హంటర్ కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వుడ్ తాఖీదు లోని సిఫార్సులను పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు, ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల గురించి ఏ చర్య తీసుకోవాలో పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడైన హంటర్ అధ్యక్షతన 1882 ఫిబ్రవరి 3న 20 మంది సభ్యులతో ఈ కమిషన్ నియమించాడు. ఇదే తొలి భారతీయ విద్యా కమిషన్ అయిన హంటర్ కమిషన్.[1]

కమీషన్ సూచనలు

[మార్చు]
 • స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి వీటి యాజమాన్యాన్ని భారతీయులు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలకు అప్పజెప్పాలి. ఈ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి.
 • ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి ప్రజావసరాసాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను తయారు చేయాలి.
 • ఈ ప్రణాళికకు అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా మాతృభాష ఉండాలి.
 • మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకోవాలి ఈ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు విడిచిపెట్టి ప్రభుత్వం వాటికి ఆర్థిక సహాయం చేయాలి.
 • ఉన్నత విద్యా నిర్వహణ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. కళాశాల నిర్వహణ బాధ్యతను పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పజెప్పాలి, అయితే ప్రభుత్వం కళాశాలలకు సహాయక విరాళనిచ్చి ప్రోత్సహించాలి.
 • ప్రాథమిక విద్య 7 నుంచి 8 సంవత్సరాలుగా ఉండాలి వాటిని రెండు భాగాలుగా విభజించాలి. 1 నుంచి 5తరగతులు మొదటి దశగా, 6 నుంచి 7 లేదా 8తరగతులు రెండవ దశగా ఉండాలి.
 • జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేసి జిల్లాల్లోని మక్తబ్, మదరస, ప్రాథమిక పాఠశాలను జిల్లా బోర్డు పరిధిలోకి తేవాలి. స్త్రీలలో విద్యావ్యాప్తికి ప్రైవేట్ బాలికల పాఠశాలలకు ఉదారంగా విరాళాలను ఇవ్వాలి. స్త్రీ విద్య వ్యాప్తికి సలహాలను ఇచ్చేందుకు స్త్రీ అధికారులచే ప్రాథమిక పర్యవేక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
 • ఉపాధ్యాయ శిక్షణ సంస్థను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలల్లో నియమించాలి. ఛాత్రోపాధ్యాయులకు ఉపాధ్యాయ బోధన సూత్రాలు బోధనా అభ్యసనం పై పరీక్షలు నిర్వహించాలి.

ఉపయోగాలు

[మార్చు]
 • 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమైనది.
 • 1887లో భారత పాఠశాలలో వాడుతున్న పాఠ్యపుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
 • 1889లో లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు ఈ కాలంలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు కానీ 1897 నుంచి 192 మధ్య కాలంలో వచ్చిన భయంకరపు కరువు ప్లేగు వ్యాధితో పాఠశాలలో పిల్లలు తగ్గిపోయారు. దీనితో పాఠశాలను మూసివేశారు. (1897 - 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు.)
 • 1901 లో సిమ్లాలో విద్యాసదస్సు నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యాసంస్థలు చర్చించారు.
 • 1901 లో బ్రహ్మచర్య పాఠశాలలను స్థాపించారు.
 • 1902 లో డాన్స్ సమాజం స్థాపించబడింది.
 • 1903లో కాంగ్రా గురుకులను హరిద్వార్ లో స్వాపించారు.
 • 1906 లో డాన్ సమాజంను జాతీయ విద్యా కౌన్సిల్ గా మార్చారు.
 • అందుకూరి వీరేశలింగం ఒక ఆస్తిక పాఠశాలలను స్థాపించాడు నీతి బ్రహ్మ సమాజ సిద్ధాంతం పై ఆధారపడి పనిచేసింది

మూలాలు

[మార్చు]
 1. Jayapalan, N. (2000). History of education in India. New Delhi: Atlantic Publishers and Distributors. p. 69. ISBN 8171569226. OCLC 49790641.