Jump to content

హన్షిన్ కోషియన్ స్టేడియం

వికీపీడియా నుండి
హన్షిన్ కోషియన్ స్టేడియం

హన్షిన్ కోషియన్ స్టేడియం (జపనీస్ :阪神甲子園球場, ఆంగ్లం: Hanshin Koshien Stadium) అనేది కోషియెన్-చో, నిషినోమియా సిటీ, హ్యోగో ప్రిఫెక్చర్‌లో ఉన్న బేస్ బాల్ స్టేడియం. ఇది హన్షిన్ ఎలక్ట్రిక్ రైల్వే యాజమాన్యంలో ఉంది. ఇది హన్షిన్ టైగర్స్ మాతృ సంస్థ అయిన ప్రధాన ప్రైవేట్ రైల్వే పేరు హన్షిన్ ఎలక్ట్రిక్ రైల్వే. 1924లో ప్రారంభించబడిన హంషిన్ కోషియన్, జపాన్లోని మొదటి బేస్ బాల్ స్టేడియం.

కోషియన్ స్టేడియం స్కోర్‌బోర్డ్

మరమ్మతు

[మార్చు]

1995లో సంభవించిన గ్రేట్ హాన్షిన్ భూకంపంలో ఈ స్టేడియం దెబ్బతింది. దీనికి పగుళ్లు ఏర్పడ్డాయి, ప్రేక్షకులు కూచునే ప్రదేశంలో కొంత భాగం కూలిపోయింది. 2004 జూలైలో ఈ బేస్ బాల్ గ్రౌండ్ సౌకర్యాల మెరుగుదల కోసం నిర్మాణాత్మకమైన ప్రణాళిక ఒకటి తెరపైకి వచ్చింది.[1]

2008 లో ఆఫ్-సీజనులో నిర్మాణ పనులు ప్రారంభమైయ్యాయి. ఓవైపు స్టేడియంలో బేస్‌బాల్ ఆటలు జరుగుతూనే ఉన్నాయి. తరువాతి దశలు కూడా ఆఫ్-సీజను లోనే జరిగాయి. దీని ప్రధాన నిర్మాణం 2010 లో పూర్తయింది.[2]

స్కోర్‌బోర్డ్, అవుట్‌ఫీల్డ్ కంచె

ప్రణాళిక ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:[3]

  • సాధ్యమైనంత వరకు, బేస్ బాల్ మైదానాన్ని, ఐవీతో సహా, ఉన్నదున్నట్లుగానే ఉంచాలి. ఐవీ ఈ స్టేడియానికి చిహ్నంగా మారింది.
  • ఇన్‌ఫీల్డ్ మునుపు ఉన్నట్లు గానే పచ్చిక లేకుండా మట్టితో ఉంచాలి.[4]
  • అవుట్‌ఫీల్డ్ గతంలో ఉన్నట్లుగానే సహజమైన పచ్చికతో ఉంటుంది. ఈ మైదానానికి పైకప్పు ఉండదు.
  • గ్రాండ్ స్టాండ్ పై ఉన్న గిన్సాన్ పైకప్పును తొలగించి, స్తంభాలు లేని ఆధునిక గిన్సాన్ పైకప్పు వేసారు.
  • స్టేడియానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయడానికి సీటింగ్ సామర్థ్యాన్ని 47,808 మందికి తగ్గించారు.

మూలాలు

[మార్చు]
  1. Kelly, William W. (2018-11-13), "Introducing Hanshin Tigers Baseball", Sportsworld of the Hanshin Tigers, University of California Press, pp. 1–30, ISBN 978-0-520-29941-2, retrieved 2025-12-05{{citation}}: CS1 maint: work parameter with ISBN (link)
  2. "National Conference "From Double Helix to Human Genome" Commemorating the 100th Anniversary of the Birth of Aleksandr Aleksandrovich Bayev (January 19–21, 2004, Moscow)". Molecular Biology. 38 (4): 615–618. doi:10.1023/b:mbil.0000037016.44884.d3. ISSN 0026-8933.
  3. MINAMI, Masataka; KAMAHARA, Tenshin (2024-11-01). "A New Light for an Unchanging Atmosphere for the Next 100 Years: LED Lighting Installation at Hanshin Koshien Stadium". The Journal of The Institute of Electrical Engineers of Japan. 144 (11): 688–691. doi:10.1541/ieejjournal.144.688. ISSN 1340-5551.
  4. "ご著書の予備登録のお願い". Japanese Journal of Forest Planning. 34 (1): 63. 2000. doi:10.20659/jjfp.34.1_63_2. ISSN 0917-2017.

బాహ్య లింక్

[మార్చు]