స్ర్పూస్ క్రీక్ విమానాశ్రయం
29°04′49″N 081°02′48″W / 29.08028°N 81.04667°W
స్ర్పూస్ క్రీక్ విమానాశ్రయం Spruce Creek Airport | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రైవేటు | ||||||||||
యజమాని/కార్యనిర్వాహకుడు | Spruce Creek Prop. Owners Assoc. Inc. | ||||||||||
సేవలు | డేటోనా బీచ్, ఫ్లోరిడా | ||||||||||
ప్రదేశం | పోర్ట్ ఆరెంజ్, ఫ్లోరిడా | ||||||||||
ఎత్తు AMSL | 24 ft / 7 m | ||||||||||
వెబ్‌సైటు | http://www.7fl6.org | ||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు | |||||||||||
| |||||||||||
స్ర్పూస్ క్రీక్ విమానాశ్రయం (FAA LID: 7FL6) అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒక ప్రైవేటు విమానాశ్రయము, గ్రామం.[1] ఈ గ్రామంలోని ప్రజలందరికీ వ్యక్తిగతంగా విమానాలున్నాయి.
చరిత్ర
[మార్చు]డేటోనా బీచ్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో స్ర్పూస్ క్రీక్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇదొక ప్రైవేటు ఎయిర్‌పోర్టు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నావికా దళాన్ని, వైమానిక దళాన్ని అనుసంధానించేందుకు దీన్ని నిర్మించారు. అయితే 1946 సంవత్సరంలో నావికాదళం ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఖాళీ చేయించింది. అప్పటి నుంచి ఈ ఎయిర్‌పోర్టు వారి ప్రైవేట్ విమానాశ్రయంగా మారింది.
స్ర్పూస్ క్రీక్‌లో ఉండే ప్రజలకు విమానాలంటే చాలా ఇష్టం. కొత్త కొత్త విమానాల గురించి, విమానాల విశేషాల గురించి ఎప్పుడూ ఆరా తీస్తుంటారు. ఏ నలుగురు కలుసుకున్నా విమానాల ముచ్చట్లు ఉండాల్సిందే. అవంటే వారికి అంత మక్కువ. స్ర్పూస్ క్రీక్ గేటెడ్ కాలనీ జనాభా దాదాపు 6,000. ఇక్కడ ప్రతి ఇంటికి ఓ విమానం ఉంటుంది. మన దేశంలో ఇంటి ముందు కార్లు పార్కు చేసినట్లు అక్కడి వాళ్లు ఇంటిముందే విమానాలను పార్కు చేస్తారు. కొందరేమో వాటికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసుకుంటే, మరి కొందరేమో రహదారులపైనే పార్క్ చేస్తారు. విమానాలను వరుసగా పార్కు చేసినపుడు స్ర్పూస్ క్రీక్ గేటెడ్ కాలనీని చూస్తే ఓ చిన్న ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తుంది.
ఇక్కడి ప్రజలు ప్రతి శనివారం విమానాలు తీసుకుని దగ్గర్లోని మరో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ టిఫిన్ చేస్తూ విమానాల విశేషాల గురించి ముచ్చటించి తిరుగు ప్రయాణమవుతారు. ఈ తతంగానికి వారు ఓ పేరు కూడా పెట్టుకున్నారు. అదే సాటర్ డే మార్నింగ్ గాగ్‌ల్ .
ప్రజలు
[మార్చు]స్ర్పూస్ క్రీక్ గేటెడ్ కాలనీలో నివసించే వారంతా కూడా ధనవంతులే కావడం విశేషం. అంతేకాదు వారందరికీ విమానాలంటే ఎంతో ఇష్టం. దీనితో విమానాల కొనుగోలుకు వెనకడుగు వేయరు. విమానాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్నవారైతే ఒకటేంటి.. రెండు, మూడు విమానాలను కొనుక్కుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 FAA Airport Master Record for 7FL6 (Form 5010 PDF), effective 2007-10-25
బయటి లంకెలు
[మార్చు]- అధికారిక వెబ్‌సైటు
- స్ర్పూస్ క్రీక్ విమానాశ్రయం చిత్రాలు, వివరాలు
- స్ర్పూస్ క్రీక్ జర్మన్ భాషా వెబ్సైట్