స్టీవ్ అపిల్టన్
స్టీవ్ అపిల్టన్ (మార్చి 31, 1960 – ఫిబ్రవరి 3, 2012) మైక్రాన్ టెక్నాజీ సిఇవో.[1] ఆయన సెమీ కండక్టర్స్ టెక్నాజీలో నూతన ఒరవడిని సృష్టించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1960 మార్చి 31 కాలిఫోర్నియాలో జన్మించారు.మైక్రాన్ టెక్నాలజీలో 1983లో చిన్న ఉద్యోగంలో చేరిన అపిల్టన్ అంచలంచలుగా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఆతర్వాత సిఇవో స్థానానికి ఎదిగారు.ఆయన 1994 లో మైక్రాన్ టెక్నాలజీకి సి.యి.ఓ, చైర్మన్ గా నియమితులయ్యారు.[2] స్టేట్ సుప్రీంకోర్టు అడ్వయజరీ కౌన్సిల్ అపిల్టన్‌ను నేషనల్ సెమీకండక్టర్ టెక్నాలజీ కౌన్సిల్ ఎంపిక చేసింది. వరల్డ్ సెమీ కండక్టర్ కౌన్సిల్‌కు కూడా ఆయన ఎంపికయ్యారు. రెండు పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మైక్రాన్ టెక్నాలజీ సిఇవోగా కంపెనీకి విశిష్టసేవలు అందించారు. అపిల్టన్ కెరీర్‌లో ఇటు వృత్తి ధర్నాన్ని నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు పరిశోధనకోసం కొంత సమయం కేటాయించే వాడు.[3]
పరిశోధనలు
[మార్చు]సెమీ కండక్టర్‌లో చేసిన నిరంతర పరిశోధనల వల్ల ఎక్కువ సామర్థ్యంకల ఫ్లాష్ మెమరీ అపిల్టన్ నేతృత్వంలో తయారు చేయడం సాధ్యమైంది. మైక్రో టెక్నాలజీని ఫ్లాష్‌మెమరీ పుణికిపుచ్చుకోవడంవల్ల ఎంతకాలమైనా డేటా భద్రంగా నిలువ ఉంచుకునే చిన్ని పెరిఫిరల్స్ ఉత్పత్తి సాధ్యం అయింది.అంతకు ముందు 2004 సంవత్సరంలో కూడా జరిగిన ఘోర విమానప్రమాదం నుంచి తృటిలో ఆయన తప్పించుకున్నారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో అపిల్టన్ తలకు, ఊపిరితిత్తులకు,వెనె్నముకకు గాయాలు అయ్యాయి.[4]
అవార్డులు
[మార్చు]ఇన్‌ఫర్మెషన్ టెక్నాలజీ రంగంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. చివరగా 2011లో రాబర్డ్ నైసీ అవర్డును అందుకున్నారు. కారు రేస్‌లు అంటే ఆయనకు సరదా. 2006 సంవత్సరంలో 1,047 మైళ్లు 25 గంటల 25 నిముషాల్లో నడిపి రికార్డును సృష్టించాడు.
మరణం
[మార్చు]ఫిబ్రవరి 3, 2012 న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు.బోసీ విమానాశ్రయంలో అపిల్టన్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం అత్యవసరంగా దింపాల్సి వచ్చినప్పుడు జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Chairman of the Board and Chief Executive Officer Archived 2012-02-26 at the Wayback Machine, www.Micron.com.
- ↑ Comeback kid, Businessweek, May 13, 1996.
- ↑ సెమీకండక్టర్ ‘గురు’ ఇకలేరు[permanent dead link]
- ↑ Extra Flugzeugrau GMBH EA 300/L, Air Crash in Boise, IDAHO, USA on 7/8/2004 Archived 2012-07-01 at Archive.today, aircrashed.com.
- ↑ Steve Appleton, CEO of Micron, dies in airplane crash at Boise Airport, IdahoStatesman.com, Retrieved February 3, 2012.
- ↑ NTSB Preliminary Accident Report, NTSB, Retrieved February 10, 2012.