హృదయశ్వాసకోశ పునరుజ్జీవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cardiopulmonary resuscitation
Intervention
CPR training-04.jpg
CPR being performed on a medical-training manikin
ICD-9మూస:ICD9proc
MeSHD016887
OPS-301 codeమూస:OPS301
MedlinePlus000010

హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య (Cardiopulmonary resuscitation - కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - CPR - సీపీఆర్) అనగా వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోని స్థితిలో ఉన్ననప్పుడు వెంటనే ఆ చర్యల పునరుద్ధరణకు చేయు అత్యవసర ప్రక్రియ.హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణాలను రక్షించే విధానం. తక్షణ హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడ వచ్చును [1]

హృదయశ్వాసకోశ పునరుజ్జీవన[మార్చు]

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దాని ప్రకారం ఆరోగ్య సంరక్షకులు వచ్చేవరకు గుండెపోటు పడిన వ్యక్తి ని చేతుల ద్వారా మాత్రమే( సి.పి .ఆర్ ) నిమిషానికి 100 నుండి 120 వరకు ఇవ్వ వలెను . పల్స్, శ్వాస ఉందా అని చూడాలి ,10 సెకన్లలో శ్వాస లేదా పల్స్ లేకపోతే, ఛాతీ కుదింపులను ప్రారంభించండి. రెండు రెస్క్యూ శ్వాసలను ఇచ్చే ముందు 30 ఛాతీ కుదింపులతో సిపిఆర్ ప్రారంభించవలెను . ఈ ప్రథమ చికిత్స ప్రారంభించే ముందు గుండెపోటు బారిన పడిన వ్యక్తికి వాతావరణం సురక్షితంగా ఉందా, స్పృహ లేదా అపస్మారక స్థితిలో ఉన్నారా, వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించినట్లయితే, అతని లేదా ఆమె భుజానికి నొక్కండి లేదా కదిలించండం , ఈ క్రియకు ఒకవేళ వ్యక్తి స్పందించకపోతే, ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉంటే, ఇంకొక వ్యక్తి స్థానిక అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి ఆసుపత్రులకు సమాచారం చేరవేయవలెను . అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం గుండె పోటు పడిన వ్యక్తులకు తక్షణమే శ్వాస ను ఇవ్వడం ( నోటి ద్వారా , బయట నుంచి ) , గుండె ఫై నొక్కడం వంటి చర్యలతో వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడ వచ్చును [2]

భారతదేశం[మార్చు]

భారత దేశ జనాభాలో 98% మంది హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య (సిపిఆర్) యొక్క ప్రాధమిక పద్ధతిలో శిక్షణ పొందలేదు, ఇది ఒక సర్వే లో మనకు కనబడుతుంది . గుండె పోతూ సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడటానికి ఇది చాలా కీలకమైన , ప్రాథమిక విధానం. అమెరికా , జపాన్, సింగపూర్ , యూరప్ దేశాల విద్యావిధానం లో హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య ను బోధించ వలననని చట్టబద్ధం గా చేశారు [3] హృదయాశ్వాసకోశ పునరుజ్జీవనంపై అవగాహన లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజూ గుండె పోటు కారణంగా 1.15 లక్షల మంది మరణిస్తున్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, సంవత్సరంలో గుండె పోటు కారణంగా సంవత్సరంలో దాదాపు 5.8 కోట్ల మంది మరణిస్తున్నారు. గుండె పోటు సమయంలో, రోగికి ఆకస్మిక రక్త ప్రసరణ, శ్వాసను పునరుద్ధరించడానికి అత్యవసర ప్రక్రియ అయిన హృదయాశ్వాసకోశ పునరుజ్జీవనం ( సిపిఆర్ ) పై వైద్యులు , ప్రజలు తెలుకొనవలెను [4]


మూలాలు[మార్చు]

  1. "What is CPR". cpr.heart.org (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
  2. "Cardiopulmonary resuscitation (CPR): First aid". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
  3. Sep 28, Sreemoyee Chatterjee / TNN /; 2016; Ist, 18:16. "98% Indians not trained in Cardiopulmonary Resuscitation, the basic life-saving technique: Study | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Reporter, Staff (2013-04-07). "'About 1.15 lakh people die due to cardiac arrest every day in the world'". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2020-11-24.