స్వామి శ్రద్ధానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి శ్రద్ధానంద
జననం(1856-02-22)1856 ఫిబ్రవరి 22
తల్వాన్, జలంధర్, పంజాబ్ రాజ్యం, భారతదేశం
మరణం1926 డిసెంబరు 23(1926-12-23) (వయసు 70)
ఢిల్లీ, భారతదేశం
మరణ కారణంఅబ్దుల్ రషీద్ చే హత్య
వృత్తిసమాజ సేవకుడు, స్వతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు.

స్వామి శ్రద్ధానంద (1856 ఫిబ్రవరి 22 - 1926 డిసెంబరు 25) మహాత్మా మున్షీ రామ్‌ విజ్ గా సుపరిచితుడు.[1] అతను భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్యసమాజ సన్యాసి. హిందూ మత సంస్కర్త. స్వామి దయానంద సరస్వతి ఆశయ ప్రచారము, వాటి సాధనే ధ్యేయంగా బ్రతికాడు. హిందూ మత సంఘటన, శుద్ధి ఉద్యమాలను విస్తృతంగా నిర్వహించాడు. అతను కాంగ్రీ గురుకుల విద్యాలయంతో సహా అనేక విద్యాలయాలను స్థాపించాడు. 1926వ సంవత్సరంలో ఒక ముస్లిం మతోన్మాది చేతిలో హత్యకు గురయ్యాడు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

అతను 1856 ఫిబ్రవరి 22 న భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జలంధర్ జిల్లాలోని తల్వాన్ గ్రామంలో జన్మించాడు. అతను యునైటెడ్ ప్రావిన్సెస్ (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్) లో పోలీస్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న లాలా నానక్ చంద్ కుటుంబంలో కనిష్ఠ పుత్రునిగా జన్మించాడు. అతని బాల్య నామం బృహస్పతి విజ్. కానీ తరువాత అతనిని మున్షి రామ్ విజ్ అని పిలిచారు. ఈ పేరు 1917 లో ఆయన సన్యాసం తీసుకునే వరకు కొనసాగింది.

సాంప్రదాయక కుటుంబాలలోని మహిళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం వంటి కొన్ని సంఘటనలను చూచిన తరువాత అతను నాస్తిక వాదాన్ని స్వీకరించాడు. అతను చర్చి ఫాదర్ క్రైస్తవ సన్యాసినితో సంబంధం పెట్టుకొని రాజీ చేసిన పరిస్థితి, కృష్ణ సమాజానికి చెందిన మతాధికారులు యువ భక్తురాలిపై అత్యాచారానికి ప్రయత్నించడం, ముస్లిం న్యాయవాది ఇంట్లో ఆ చిన్న అమ్మాయి అనుమానాస్పదంగా మరణించడం వంటి పరిస్థితులకు అతను ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.[2] ఈ సంఘటనలన్నీ అతని నాస్తికత్వాన్ని సుస్థిరం చేశాయి. చివరికి ముక్తారీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాదిగా మారాడు.[2]

దయానంద సరస్వతితో సమావేశం

[మార్చు]
యువకుడిగా మహాత్మా మున్షీరామ్ లేదా స్వామి శ్రద్ధానంద

ఉపన్యాసాలు ఇవ్వడానికి దయానంద్ బరేలీని సందర్శించినప్పుడు అతను మొదట స్వామి దయానంద సరస్వతిని కలిశాడు. కొంతమంది వ్యక్తులు, బ్రిటిష్ అధికారుల హాజరు కారణంగా అతని తండ్రి ఈ కార్యక్రమాలలో ఏర్పాట్లు, భద్రతను నిర్వహిస్తున్నాడు. మున్షిరామ్ తన తండ్రి కోరిక మేరకు ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. అతను మొదట ఏర్పాట్లను పాడుచేయాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. తరువాత దయానంద్ యొక్క ధైర్యం, నైపుణ్యం, బలమైన వ్యక్తిత్వానికి బలంగా ప్రభావితమయ్యాడని పేర్కొన్నాడు. చదువు పూర్తయ్యాక మున్షిరామ్ న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు.[3][4]

జీవన ప్రగతి

[మార్చు]

పాఠశాలలు

[మార్చు]

లాహోర్‌లోని డి.ఎ.వి కళాశాశలలో వేద విద్యను ప్రధాన పాఠ్యాంశాలుగా మార్చాలా వద్దా అనే వివాదం తరువాత 1892 లో ఆర్య సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. అతను సంస్థను విడిచిపెట్టి పంజాబ్ ఆర్య సమాజ్ ఏర్పాటు చేశాడు. ఆర్య సమాజ్ గురుకుల విభాగం, డిఎవి విభాగంగా విభజించబడింది. శ్రద్ధానంద్ గురుకుల భాగం వైపు వెళ్ళాడు. 1897 లో లాలా లేఖ్ రామ్ హత్యకు గురైనప్పుడు శ్రద్ధానంద్ అతని స్థానంలోకి వచ్చాడు. అతను 'పంజాబ్ ఆర్య ప్రతినిధి సభ'కు నాయకత్వం వహించాడు. దాని నెలవారీ పత్రిక ఆర్య ముసాఫిర్ను ప్రారంభించాడు.[5] 1902 లో హరిద్వార్ సమీపంలో కాంగ్రీలో గురుకులం స్థాపించాడు. ఈ పాఠశాల ఇప్పుడు గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయంగా గుర్తించబడింది.

1917 లో మహాత్మా మున్షి రామ్ "స్వామి శ్రద్ధానంద్ సరస్వతి"గా సన్యాసి దీక్షను తీసుకున్నాడు.

శ్రద్ధానంద్ హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో ఆరావళిలో గురుకుల ఇంద్రప్రస్థాన్ని స్థాపించాడు. [5]

కార్యశీలత

[మార్చు]

1917 లో శ్రద్ధానంద్ గురుకులం నుండి హిందూ సంస్కరణ ఉద్యమాలలో, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన సభ్యుడయ్యాడు[6]. అతను 1919 లో అమృత్‌సర్ లో సమావేశాన్ని నిర్వహించాలని ఆహ్వానించిన కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. దీనికి కారణం జలియన్‌వాలా బాఘ్ ఊచకోత, కాంగ్రెస్ కమిటీలో ఎవరూ అమృత్‌సర్ లో సమావేశం చేయడానికి అంగీకరించలేదు. ఈ సమావేశానికి శ్రద్ధానంద్ అధ్యక్షత వహించాడు.

రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. అదే సంవత్సరం అతను చాందిని చౌక్ లోని క్లాక్ టవర్ వద్ద గూర్ఖా సైనికుల ముందు నిరసన వ్యక్తం చేశాడు[6]. తరువాత ఆ నిర్సనను కొనసాగించాడు. 1920 ల ప్రారంభంలో అతను హిందూ సంగఠన్ (ఏకీకరణ) ఉద్యమంలో ఒక ముఖ్యమైన శక్తిగా అవతరించాడు. ఇది ఇప్పుడు పునరుజ్జీవింపబడిన హిందూ మహాసభ ఉత్పత్తి.[7] భారతీయుల ఔదాసీన్యం, దాస్యానికి కారణం ఆంగ్లేయుల ఆంగ్ల శిక్షణయే కారణంగా భావించి అతను హరిద్వార్ సమీపంలో సనాతన సిద్ధాంతాలను రక్షించుట కొరకు వేదకేంద్రిత గురుకుల శిక్షణను ప్రారంభిచాడు. సద్ధర్మప్రచారక్ అనే పత్రికను స్థాపించి, పంజాబ్ ఆర్య ప్రతినిధి సభకు ప్రాతినధ్యం వహించాడు. అదే సంవత్సరం 1917 లో సన్యాసం స్వీకరించి స్వామి శ్రద్ధానంద సరస్వతి గా పిలవబడేవాడు.

అతను హిందీ, ఉర్దూ భాషలలో మతపరమైన విషయాలపై వ్యాసాలు రాశాడు. అతను రెండు భాషలలో వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను దేవనాగరి లిపిలో హిందీ భాషను ప్రోత్సహించాడు. పేదలకు సహాయం చేశాడు. మహిళల విద్యను ప్రోత్సహించాడు. 1923 నాటికి, అతను సామాజిక రంగాన్ని విడిచిపెట్టి, తన పూర్వపు శుద్ధి ఉద్యమం (హిందూ మతంలోకి తిరిగి మార్చడం) లో మునిగిపోయాడు[8]. అది హిందూ మతంలో ఒక ముఖ్యమైన శక్తిగా మారింది. 1922 లో డాక్టర్ అంబేద్కర్ శ్రద్ధానంద్ ను "అంటరానివారి యొక్క గొప్ప, నిజాయితీగల ఛాంపియన్" అని పిలిచారు[9].1923 చివరలో ముస్లింలను తిరిగి మార్చాలనే లక్ష్యంతో రూపొందించిన భారతీయ హిందూ శుద్ధ సభకు అధ్యక్షుడయ్యాడు, ప్రత్యేకంగా పశ్చిమ యునైటెడ్ ప్రావిన్స్‌లోని 'మల్కానా రాజ్‌పుత్త్రులను' మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది అతన్ని ముస్లిం మతాధికారులు, అప్పటి నాయకులతో ప్రత్యక్ష ఘర్షణకు తీసుకువచ్చింది.[10][11]

హత్య

[మార్చు]

1926 డిసెంబరు 23న అతడిని అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి హత్య చేశాడు.[12][13]. అతను మరణించిన తరువాత 1926 డిసెంబరు 25 న గౌహతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.[14]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతని భార్య శైవా దేవి. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అతను 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని భార్య మరణించింది. అతని మనుమరాలు సత్యవతి భారతదేశంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించింది.[15]

గ్రంథావళి

[మార్చు]
  • The Arya Samaj and Its Detractors: A Vindication, Rama Deva. Published by s.n, 1910.
  • Hindu Sangathan: Saviour of the Dying Race, Published by s.n., 1924.
  • Inside Congress, by Swami Shraddhanand, Compiled by Purushottama Rāmacandra Lele. Published by Phoenix Publications, 1946.
  • Kalyan Marg Ke Pathik (Autobiography:Hindi), New Delhi. n.d.
  • Autobiography (English Translation), Edited by M. R. Jambunathan. Published by Bharatiya Vidya Bhavan, 1961

ఇతర పఠనాలు

[మార్చు]
  • Swami Shraddhanand, by Satyadev Vidyalankar, ed. by Indra Vidyavachaspati. Delhi, 1933.
  • Swami Shraddhanand (Lala Munshi Ram), by Aryapathik Lekh Ram. Jallandhar. 2020 Vik.
  • Swami Shraddhanand, by K.N. Kapur. Arya Pratinidhi Sabha, Jallandhar, 1978.
  • Swami Shraddhanand: His Life and Causes, by J. T. F. Jordens. Published by Oxford University Press, 1981.
  • Section Two:Swami Shraddhanand . Modern Indian Political Thought, by Vishwanath Prasad Varma. Published by Lakshmi Narain Agarwal, 1961. Page 447.
  • Chapt XI: Swami Shraddhanand. Advanced Study in the History of Modern India : 1920–1947. by G. S. Chhabra. Published by Sterling Publishers, 1971. Page 211
  • Pen-portraits and Tributes by Gandhiji: ' (Sketches of eminent men and women by Mahatma Gandhi) ', by Gandhi, U. S. Mohan Rao. Published by National Book Trust, India, 1969. Page 133
  • Swami Shraddhanand – Indian freedom fighters: struggle for independence. Anmol Publishers, 1996. ISBN 81-7488-268-5.
  • Telegram to Swami Shraddhanand, (2 October 1919) – Collected Works, by Gandhi. Published by Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India, 1958. v.16. Page 203.
  • An article on Swami Shraddhanand in "The Legacy of The Punjab" by R M Chopra, 1997, Punjabee Bradree, Calcutta,

మూలాలు

[మార్చు]
  1. "Swami Shraddhanand". www.aryasamajhouston.org. Retrieved 2020-01-16.
  2. 2.0 2.1 Autobiography http://www.vedpedia.com Archived 2 ఫిబ్రవరి 2011 at the Wayback Machine
  3. Autobiography http://www.vedpedia.com Archived 2 ఫిబ్రవరి 2011 at the Wayback Machine
  4. G.S. Chhatra (2007). Some Indian Personalities of the Time: Swami Shraddhanand Advanced Study in the History of Modern India Lotus Press. ISBN 81-89093-08-8 p. 227.
  5. 5.0 5.1 G. R. Thursby (1975). Controversy Hindu-Muslim Relations in British India: A Study of Controversy, Conflict, and Communal Movements in Northern India 1923–1928, BRILL. ISBN 90-04-04380-2. p. 15.
  6. 6.0 6.1 G.S. Chhatra (2007). Some Indian Personalities of the Time: Swami Shraddhanand Advanced Study in the History of Modern India Lotus Press. ISBN 81-89093-08-8 p. 227.
  7. Chetan Bhatt (2001). Shraddhanand Hindu Nationalism: Origins, Ideologies and Modern Myths Berg Publishers. ISBN 1-85973-348-4. p. 62
  8. R. K. Ghai. (1990) Shuddhi Movement in India: A Study of Its Socio-political Dimensions, Commonwealth Publishers. ISBN 9788171690428, p. 43.
  9. Dr. Babasaheb Ambedkar Writings & Speeches Vol. 9. Dr. Ambedkar Foundation. 1991. pp. 23–24. ISBN 978-93-5109-064-9.
  10. G. R. Thursby (1975). Controversy Hindu-Muslim Relations in British India: A Study of Controversy, Conflict, and Communal Movements in Northern India 1923–1928, BRILL. ISBN 90-04-04380-2. p. 15.
  11. Kenneth W. Jones (1987). Socio-Religious Reform Movements in British India: Socio-Religious Reform Movements in British India, Volume III-1 Cambridge University Press. ISBN 0-521-24986-4. p. 194
  12. 23 December is the Shardanand Balidhan Divas Archived 2018-12-18 at the Wayback Machine Arya Samaj.
  13. http://www.hindujagruti.org/articles/86.html Swami Shraddhanand
  14. Jagdish Saran Sharma (1959). Indian National Congress: A Descriptive Bibliography of India's Struggle for Freedom, S. Chand. p. 502.
  15. Geraldine Forbes (1999). Women in Modern India, Volume 4. Cambridge University Press. p. 148. ISBN 9780521612401.

బాహ్య లంకెలు

[మార్చు]