స్వీడిష్ ఫిల్మ్ దర్శకుడు బెర్గ్.మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వీడిష్ ఫిల్మ్ దర్శకుడు ఇంగమర్ బెర్గ్.మన్(Ingamar bergman 1919-2007) బెర్గ్.మన్ సినిమా కళను ఏ గురువు వద్ద అభ్యసించలేదు. ఆ కళను స్వయంకృషితో నేర్చుకొన్నాడు. నాట్యకాకలతో ఆయనకు మంచి ప్రవేశం ఉంది. సిటీ థియేటర్లలో రెసిడెంట్ దర్శకుడుగా సుదీర్ఘమయిన అనుభవం ఉంది. Inborge lo . Gothengurg lo. Malmo lo 1944-1958 మధ్యకాలంలో విచక్షణా రహితంగా విపరీతంగా సినిమాలు చూచేవాడు. Alfsjo Berg వద్ద సినిమా దర్శకత్వంలో శిక్షణ పొంది, సినిమకాల గురిచి నేర్చుకొన్నాడు. 1944 లో బెర్గ్ మన్ తయారుచేసిన తొలి స్క్రిప్ట్ Torment (Frenzy)కు Alfsjo Berg దర్శకత్వం వహించాడు. బెర్గ్ మన్ తొలి నాలుగు చిత్రాలకు నిర్మాత Marmstedt తను ఎంతో ఋణపడినట్లు బర్గ్ మన్ అన్నాడు. ఈ దశలోనే తను సినిమకళనుబాగా నేర్చుకొన్నాడట!

బెర్గ్ మన్ ప్రథానంగా రంగస్థలనికి సంబంధించిన వ్యక్తి. నాటక ప్రదర్శనల్లో, రంగస్థలనికి సంబంధించి చాలా ప్రత్యక్ష అనుభవం ఉంది. కానీ తను నాటక రచయిత కాదు. బెర్గ్ మన్ రాసిన నాటకాలు చాలా సాధారణ మయినవి(mediocre).కానీ నాటకాలను రంగశాలం మీద ప్రదర్శించడంలో ఆయన అసాధారణ ప్రగ్జాశాలి, జీనియస్, మేధావి. గెథె(Goethe), ఇబ్సేన్(Ibsen), August Strindberg నాటక రచయితల నాటకాలను రంగస్థలం మీద గొప్పగా పప్రదర్శించిన తీరు అంతర్జాతీయ ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. మాల్మో నగరంలో (Malmö)ఆయన గొప్ప నటీనటుల బృందాన్ని తయారుచేశాడు. వీళ్ళు రంగస్థలం మీద నటనలో పరిపూర్ణత సాధించారు. ఈ బృందం సభ్యులనే రకరకాల కలయికల ద్వారా బెర్గ్ మన్ తన సినిమాలలో ఉపయోగించుకొన్నాడు మాటిమాటికీ.

సమకాలంలో ఆయన సినిమాలలో నటించే నటులు ఆనాటి ప్రపంచ సినిమా నటులలో అతి గొప్ప నటులని పేరుపొందారు. ధ్వని, వెలుగునీడలను లయబద్ధంగా ఉత్తమ ఫలితాలను రాబట్టుకొనే విధంగా వాడుకోదడంలో మహానేర్పరి. మానవుల ముఖాలు వ్యక్తంచేసే భావాలను గురించి ఆయనకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. సినిమా తెరనిండుగా మనుషుల ముఖాలతో నింపి, ఆ ముఖాలలో వికతమయ్యే భావాలను చూపగలడు. ప్రేక్షకుల దృస్టిని ఆవిధంగా పూర్తిగా ఆ భావాల మీద కేంద్రీకృతం చేయగలడు. మహా ప్రతిభావంతులయిన ఫోటోగ్రఫీ దర్శకులు ఆయనకు సహకరించారు. గున్నర్ ఫిషర్ (Gunner Fisher), స్వెన( Sven Nykvist)ల విభిన్న మయిన లయిటింగ్, కెమెరపనితనం , శిల్పం బెర్గ్ మన్ సినిమాలకు ఆకృతినిచ్చాయి. ఇతరులు స్క్రీన్ ప్లే రాసిన, ఆయన దర్శకత్వం చేసిన Virgin spring, Brink of Life బెర్గ్ మన్ గొప్ప చిత్రాలుగా పేరు తెచ్చుకోలేదు. The Seventhseal(1957)Wild straberries(1957),Virfins' Spring(1960), Through of a Glass of Darkly(1961) ఆయన సినిమాలలో కొన్ని పేర్కొనదగినవి. టీవీ వచ్చాక, చాలా నిమాలు ఆ మాధ్యమానికి తగినట్లు తీశాడు. Scenes from a Marriage(1973) వంటివి పేూరుపొందాయి.

బెర్గ్ మన్ఏదో సాహిత్య సృష్టికి పూనుకోవాలనే దుగ్ధతో స్క్రీన్ ప్లే రచనకు పూనుకోలేదు. తనకు ఇస్టం అయిన కథలు ఇతరుల రచనలలో దొరకక మాత్రమే ఆయన తన సినిమాలకు సినేరియోలు తానే తయారుచేసుకొన్నాడు. తను స్వేచ్చగా, తన ఇస్టం ప్రకారం సినిమాలు తీయడానికి అంగీకరిచిన నిర్మాతలు దొరకడం తన అదృష్టం అంటాడు ఆయన. ఇందుచేతనే తను స్వీడన్ లో తప్ప మరే దేశంలో సినిమాలకు పనిచేయలేదంటాడు. ప్రపంచ సినిమాలలో తన ప్రత్యేకత ఒక్కటే,స్వేచ్ఛాయుత మయిన సృజనాత్మకత. బెర్గ్ మన్ తొలి సినిమాలలో నలుపు తెలుపుల మధ్య కాంట్రాస్ట్ ఎక్కువగా ఉండేది. ముఖాలలో భావాల ద్వారా మూడ్ ను వ్యక్తం చేసేవాడు. ఆయన సినిమాలలో స్త్రీపాత్రలు వివేకవతులుగా, ప్రగ్జావతులుగా, సెన్సిటివ్ గా కనిపిస్తారు. పాత్రలు నేర భావనతో బాధపడుతుంటారు."The sin of beeing born" బహుశా క్రయిస్తవమత భావన కావచ్చు. ట్రయాంగులర్ ప్రేమ కూడా ఆయన సినిమాలలో ఒక అంశం. బెర్గ్ మన్ సినిమా ఒక కళామాధ్యమంగా సాహిత్యానికి దగ్గరగా ఉంటుందని, సినిమాకు, సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉందని ఆయన భావిస్తాడు. మన భావావేశాలను దృశ్యం, సంగీతం రెండూ బాగా ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయం. ఈ రెండిటివల్ల సినిమా బుద్ధిద్వారా కాక, సూటిగా హృదయాన్ని తాకుతుందని అంటాడు. సినిమా ప్రధానంగా లయాన్వితం(rithamic) అంటాడు. బాల్యంనుంచీ సంగీతం తనకు విశ్రాంతి, ఆటవిడుపు, వినోదం అంటాడు. అదే తనకళకు ఉత్ప్రేరకం కూడా.తరచూ ఒక సినిమాను, నాటకాన్ని తాను సంగీతపరంగా ఆస్వాదించి, అనుభవించి, ఆనందించి, పలవరించేవాడినని అంటాడు.

మూలాలు: ఈ రచయిత పుణె ఫిల్మ్ అండ్ టీవి Instituteలో ఫిల్మ్ Appreciation కోర్సులో చూచిన సినిమాలు, విన్న పాఠాలు, నోట్సు ఆధారంగా.