Jump to content

హవల్దార్ ఆలం బేగ్

వికీపీడియా నుండి
1857 భారత తిరుగుబాటు సమయంలో బెంగాల్ ఆర్మీ

హవల్దార్ ఆలం బేగ్ - బెంగాలీ ఇన్ఫాంట్రీకి చెందిన ఆయన  1857 సిపాయిల తిరుగుబాటులో కొంతమంది తెల్లవారిని చంపేశాడు. దీంతో తెల్లవారు వెంటాడి వేటాడి ఆయన్ని పట్టుకొని ఫిరంగికి వేలాడదీసి మరీ కాల్చిచంపారు. సిపాయిల తిరుగుబాటు అణచివేతకు, తెల్లవారి విజయానికి ప్రతీకగా ఆయన పుర్రెను బ్రిటన్కు తరలించి ట్రోఫీలా ప్రదర్శనకు పెట్టారు. అది బ్రిటన్ కెంట్ రాష్ట్రంలోని లార్డ్ క్లైడ్ పబ్లో ఉంది అని చరిత్రకారులు గుర్తించారు.

జీవితం

[మార్చు]

అతను బెంగాల్ స్థానిక పదాతిదళం 46వ రెజిమెంట్ కు చెందిన సిపాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో సియాల్‌కోట్‌లో పనిచేసేవాడు. పంజాబ్‌లో ఒక బ్రిటిష్ మిషనరీ కుటుంబాన్ని హతమార్చడంతో అతనిని తెల్లవారు ఫిరంగితో పేల్చి చంపారు. అంతేకాకుండా వారి విజయానికి చిహ్నంగా అతని పుర్రెను ట్రోఫీగా ఇంగ్లాండ్‌కు తీసుకువెళ్లారు. 1963లో కెంట్‌లోని వాల్మర్‌లోని లార్డ్ క్లైడ్ పబ్‌లో కనుగొనబడింది. 2014లో చరిత్రకారుడు వాగ్నర్‌కు పబ్ యజమానులు ఇచ్చే వరకు ఇది అక్కడే ఉంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం దాని ప్రామాణికతను ధ్రువీకరించింది. బంధువులు, స్నేహితులు రాసిన లేఖలతో సహా వివిధ వనరులను ఉపయోగించి సాక్ష్యాలతో పాటు హవల్దార్ ఆలం బేగ్ చరిత్రకు వాగ్నర్ అక్షరరూపం ఇచ్చారు.

ది స్కల్ ఆఫ్ ఆలం బేగ్: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ఎ రెబల్ ఆఫ్ 1857

[మార్చు]

పదకొండు అధ్యాయాల 'ది స్కల్ ఆఫ్ ఆలం బేగ్' పుస్తకం 1857లో జరిగిన తిరుగుబాటుదారుడి జీవిత చరిత్ర ఆధారంగా కిమ్ ఎ. వాగ్నర్ రచించారు. 256 పేజీల దీన్ని 2017లో సి. హర్స్ట్ అండ్ కో ప్రచురించింది.[1][2]

1963లో, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఒక పబ్‌లో మానవ పుర్రె కనుగొనబడింది. దానితో పాటు చేతి రాతలో ఉన్నచిట్టీ కూడా భద్రపరిచి ఉంది. 1857 తిరుగుబాటులో ఫిరంగితో చంపబడిన బ్రిటిష్ సేవలో భారతీయ సైనికుడైన హవల్దార్ ఆలం బేగ్ అని తేలింది. ప్రతీకారం తీర్చుకున్న ఒక ఐరిష్ అధికారి అతని పుర్రెను  ట్రోఫీగా తరలించాడు.

పందొమ్మిదవ శతాబ్దపు అతి పెద్ద తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ భారతదేశంలో ఆవిష్కృతం అయిన దృశ్యాలకు స్పష్టమైన కథనాన్ని కిమ్ వాగ్నర్ రాసారు. శరీర భాగాలను సేకరించడం, ప్రదర్శించడం కోసం విక్టోరియన్‌ల భయంకరమైన చేష్టలు.. ఈ పుస్తకంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదం క్లిష్టమైన అంచనాను అందిస్తుంది. ఇందులో సామ్రాజ్య వారసత్వాలపై 'తిరుగుబాటు' సమకాలీన చర్చలను కళ్లకు కట్టినట్టు ఉంటుంది.

బ్రిటిష్‌ సేనలు భారతీయ సిపాయిల పట్ల ఎలా వివక్ష ప్రదర్శించేవో, తిరుగుబాటు చేస్తే ఎంత క్రూరంగా హింసించేవారో ఈ పుస్తకంలో వాగ్నర్‌ వివరించారు. ఫిరంగికి కట్టి పేల్చటం ద్వారా శరీరాన్ని తునాతునకలు చేసేవారు. తద్వారా హిందువులైనా, ముస్లింలైనా వారి ఆచార సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరపటానికి కూడా వీలులేకుండా క్రూరంగా వ్యవహించారు. హవల్దార్ ఆలం బేగ్ పుర్రెను భారతదేశానికి తిరిగి తీసుకెళ్లి ట్రిమ్ము ఘాట్‌ పోరాటం జరిగిన రావి నది వద్ద గౌరవప్రదంగా ఖననం చేయాలన్నది తన ఆశయమని వాగ్నర్‌ రాసుకున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "The Skull of Alum Bheg | Hurst Publishers". HURST (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 25 December 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Newsinger, John (1 July 2019). "The Skull of Alum Bheg: the life and death of a rebel of 1857 by Kim A. Wagner". Race & Class (in ఇంగ్లీష్). 61 (1): 110–111. doi:10.1177/0306396818801216. ISSN 0306-3968.(subscription required)
  3. Wikisource link to https://en.wikipedia.org/wiki/The_Skull_of_Alum_Bheg. వికీసోర్స్.