హైడ్రా, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ
(హైడ్రా )
స్థాపనజులై 2024
కార్యస్థానం
యజమానిsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కమిషనర్ఏవీ రంగనాథ్‌

హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) (ఆంగ్లం: HYDRA - Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 2024లో ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటైంది. దీనికి మొదటి కమిషనర్‌ గా ఐపిఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ వ్యవహరిస్తున్నాడు.[1] 1996 బ్యాచ్‌ లో డీఎస్పీగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు బాధ్యతలు నిర్వహించి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు పొందాడు.[2]

ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో-99) మేరకు జులై 2024లో ఏర్పాటైనా హైడ్రా ప్రధాన లక్ష్యం హైదరాబాదులోని చెరువులు, పార్కులు, లేఅవుట్‌లోని ఖాళీ స్థలాలు, ఆట స్థలాలు, నాలాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, వాటిలోని ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టడం.[3]

జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఏర్పాటయిన హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై ప్రభుత్వ ఆదేశానుసారం మరింత అధ్యయనం జరగనుంది. ఇక హైడ్రాకు దాదాపు 3 వేల మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించనున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "18 ప్రాంతాలు.. 43.94 ఎకరాలు! | HYDRA reclaims 43. 94 acres from encroachers in three months | Sakshi". web.archive.org. 2024-08-26. Archived from the original on 2024-08-26. Retrieved 2024-08-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Hydra Commissioner,AV Ranganath: హైడ్రాకు రేవంత్ ఏరికోరి తెచ్చుకున్న ఏవీ రంగనాథ్.. సంచలన కేసులకు కేరాఫ్ - who is av ranganath hyderabad disaster response and assets monitoring and protection hydra commissioner - Samayam Telugu". web.archive.org. 2024-08-26. Archived from the original on 2024-08-26. Retrieved 2024-08-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "HYDRA: 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్‌ | hydra-demolished-166-constructions-in-hyderabad". web.archive.org. 2024-08-26. Archived from the original on 2024-08-26. Retrieved 2024-08-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)