స్వామి భూమానంద తీర్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి భూమానంద తీర్థ
జననంమే 13, 1933
పర్లికాడ్, Thrissur district, British India (now Kerala, India)
గురువుబాబా గంగాధర పరమహంస

స్వామి భూమానంద తీర్థ  భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సంఘ సంస్కర్త. వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీతలపై మలయాళం, హిందీ, ఇంగ్లీషు, తమిళం భాషలలో ఉపన్యాసాలు అందించడంలో ప్రసిద్ధి చెందాడు. అలాగే ఆంగ్లం, మలయాళం, హిందీ భాషలలో వేదాంతం, భాగవతం, మానవాభివృద్ధికి సంబంధించిన అనేక పుస్తకాలను ప్రచురించాడు.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

స్వామి భూమానంద తీర్థ 1933లో భారతదేశంలోని ప్రస్తుత కేరళలోని త్రిసూర్ జిల్లాలోని వడక్కంచెరి సమీపంలోని పర్లికాడ్ గ్రామంలో జన్మించాడు. పర్లికాడ్‌లో తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తరువాత తన ఇద్దరు సోదరులతో కలిసి పర్లికాడ్‌లోని వ్యాస కళాశాలను ప్రారంభించాడు. కోల్‌కతాలో తన వృత్తి జీవితంలో బాబా గంగాధర పరమహంసను కలిశాడు.

వివిధ  కార్యకలాపాలు[మార్చు]

జ్ఞాన యజ్ఞాలు[మార్చు]

జ్ఞాన యజ్ఞాలు (జ్ఞాన వ్యాప్తి కార్యక్రమాలు) స్వామి భూమానంద తీర్థ లోక-సంగ్రహ (ప్రపంచ సంక్షేమం) ప్రచారంలో ప్రధాన భాగం. 1964లో జంషెడ్‌పూర్‌లో జరిగిన మొదటి జ్ఞాన యజ్ఞం నుండి, ఈ ఆధ్యాత్మిక ప్రసంగాల పరంపర భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, అలాగే మలేషియా,  యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలలో నిర్వహించబడుతున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా భారతదేశంలో ముంబయి, చెన్నై, బెంగుళూరులో కూడా ప్రతి సంవత్సరం జ్ఞాన యజ్ఞాలు జరుగుతాయి.[2]

గీతా తత్త్వ సమీక్ష[మార్చు]

భగవద్గీతపై గీతా తత్త్వ సమీక్ష చర్చల పరంపర ప్రతి సంవత్సరం త్రిస్సూర్‌లో నిర్వహించబడుతుంది, ఇందులో స్వామి భూమానంద తీర్థ భగవద్గీత విలువలకు సంబంధించిన సందేశాన్ని వివరిస్తారు . ఈ విధానం 1995 సంవత్సరంలో ప్రారంభమైంది.[3]

సామాజిక-సాంస్కృతిక సంస్కరణలు[మార్చు]

కొన్ని హిందూ దేవాలయాలు అనుసరించే కొన్ని అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన ఆచారాల రద్దు కోసం స్వామి భూమానంద తీర్థ అనేక ఉద్యమాలు నిర్వహించారు. వాటిలో  ఎర్నాకులం జిల్లాలోని ఎలవూర్ పుత్తన్‌కవు దేవాలయంలో తూక్కం అనే పద్ధతి, కొడంగల్లూర్ ఆలయంలో జరిగే భరణి ఉత్సవాల్లో అశ్లీల పాటలు పాడటం వీటిలో ప్రముఖమైనవి.[4]

ఆశ్రమం[మార్చు]

నారాయణాశ్రమ తపోవనం, స్వామి భూమానంద తీర్థ ప్రధాన కార్యాలయం. ఇది  త్రిసూర్ నగరానికి నైరుతి దిశలో 10 కి.మీ దూరంలో వెంగినిస్సేరి గ్రామంలో ఉంది . ఈ  ఆశ్రమం ఇన్నర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (CIRD) కేంద్రాలు భారతదేశంలోని ఢిల్లీ, జంషెడ్‌పూర్‌లో ఉన్నాయి, [5]

ప్రచురణలు, పుస్తకాలు, పత్రికలు[మార్చు]

స్వామి భూమానంద తీర్థ ప్రచురించిన ఆంగ్ల మాసపత్రిక విచారసేతు (పాత్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్) 1968లో ప్రారంభించబడింది. ఇంగ్లీషు, మలయాళం, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో స్వామి భూమానంద తీర్థ అనేక పుస్తకాలు, సీడీలను ప్రచురించారు. వాటిలో ముఖ్యమైనవి

మూలాలు[మార్చు]

  1. "Swami Bhoomananda Tirtha", Wikipedia (in ఇంగ్లీష్), 2021-05-24, retrieved 2022-03-11
  2. "Nature of the mind". hindu.com. Archived from the original on 2007-09-16. Retrieved 2022-03-11.
  3. "Bid to revive `Thookam' sparks off protests". hindu.com. Archived from the original on 2009-03-18. Retrieved 2022-03-11.
  4. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2012-04-22. Retrieved 2022-03-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Swami Bhoomananda Tirtha".