హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్
హెచ్‌ఎమ్‌టివి ఈ సంస్థ సమర్పణల్లో ఒకటి
ఆవిర్భావము 2007
Network హెచ్ ఎమ్ టివి, ది హన్స్ ఇండియా
దేశం భారతదేశం
భాష తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ
ప్రధాన కార్యాలయం హైదరాబాదు
వెబ్సైటు http://www.hmtvlive.com/ http://www.thehansindia.info/


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ మీడియా సంస్థ. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ హెచ్ ఎం టీవి, ఇంగ్లష్ పత్రిక ది హన్స్ ఇండియాలను ఈ సంస్థే ప్రమోట్ చేస్తోంది. ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి ఈ గ్రూప్‌కు వ్యవస్థాపక ఛీఫ్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్. కపిల్ గ్రూపు సంస్థల అధ్యక్షులు కె వామన రావు ఈ గ్రూప్ వ్యవస్థాపకులు.

హెచ్ ఎం టీవి తెలుగులో ఒక ప్రధాన 24 గంటల వార్తా ఛానల్. హైదరాబాద్ మీడియా హౌజ్ అనే సంస్థ దీనిని ప్రమోట్ చేస్తోంది. తెలుగుతో పాటూ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో రెండు వార్తా బులిటెన్లు ఈ ఛానల్‌లో ప్రసారం అవుతాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ఈ ఛానల్ నిర్వహించిన దశ దిశ కార్యక్రమానికి తెలుగు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

మిగిలిన తెలుగు ఛానళ్ల వలె బ్రేకింగ్ అంటూ ప్రాధాన్యత లేని వార్తలను, లేదా చిన్న అంశానికి అనసవర హైప్ క్రియేట్ చేయడం వంటి టిఆర్‌పి ట్రిక్కులకు హెచ్‌ ఎం టివి దూరం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో ప్రజలకు అవసరం లేని పార్శ్వాలను కూడా ఈ ఛానల్ స్పృశించదు. క్రైమ్‌ను కేవలం వార్తలుగానే చూపిస్తుంది తప్ప నేర కథనాలను పాత్రలతో చిత్రీకరించి ప్రసారం చేయడం వంటి పనులు చేయదు. ప్రాంతీయ, కుల, మత, వర్గ, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వంతంగా పనిచేసే చానల్. సామాజిక బాధ్యతతో వివిధ ఉద్యమాలు నిర్వహించింది.

ది హన్స్ ఇండియా

ది హన్స్ ఇండియా ఒక ఇంగ్లీష్ దినపత్రిక. 2011 జూలై 15న హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటూ, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతిలలో దీనికి ఎడిషన్‌లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు ఇందులు వ్యాసాలు రాస్తున్నారు.

హైదరాబాద్ మీడియా హౌస్ కార్యాలయము, హైదరాబాదు