హీరాలాల్ సామరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీరాలాల్ సామరియా

కేంద్ర సమాచార కమిషన్ ( సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ) ముఖ్య కమిషనర్ గా హీరాలాల్ సామరియా బాధ్యతలు స్వీకరించారు[1]. ప్రస్తుతం సమాచార కమిషనర్ హోదాలో ఉన్న 1985 బ్యాచ్ కు చెందిన తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి అయిన హీరాలాల్ కు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది[2]. 2023 నవంబర్ 6వ తేదీన న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు[3]. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ సామరియా గుర్తింపు పొందారు[4]. ఈయన 2025 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగునున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కు చెందిన హీరాలాల్ సామరియా సిఐసి చీఫ్ కమిషనర్ గా రెండేళ్ల కాలానికి గాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1960 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా కుగ్రా గ్రామంలో హీరాలాల్ సామరియా జన్మించారు. ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ గా, విద్యుత్ రంగంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ గా, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖలో సెక్రెటరీగా పనిచేశారు. 2020 సంవత్సరం నవంబర్ 7వ తేదీన కేంద్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమితులై... ఇప్పుడు ముఖ్య కమిషనర్ గా పదోన్నతి పొందారు.

మూలాలు :

  1. "కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్‌గా హీరాలాల్‌ సామరియా". EENADU. Retrieved 2024-02-06.
  2. Bureau, The Hindu (2023-11-06). "Heeralal Samariya sworn in as Chief Information Commissioner". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-02-06.
  3. "Heeralal Samariya appointed as chief information commissioner". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-11-06. Retrieved 2024-02-06.
  4. "Heeralal Samariya sworn in as Chief Information Commissioner". The Times of India. 2023-11-06. ISSN 0971-8257. Retrieved 2024-02-06.