స్విగ్గి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్విగ్గి
Swiggy logo
స్థాపన2014
వ్యవస్థాపకులునందన్ రెడ్డి, శ్రీహర్ష మాజేటి, రాహుల్ జైమిని
ప్రధాన
కార్యాలయాలు
బెంగళూరు
సేవా ప్రాంతాలుభారతదేశం
జాలగూడుhttps://www.swiggy.com/

స్విగ్గి భారతదేశంలోనే అతి పెద్ద ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ సంస్థ.[1] ఈ సంస్థ 2014 లో బెంగళూరు కేంద్రంగా స్థాపించబడింది. ఈ సంస్థ 2021 నాటికి భారతదేశంలోని 300కు పైగా నగరాల్లో సేవలందిస్తోంది. 2019 ప్రారంభంలో సాధారణ వస్తువుల డెలివరీ కోసం స్విగ్గి స్టోర్స్ స్థాపించబడ్డాయి.

స్విగ్గిని బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.[2]

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో షిప్పింగ్ సులభతరం చేయడానికి నందన్ రెడ్డి, శ్రీహర్ష మాజేటి కలిసి 2013లో బండిల్ అనే ఇ-కామర్స్ వెబ్ సైట్ ను రూపొందించారు.[3] అయితే కొన్ని కారణాల వల్ల బండిల్ సంస్థను ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశించడానికి రీబ్రాండ్ చేశారు. ఆ సమయంలో ఫుడ్ పాండా (తరువాత ఓలా క్యాబ్స్ చే కొనుగోలు చేయబడింది ), టినీఓల్ (తరువాత జొమాటో చే కొనుగోలు చేయబడింది) ఇంకా ఓలా కేఫ్ (తరువాత మూసివేయబడింది) వంటి అనేక స్టార్టప్ కంపెనీలు ఫుడ్ డెలివరీ రంగంలో ఉన్నాయి. 2014 లో నందన్ రెడ్డి, శ్రీహర్ష మాజేటి రాహుల్ జైమినితో కలిసి స్విగ్గి ని స్థాపించారు.

ఆగస్టు 2020లో, కంపెనీ ఇన్ స్టామార్ట్ అనే వారి కిరాణా సామాగ్రి డెలివరీ ఫ్లాట్ ఫారాన్ని ప్రారంభించింది.[4]

పెట్టుబడులు , వనరులు

[మార్చు]

ఫిబ్రవరి 2019లో, స్విగ్గి బెంగళూరుకు చెందిన ఎఐ స్టార్టప్ Kint.io ను కొనుగోలు చేసింది. [5]

ఏప్రిల్ 2020లో, స్విగ్గీకి సుమారు $43 మిలియన్ నిధులు వచ్చాయి, ఇది సంస్థకు $3.6 బిలియన్ల విలువను చేకూర్చింది.

ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, గోల్డ్ మన్ సాచ్స్, థింక్ క్యాపిటల్, అమన్సా క్యాపిటల్ ఇంకా కార్మిగ్నాక్, అలాగే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు ప్రోసస్ వెంచర్స్ , అకెల్ స్విగ్గీని సుమారు $4.9 బిలియన్ల విలువ చేసే సిరీస్ జె రౌండ్ ఫండింగ్ లో కంపెనీ $800 మిలియన్లను సేకరించింది.


మూలాలు

[మార్చు]
  1. "Can Swiggy take more orders?". www.fortuneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-04-12.
  2. "స్విగ్గి". స్విగ్గి.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Singal, Aastha (2018-12-23). "Swiggy Timeline: From a Bootstrapped Venture to India's Fastest Growing Unicorn (Infographic)". Entrepreneur (in ఇంగ్లీష్). Retrieved 2021-04-12.
  4. Sil, Debarghya (2020-08-11). "Swiggy Launches InstaMart; Promises To Deliver Groceries Within 45 Minutes". Entrepreneur (in ఇంగ్లీష్). Retrieved 2021-04-12.
  5. "Swiggy acquires Bengaluru-based AI startup Kint.io". The Economic Times. Retrieved 2021-04-12.
"https://te.wikipedia.org/w/index.php?title=స్విగ్గి&oldid=4198532" నుండి వెలికితీశారు