హెకానీ జఖాలు కేన్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హేకాని జఖాలు కేన్సే మేఘాలయ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దీమాపూర్ III శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2][3][4]

జననం & విద్యాభాస్యం[మార్చు]

హెకానీ జఖాలు యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం నుంచి 2013లో లా విద్యను పూర్తి చేసి అమెరికాలో పనిచేసి, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.ఆమె ఆ తరువాత తన స్వరాష్ట్రం నాగాలలాండ్‌కు వెళ్లి యూత్‌నెట్‌ ఎన్‌జీవో సంస్థను స్థాపించి దాదాపు 23,500 మంది లబ్ధి పొందారు. హెకానీ చేసిన సేవలకుగాను 2018లో నారీ శక్తి పుస్కారం అందుకుంది.[5]

రాజకీయ జీవితం[మార్చు]

హెకానీ జఖాలు దీమాపూర్ III నియోజకవర్గం నుండి నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి అజెటో జిమోమిపై   1,536 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

నాగాలాండ్‌ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. హెకానీ జఖాలు ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా రికార్డు సృష్టించగా ఆ తర్వాత సల్హౌతునొ క్రుసె ఎమ్మెల్యేలుగా గెలిచి నాగాలాండ్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్న మొదటి మహిళా ఎమ్మెల్యేలుగా రికార్డులకెక్కారు.[6]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (3 March 2023). "మేఘాలయాలో అతి పెద్ద పార్టీగా ఎన్పీపీ". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
  2. The Indian Express (2 March 2023). "Nagaland Assembly Election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
  3. Eenadu (2 March 2023). "60 ఏళ్ల నాగాలాండ్‌ చరిత్రలో సరికొత్త రికార్డు .. తొలిసారి అసెంబ్లీకి మహిళలు". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
  4. Eenadu (3 March 2023). "నాగాలాండ్‌.. నాయకి". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
  5. Zee Business (2 March 2023). "Who is Hekani Jakhalu? Meet the first-ever woman MLA of Nagaland". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023. {{cite news}}: |last1= has generic name (help)
  6. Big TV (2 March 2023). "నాగాలాండ్‌లో అరుదైన గెలుపు.. అసెంబ్లీలో తొలిసారి మహిళా ఎమ్మెల్యే అడుగు." Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.