Jump to content

స్విట్జర్లండ్ ప్రెసిడెంటు

వికీపీడియా నుండి
స్విస్ సమాఖ్య ప్రెసిడెంటు
Other official names
    • Bundespräsident(in)  (German)
    • Président(e) de la Confédération  (French)
    • Presidente della Confederazione  (Italian)
    • President(a) da la Confederaziun  (Romansh)
Incumbent
సిమొనెట్టా సొమ్మారుగా

since 2020 జనవరి 1
అధికారిక నివాసంఫెడరల్ ప్యాలెస్
కాలవ్యవధి1 సంవత్సరం. వెంటనే మళ్ళీ ఎన్నిక కావడానికి అనర్హులు
ప్రారంభ హోల్డర్జోనాస్ ఫర్రర్
నిర్మాణం1848 నవంబరు 21
ఉపఫెడరల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంటు
జీతంCHF 445,163, p.a. (Approx $448,000) as of 1 జనవరి 2017[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]][1]

స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు, స్విట్జర్లాండ్ యొక్క ఏడుగురు సభ్యుల ఫెడరల్ కౌన్సిల్‌కు ప్రెసిడెంటు. దేశ కార్యనిర్వాహక శాఖకు అధిపతి. కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు అని, జనాంతికంగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంటు అని కూడా పిలుస్తారు. ఫెడరల్ అసెంబ్లీ ప్రెసిడెంటును ఒక సంవత్సర కాలానికి ఎన్నుకుంటుంది. ప్రెసిడెంటు ఫెడరల్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ప్రత్యేక ప్రాతినిధ్య విధులను నిర్వహిస్తారు.

కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు సరిసమానుల్లో మొదటివ్యక్తి. ప్రెసిడెంటుకి మిగతా ఆరుగురు కౌన్సిలర్ల కంటే ఎక్కువ అధికారాలేమీ ఉండవు. తనకు కేటాయించిన విభాగానికి అధిపతిగానే కొనసాగుతారు. సాంప్రదాయికంగా ఈ బాధ్యతకు కౌన్సిల్ సభ్యుల్లో సీనియారిటీ ప్రకారం ఎన్నికౌతూంటారు. ఈ ఏటి ఫెడరల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంటే తరువాత సంవత్సరానికి అధ్యక్ష పదవిని చేపడతారు. దేశాధినేత అంటే సమాఖ్య ప్రెసిడెంటు కాదు, మొత్తం ఫెడరల్ కౌన్సిలంతా సామూహికంగా దేశాధిపతి.

ఫెడరల్ ప్రభుత్వానికి, ఫెడరల్ పరిపాలనకూ సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రాజ్యాంగం నిర్వచించింది. [2] ఇందులోని ఒక అధికరణం ప్రత్యేకంగా అధ్యక్ష పదవికి సంబంధించి ఉంది.

సామర్థ్యాలు

[మార్చు]

స్విస్ అధ్యక్షుడూ ఇతర దేశాల ప్రెసిడెంటు లాగా దేశాధిపతి కాదు: స్విస్ రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ కౌన్సిలే, దేశాధినేత గాను, ప్రభుత్వాధినేత గానూ పనిచేస్తుంది [3] కౌన్సిల్‌లో ఏదైన అంశానికి జరిపే వోటింగులో వోట్లు అటూ ఇటూ సమానంగా పడినపుడు (ఇది జరగవచ్చు, ఎందుకంటే వోటింగులో పాల్గొనకపోవచ్చు, కొందరు సభ్యులు సభకు అసలు రాకపోవచ్చు), ప్రెసిడెంటు ఓటుకు రెట్టింపు విలువ ఉంటుంది. [4]

తన సొంత శాఖపై నియంత్రణతో పాటు ప్రెసిడెంటు, ఇతర ప్రజాస్వామ్య దేశాలలో ఒకే దేశాధినేత సాధారణంగా నిర్వహించే పనుల్లో కొన్నిటిని విధులను నిర్వహిస్తారు. ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితిలో చేరినప్పటి నుండి, స్విస్ అధ్యక్షులు సర్వప్రతినిధిసభ ప్రారంభ సమావేశాలలో మాట్లాడుతారు. [5][6] అయితే, దేశానికి "ఒక్క" దేశాధినేత లేనందున, దేశం తరపున ఎటువంటి అధికారిక పర్యటనలను నిర్వహించరు. విదేశాలకు వెళ్ళేటప్పుడు, ప్రెసిడెంటు తన స్వంత శాఖాధిపతిగా మాత్రమే పర్యటిస్తారు. స్విట్జర్లండును సందర్శించే ఇతర దేశాధినేతలను ప్రెసిడెంటు కాకుండా, ఫెడరల్ కౌన్సిల్ లోని ఏడుగురు సభ్యులు అందరూ కలిసి స్వాగతిస్తారు. ఒప్పందాలపై సంతకాలు పూర్తి కౌన్సిల్ తరపున చేస్తారు. ఫెడరల్ కౌన్సిల్ సభ్యులందరూ విశ్వాస ప్రకటన లేఖల పైనా, ఇతర పత్రాలపైనా సంతకాలు చేస్తారు.

ఎన్నిక

[మార్చు]

ప్రెసిడెంటును ఫెడరల్ కౌన్సిల్ సభ్యుల నుండి, ఫెడరల్ అసెంబ్లీ ఒక సంవత్సరం కాలానికి ఎన్నుకుంటుంది[7] ఏటా జనవరి 1 న కొత్త ప్రెసిడెంటు పదవీకాలం మొదలై డిసెంబరు 31 న ముగుస్తుంది. దిగిపోయే ప్రసిడెంటు మళ్ళీ వెంటనే ఎన్నిక కావడానికి అనర్హులు.

పంతొమ్మిదవ శతాబ్దంలో, ఫెడరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడమంటే ఎంతో గౌరవనీయమైన ఫెడరల్ కౌన్సిల్ సభ్యులకు ఇచ్చే పురస్కారం లాగా ఉండేది. ప్రభుత్వంలో తక్కువ ప్రభావవంతమైన సభ్యులను పరిగణన లోకి తీసుకునేవారు కాదు. అలాంటి ఒక ఉదాహరణ విల్హెల్మ్ మాథియాస్ నాఫ్. అతను 27 సంవత్సరాల పాటు ఫెడరల్ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్నప్పటికీ 1853 లో ఒక్కసారి మాత్రమే ఫెడరల్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాడు.

ఇరవయ్యో శతాబ్దం నుండి, ఎన్నికలు సాధారణంగా నిర్వివాదంగా ఉంటూ వచ్చాయి. అత్యధిక కాలం పాటు ఫెడరల్ ప్రెసిడెంటుగా పనిచేయకుండా ఉన్న ఫెడరల్ కౌన్సిల్ సభ్యుడే అధ్యక్షుడవడం అలిఖిత నియమంగా ఉంటు వస్తోంది. అందువల్ల, ప్రతి ఫెడరల్ కౌన్సిల్ సభ్యుడూ కనీసం ఏడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడవుతాడు. ఎన్నికలలో కాస్తో కూస్తో ఉత్కంఠ కలిగించే ప్రశ్న ఏమిటంటే, ప్రెసిడెంటుగా ఎన్నికయ్యే వ్యక్తికి ఎన్ని ఓట్లు వస్తాయనేది. దీన్ని ప్రజాదరణ పరీక్షగా భావిస్తారు. 1970, 1980 లలో, 200 వోట్లు (గరిష్ఠం: 246) రావడం ఒక అద్భుతమైన ఫలితంగా భావించేవారు. కాని ప్రస్తుత పార్టీ-రాజకీయాల సంఘర్షణల కాలంలో, 180 వోట్లు పొందడం కూడా గౌరవనీయమైన ఫలితం గానే భావిస్తున్నారు. 

1920 వరకు, అధ్యక్షుడే విదేశీ వ్యవహారాల శాఖకు కూడా నాయకత్వం వహించడం ఆచారంగా ఉండేది. అందువల్ల ప్రతి సంవత్సరం, పదవీ విరమణ చేసిన ప్రెసిడెంటు తన మాజీ విభాగానికి తిరిగి వెళ్ళడం, కొత్త ప్రెసిడెంటు విదేశీ వ్యవహారాల శాఖను చేపట్టడం.. ఇలా పదవుల మారకం జరుగుతూ ఉండేది. అదేవిధంగా, ఫెడరల్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న సంవత్సరంలో స్విట్జర్లాండ్‌ను విడిచిపెట్టకపోవడం కూడా సాంప్రదాయంగా ఉండేది.

మూలాలు

[మార్చు]
  1. "How much does a federal councillor earn?" (official site). Berne, Switzerland: The Federal Council. 24 April 2017. Retrieved 2018-05-17.
  2. "SR 101 Federal constitution of the Swiss Confederation of 18 April 1999 (Status as of 12 February 2017), unauthorized English version" (official site) (in జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, and ఇంగ్లీష్). Berne, Switzerland: The Federal Council. 12 February 2017. Archived from the original on 21 జూన్ 2016. Retrieved 2018-03-23.
  3. Stojanović, Nenad (1 March 2016). "Party, Regional and Linguistic Proportionality Under Majoritarian Rules: Swiss Federal Council Elections". Swiss Political Science Review. 22 (1). Geneva, Switzerland: Swiss Political Science Association: 41–58. doi:10.1111/spsr.12208. ISSN 1662-6370.
  4. Government and Administration Organisation Act, Art. 19.
  5. Hug, Simon; Wegmann, Simone (1 June 2013). "Ten Years in the United Nations: Where Does Switzerland Stand?". Swiss Political Science Review. 19 (2). Geneva, Switzerland: Swiss Political Science Association: 212–232. doi:10.1111/spsr.12034. ISSN 1662-6370.
  6. "UN News - Swiss President, at General Assembly, Highlights Crucial Role of UN in Solving Crises" (Press release). New York City: UN News, United Nations. 20 September 2016.
  7. "SR 101 Federal constitution of the Swiss Confederation of 18 April 1999 (Status as of 12 February 2017), unauthorized English version" (official site) (in జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, and ఇంగ్లీష్). Berne, Switzerland: The Federal Council. 12 February 2017. Archived from the original on 21 జూన్ 2016. Retrieved 2018-03-23.