హరి సింగ్ నల్వా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సర్దార్ హరి సింగ్ నల్వా | |
---|---|
స్థానిక పేరు | ਹਰੀ ਸਿੰਘ ਨਲੂਆ |
మారుపేరు |
|
జననం | 1791 Gujranwala, Sikh Confederacy |
మరణం | 1837 (aged 45–46) Jamrud, Sikh Empire |
రాజభక్తి | Sikh Empire |
సేవలు/శాఖ | సిక్కు ఖల్సా సైన్యం |
సేవా కాలం | 1804–1837 |
ర్యాంకు |
|
పనిచేసే దళాలు | |
పోరాటాలు / యుద్ధాలు | కాసూరు యుద్ధం (1807), అటోక్ యుద్ధం (1813), ముల్తాన్ యుద్ధం (1818), షోపియన్ యుద్ధం (1819), మంగల్ యుద్ధం (1821), మంకేరా యుద్ధం (1821), నౌషెరా యుద్ధం (1823), సిరికోట్ యుద్ధం (1824), సైదు యుద్ధం (1827), పెషావర్ యుద్ధం జూమ్ రుఢ్ యుద్ధం |
పురస్కారాలు | ఇజాజీ సర్దారీ |
సంబంధీకులు |
|
హరి సింగ్ నల్వా (1791–1837) సిక్కు సామ్రాజ్యపు సిక్కు ఖల్సా సైన్యంలో సేనాధిపతి. కాసూర్, సియాల్ కోట్, అటోక్, ముల్తాన్, కాశ్మీర్, పెషావర్, జాంరుధ్ రాజ్యాలను జయించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పాకిస్తాన్ లోని హరిపూర్ నగరం అతని పేరుమీదుగా స్థాపించాడు.
సిక్కు సామ్రాజ్యాన్ని సింధు నది దాటి కైబర్ కనుమ దాకా విస్తరించడంలో హరిసింగ్ ప్రముఖ పాత్ర పోషించాడు. కాశ్మీరు, పెషావర్, హజారా రాజ్యాలకు గవర్నరుగా పనిచేశాడు. కాశ్మీరు, పెషావర్ లలో శిస్తు వసూలుకు వీలుగా అక్కడ ఓ టంకసాలను నిర్మించాడు. [3]
బాల్యం
[మార్చు]హరి సింగ్ నల్వా పంజాబ్ లోని మాజా ప్రాంతంలోగల గుజ్రాన్ వాలాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు గురుదాస్ సింగ్ ఉప్పల్, ధరం కౌర్ ఉప్పల్. 1798 లో అతని తండ్రి చనిపోయాన తల్లి అతన్ని పెంచి పెద్దచేసింది. 1801 లో సిక్కు సాంప్రదాయం అమృత్ సంచార్ ప్రకారం ఉపనయనం జరిగింది. పన్నెండేళ్ళ వయసు నుండి తండ్రి ఎస్టేటు బాధ్యతలను స్వీకరించాడు. అప్పుడే గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాడు. [4]
1804 లో అతని తల్లి ఒక ఆస్తి తగాదాను పరిష్కరించుకురమ్మని మహారాజా రంజిత్ సింగ్ ఆస్థానానికి పంపింది. రంజిత్ సింగ్ అతని వ్యవహార దక్షత, అతని నేపథ్యాన్ని చూసి తీర్పు అతనికే అనుకూలంగా చెప్పాడు. హరి సింగ్ తన తాత, తండ్రులు రంజీత్ సింగ్ పూర్వీకులైన మహా సింగ్, చరత్ సింగ్ ల సంస్థానాల్లో పనిచేసినట్టు చెప్పాడు. గుర్రపు స్వారీలో, కత్తి పట్టడంలో తన నైపుణ్యాన్ని రాజుకు చూపించాడు. అందుకు సంతోషించిన రాజు అతన్ని తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. [5]
గమనికలు
[మార్చు]- ↑ Sandhu (1935), p. 4
- ↑ 2.0 2.1 2.2 2.3 Singhia (2009), p. 96
- ↑ Herrli (2004), pp. 122–123
- ↑ Sandhu (1935), pp. 2–3
- ↑ Sandh (1935), p. 4
మూలాలు
[మార్చు]- Sandhu, Autar Singh (1935), General Hari Singh Nalwa, Lahore: Cunningham Historical Society
- Herrli, Hans (2004), The Coins of the Sikhs (Reprinted ed.), Delhi: Munshiram Manoharlal, ISBN 8121511321
- Singhia, H. S. (2009), The encyclopaedia of Sikhism, New Delhi: Hemkunt Press