Jump to content

హబుల్ అంతరిక్ష దూరదర్శిని

వికీపీడియా నుండి
(హబుల్ అంతరిక్ష టెలిస్కోపు నుండి దారిమార్పు చెందింది)
హబుల్ అంతరిక్ష దూరదర్శిని (Hubble Space Telescope (HST))
డిస్కవరీ అంతరిక్ష వాహనం నుండి కనబడుతున్న హబుల్ టెలీస్కోపు.
డిస్కవరీ తీసిన 'హబుల్ టెలీస్కోపు' చిత్రం.
General information
NSSDC ID[http://nssdc.gsfc.nasa.gov/database/MasterCatalog?sc=1990-037B 1990-037B 1990-037B]
OrganizationNASA / ESA / STScI
Launch dateఏప్రిల్ 24, 1990
DeorbitedLikely between 2013 and 2021[1]
Mass11,110 kg (24,250 lb)
Type of orbitవర్తులాకారం
Orbit height589 km (366 mi)
Orbit period96–97 min
Orbit velocity7,500 m/s (17,000 mph; 27,000 km/h)
Acceleration due to gravity8.169 m/s² (26.80 ft/s²)
Locationక్రింది స్థాయి భూకక్ష
Telescope styleRitchey-Chretien reflector
Wavelengthఆప్టికల్, అతినీలిలోహిత, near-infrared
Diameter2.4 m (94 in)
Collecting areaapprox. 4.5  (46 ft²)[2]
Focal length57.6 m (189 ft)
Instruments
NICMOSinfrared camera/spectrometer
ACSoptical survey camera
(mostly failed)
WFPC2wide field optical camera
STISoptical spectrometer/camera
(failed)
FGSthree fine guidance sensors
Websitehttp://www.nasa.gov/hubble · http://hubble.nasa.gov
http://hubblesite.org · http://www.spacetelescope.org

హబుల్ అంతరిక్ష దూరదర్శిని (ఆంగ్లం Hubble Space Telescope) భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్న దూరదర్శిని. 1990 లో నాసా ఈ దూరదర్శినిను ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరున దీని నామకరణం జరిగింది. అంతరిక్షంలోకి పంపిన దూరదర్శినిల్లో ఇది మొదటిదేమీ కానప్పటికీ, మిగతా వాటికంటే ఇది విస్తృతమైన కార్యకుశలత కలిగినది. దీని ముఖ్య ఉద్దేశం రోదశి లోతుల్లో ఉన్న నభోమూర్తుల అధ్యయనం. దీనిని డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా ఏప్రిల్ 1990 లో భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టారు.

2.4 మీ. దర్పణం కలిగిన ఈ దూరదర్శిని లోని నాలుగు ప్రధాన పరికరాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లోని అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్), దృగ్గోచర (విసిబుల్), సమీప పరారుణ (నియర్ ఇన్ఫ్రారెడ్) శ్రేణుల్లో పరిశీలించగలవు. భూ వాతావరణం బయట ఉండటాన హబుల్‌కు వాతావరణం వలన దృశ్యంలో కలిగే వక్రత ఉండదు. అంచేత అతి తక్కువ కాంతిని కూడా గ్రహించి భూస్థిత దూరదర్శినిల కంటే మెరుగైన రిజొల్యూషన్‌లో బొమ్మలు తీయగలదు.

ప్రయోగం

[మార్చు]

స్పేస్ షటిల్ చాలెంజరు దుర్ఘటన తరువాత షటిల్ కార్యక్రమాలు ఆగిపోవడంతో హబుల్ ప్రయోగం కొన్నేళ్ళ పాటు వాయిదా పడింది. 1988 లో షటిల్ కార్యక్రమాలి మళ్ళీ మొదలయ్యాయి. 1990 ఏప్రిల్ 24న డిస్కవరీ స్పేస్ షటిల్లో హబుల్‌ను అంతరిక్షంలోకి పంపించి భూ నిమ్న కక్ష్యలో ప్రతిక్షేపించారు.[3]

తొలి అంచనాలలో హబుల్ కార్యక్రమం ఖర్చు 40 కోట్ల డాలర్లు అవుతుందని భావించారు. ప్రయోగించేనాటికి 470 కోట్ల డాలర్లైంది. ప్రయోగించిన ఇరవై ఏళ్ళలో - 2010 వరకూ పెట్టిన మొత్తం ఖర్చు 1000 కోట్ల డాలర్లుగా తేలింది.[4]

ఆదిలో వైఫల్యం, అంతలోనే గెలుపు

[మార్చు]
An extract from a WF/PC image shows the light from a star spread over a wide area instead of being concentrated on a few pixels.

ప్రయోగించిన కొన్ని వారాల్లోనే హబుల్ పంపించిన బొమ్మల్లో నాణ్యతా లోపాలున్నట్లు గమనించారు. భూస్థిత దూరదర్శిని బొమ్మల కంటే ఇవి మెరుగ్గా ఉన్నప్పటికీ హబుల్ నుండి ఆశించిన స్థాయి స్పష్టత వాటిలో లేదు. దూరదర్శిని ఆప్టికల్ వ్యవస్థలో లోపం దీనికి కారణమని గుర్తించారు.[5][6] ప్రాథమిక దర్పణాన్ని సరైన ఆకారానికి పాలిష్ చెయ్యకపోవడమే లోపమని నిర్ధారించారు.[7]

మొదటి సర్వీసు యాత్ర

[మార్చు]

సమస్యను సరిచేసేందుకు నాసా ఒక సర్వీసు యాత్రను తలపెట్టింది. హబుల్ ను రిపేరు చేసేందుకు, అందుకు అవసరమైన పరికరాలను ఉపయోగించడం లోను ఏడుగురు వ్యోమగాములకు లోతైన శిక్షణ నిచ్చింది. 1993 డిసెంబరులో ఎండీవర్ షటిల్ ద్వారా వారిని అంతరిక్షంలోకి పంపింది. వాళ్ళు 10 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి హబుల్‌కు అవసరమైన అన్ని మరమ్మతులు పూర్తి చేసి తిరిగి వచ్చారు.[8]

హబుల్‌కు అవసరమైన అన్ని రిపేర్లూ జయప్రదంగా పూర్తయ్యాయని, అది స్పష్టమైన బొమ్మలౌ పంపిస్తోందనీ 1994 జనవరి 13 న నాసా ప్రకటించింది.[9]

అప్పటి నుండి 2009 మే వరకూ నాసా మరొక నాలుగు (మొత్తం ఐదు) సర్వీసు యాత్రలు చేపట్టి హబుల్‌కు అవసరమైన కొత్త హంగులను సమకూరుస్తూ వచ్చింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 2003 Estimate of Hubble re-entry. A planned reboost during SM4 (Final Shuttle Mission to Hubble Similar to Previous Servicing Flights) is expected to extend the telescope's life until around 2020.
  2. SYNPHOT User's Guide, version 5.0, Space Telescope Science Institute, page 27
  3. "STS-31". NASA. Archived from the original on 2011-08-18. Retrieved April 26, 2008.
  4. "James Webb Space Telescope (JWST) Independent Comprehensive Review Panel (ICRP) Final Report" (PDF). NASA. p. 32. Retrieved September 4, 2012.
  5. Burrows, Christopher J.; Holtzman, Jon A.; Faber, S. M.; Bely, Pierre Y.; et al. (March 10, 1991). "The imaging performance of the Hubble Space Telescope". Astrophysical Journal Letters. 369: L21–L25. Bibcode:1991ApJ...369L..21B. doi:10.1086/185950.
  6. Heyer, Biretta; et al. (2004). "WFPC2 Instrument Handbook". 9.0. Baltimore: STScI. Chapter 5.1. Retrieved April 26, 2008.
  7. Waldrop, MM (August 17, 1990). "Hubble: The Case of the Single-Point Failure". Science Magazine. 249 (4970): 735–736. Bibcode:1990Sci...249..735W. doi:10.1126/science.249.4970.735. PMID 17756776.
  8. "Servicing Mission 1". NASA. Archived from the original on 2008-04-20. Retrieved March 28, 2016.
  9. Trauger, J. T.; Ballester, G. E.; Burrows, C. J.; Casertano, S.; et al. (1994). "The on-orbit performance of WFPC2". Astrophysical Journal Letters. 435: L3–L6. Bibcode:1994ApJ...435L...3T. doi:10.1086/187580.

బయటి లింకులు

[మార్చు]

అధికారికమైన

[మార్చు]

చరిత్ర

[మార్చు]

వార్తలు

[మార్చు]