హంసధ్వని రాగం
స్వరూపం
(హంసధ్వని నుండి దారిమార్పు చెందింది)
హంసధ్వని రాగం హంస ధ్వని అంటే ఉచ్చ్ శ్వాస.. నిచ్ శ్వాసల ప్రక్రియనే హంస జపం దాని మూలం ఓకారం ముకారం ఉకారం శబ్ధ తరంగమే ధ్వని .హంసద్వని రాగం నాదమే బ్రహ్మం (Hamsadhvani, సంస్కృతం: हम्सध्वनि) కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఒక జన్య రాగం.[1] దీనిని సామాన్యంగా ధీర శంకరాభరణం జన్యంగా భావిస్తారు.
రాగ లక్షణాలు
[మార్చు]హంసధ్వని రాగం లో మధ్యమం గాని ధైవతం గాని లేవు. దీనిలోని స్వరాల ఆరోహణ అవరోహణలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ārohaṇa : S R2 G3 P N3 S
avarohaṇa : S N3 P G3 R2 S
ఈ రాగంలోని స్వరాలు: షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకళి నిషాధం.
రచనలు
[మార్చు]హంసధ్వని రాగం లో చాలా కీర్తనలు సాంప్రదాయ, సినీ సంగీతంలో ఉన్నాయి. ఇది సామాన్యంగా కచేరీ ప్రారంభంలో గానం చేయబడుతుంది. చాలా కీర్తనలు విఘ్నేశ్వరుని ప్రార్ధనగా రచించబడ్డాయి.
- రఘుకుల నాయక, శ్రీ రఘుకుల - త్యాగరాజ స్వామి
- గజవదన బేడువే - పురందర దాసు
- గం గణపతే - ముత్తయ్య భాగవతార్
- వాతాపి గణపతిం భజే - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications