హెన్లి పాస్ పోర్ట్ ఇండెక్స్ - 2023
లండన్ కు చెందిన ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ 2023 సంవత్సరానికి గాను ' హెన్లి పాస్ పోర్ట్ ఇండెక్స్ ' ను 2023 జూలై 19వ తేదీన విడుదల చేసింది[1]. 227 దేశాల పాస్ పోర్ట్ లతో రూపొందించిన ఈ జాబితాలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ నిలిచింది. సింగపూర్ పాస్ పోర్ట్ ఉంటే ఎలాంటి వీసా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో పర్యటించవచ్చు. ఈ జాబితాలో ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్ దేశాలు రెండో స్థానంలో నిలిచాయి. హెన్లి పాస్ పోర్ట్ ఇండెక్స్ - 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన పాస్ పోర్ట్ జాబితాలో భారతదేశం 85 వ స్థానంలో నిలిచింది[2]. 2022 సంవత్సరంతో పోలిస్తే భారతదేశం రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. గత సంవత్సరం 87వ స్థానం నుండి ప్రస్తుతం 85వ స్థానానికి చేరుకుంది.
మూలాలు :
- ↑ "Powerful Passports 2023 : ప్రపంచంలోని శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?". The Economic Times Telugu. Retrieved 2023-09-21.
- ↑ Telugu, TV9 (2023-01-11). "Passport: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఇదే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే." TV9 Telugu. Retrieved 2023-09-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)