Jump to content

స్వాగతం (నాటకం)

వికీపీడియా నుండి

స్వాగతం శ్రీ భారతుల రామకృష్ణ రచించిన సాంఘిక నాటకం. ఈనాటి యువత నాటకరంగం వైపు కాక సినిమా రంగానికి ఎక్కువ ఆకర్షితులై కేవలం డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు తప్ప నైతిక విలువలు గురించి పట్టించుకోకుండా యువతని చెడుమార్గంలో పయనింపచేసే సినిమాలు తీస్తున్నారని తెలియ చేయడం జరుగుతుంది.

కథా సారాంశం

[మార్చు]

నాటకం ఒక యాగముగా , రంగస్థలమే యజ్ఞ వాటికగా, నటులు సమిధిలుగా ఆ యాగ హోమగుండం లో సమిధులుగా మారి ప్రేక్షకుల అభిమానమనే యజ్ఞ ఫలాన్ని పొందడమే పరమావధిగా భావించే విశ్వనాధం అనే మహా నటుడు తన జీవితాన్ని నాటక రంగానికే అంకితం చేస్తాడు.. భార్య, పిల్లలు, వుద్యోగం కన్నా నాటకమే ప్రాణంగా బతుకుతాడు.. ఆఫీసర్ వచ్చి వారించినా ఆయనచేత కూడా నాటకం, కళలు గొప్పవని ఒప్పిస్తాడు.

భారత, రామాయణ ఇతిహాసాల్లోని ధర్మ నిరతిని కళల ద్వారా, తమ గళం , కలం ద్వారా లోకానికి తెలియపరచి సంఘం, సమాజం, దేశం యొక్క అభ్యున్నతికి ఎంతో తోడ్పతున్నారని, అందుకే కళాకారులు చనిపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటారని, కళాకారుల సంపాదన కరెన్సీ నోట్లు కావని, ప్రేక్షకులు అభిమానంతో ఇచ్చే వెలకట్టలేని పురస్కారాలు, జ్ఞాపికలు అని తెలియచేస్తాడు.. మీరంతా కళాకారులని చిన్న చూపు చూడకుండా అభిమానంతో ఆదరించండి, కళలను ప్రోత్సహించండి, నాటకాన్ని సజీవంగా నిలబెట్టండి .. అని ఆ మహానటుడు అభ్యర్ధనతో నాటకం ముగుస్తుంది.