలో చేశాడు.[2]

కథ[మార్చు]

స్టీమ్‌బోట్ బిల్ జూనియర్ పూర్తి చిత్రం

ఈ చిత్రంలో కీటన్, స్టీమ్‌బోట్ బిల్ కొడుకు బిల్ జూనియర్ గా నటించాడు. విలియం స్టీమ్‌బోట్ బిల్ కాన్ఫీల్డ్ కు ఒక స్టీమర్ ఉంది. అతనికి ఒక కొడుకు ఉన్నాడు, కానీ ఆ పిల్లవాడి చిన్నతనంలోనే తన తల్లితో వెళ్ళిపోయాడు. తన కొడుకు రాకకోసం ఎదురుచూస్తుంటాడు. తన తల్లికి ఇచ్చిన మాటను అనుసరించి, విలియమ్ కానింగ్ జూనియర్ తన తండ్రిని కలవడానికి నదికి వెళతాడు.

అక్కడ జె.జె. కింగ్ అనే వ్యాపారవేత్త నుండి తన తండ్రికి ఎదురౌతున్న సమస్యల గురించి విలియమ్ కానింగ్ జూనియర్ తెలుసుకుంటాడు. జె.జె. కింగ్ కూతురు కిట్టి కింగ్, బిల్ జూనియర్ ఒకరినొకరు ఇష్టపడుతారు. ఒకరోజు తీవ్రమైన తుఫాను వచ్చినప్పుడు స్టీమ్‌బోట్ బిల్ బిల్, కిట్టి, జె.జె. కింగ్ లను బిల్ జూనియర్ కాపాడుతాడు.

నటవర్గం[మార్చు]

 • బస్టర్ కీటన్
 • టామ్ మెగ్వైర్
 • ఎగ్నెస్ట్ టారెన్స్
 • మేరియన్ బైరన్
 • టామ్ లెవిస్
 • జేమ్స్ టి. మాక్[3]
లాబీ కార్డు

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: చార్లెస్ రీస్నర్
 • నిర్మాత: జోసెఫ్ ఎం. స్చెంక్
 • స్క్రీన్ ప్లే: కార్ల్ హర్బాగ్, బస్టర్ కీటన్ (టైటిల్స్ లో పేర్లు వేయలేదు)
 • కథ: కార్ల్ హార్బర్
 • ఛాయాగ్రహణం: దేవ్ జెన్నింగ్స్, బెర్ట్ హైన్స్
 • కూర్పు: షెర్మాన్ కెల్ (టైటిల్స్ లో పేరు వేయలేదు)
 • పంపిణీదారు: యునైటెడ్ ఆర్టిస్ట్స్

చిత్రవిశేషాలు[మార్చు]

 1. ఈ చిత్రంలోని క్లైమాక్స్ లో వచ్చే వరద సన్నివేశాలకోసం లక్ష డాలర్లు ఖర్చుచేసి వరదల సెట్టు వేశారు. కానీ, అదే సమయంలో అమెరికాలో వరదలు వచ్చి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అంత దుర్ఘటన జరిగిన తరువాత దాన్ని కామెడీగా చూపిస్తే సినిమా ప్రేక్షకుల మెప్పుపొందలేదని భావించిన కీటన్, వరదల ఆలోచనను తుఫాన్ బ్యాక్ డ్రాప్ గా మలచాడు.[1]
 2. శాక్రెమాంటో నది ఒడ్డున 35వేల డాలర్ల ఖర్చుతో మరో సెట్ వేసి, తుఫాన్ ఎఫెక్టులను సృష్టించడానికి లిబర్టీ విమానాలకు ఉపయోగించే ఆరు ఎయిర్ క్రాప్ట్ పెట్టి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాడు. తుఫాన్ కు రెండంతస్తుల ఇల్లు కూలిపోతూ అక్కడే నిలబడివున్న కీటన్ పై పడుతుంది. డూప్ లేకుండా కీటన్ తనపైనే చిత్రీకరించుకున్న ఆ షాట్ ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన షాట్ గా సినీ విశ్లేషకులు చెబుతారు.[1]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 13.
 2. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 12.
 3. "Steamboat Bill, Jr. Full Cast and Crew". IMDb. Retrieved 8 February 2019.

ఇతర లంకెలు[మార్చు]

ఆధార గ్రంథాలు[మార్చు]