Jump to content

హన్ మానెట్

వికీపీడియా నుండి

కంబోడియాలో 2023 జూలై 23వ తేదీ జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని హన్ సేన్ నేతృత్వంలోని కంబోడియన్ పీపుల్స్ పార్టీ విజయం సాధించింది[1]. నమా మాత్రంగా జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి హన్ సేన్ పాలక కంబోడియన్ పీపుల్స్ పార్టీని సమావేశపరిచి తన పెద్ద కుమారుడు హన్ మానెట్ ను బావి ప్రధానమంత్రిగా ఎంపిక చేయించారు[2]. కంబోడియా దేశంలో గత 40 సంవత్సరాలుగా హన్ సేన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2018 సంవత్సరంలో జరిగిన, గత ఎన్నికల్లో హన్ సేన్ మొత్తం 125 పార్లమెంట్ సీట్లకు గాను 125 సీట్లు గెలుచుకున్నారు. నియంత కైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానంగా 1985 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన హన్ సేన్ అప్పటినుండి ఇప్పటివరకు వెనదురికి చూసింది లేదు. 2013 సంవత్సరంలో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైన 2018 సంవత్సరంలో పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది. 40 సంవత్సరాల హన్ సేన్ పానాలలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది.

మూలాలు :

  1. "Cambodia to release official election results on Friday". suryaa (in ఇంగ్లీష్). Retrieved 2023-09-09.
  2. "Cambodian king appoints Hun Manet as new PM". The Economic Times. 2023-08-07. ISSN 0013-0389. Retrieved 2023-09-09.