హైబ్రిడ్ డ్రైవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైబ్రిడ్ డ్రైవ్ లేదా హైబ్రిడ్ హార్డ్ డిస్క్ (ఆంగ్లం:Hybrid drive) అనేది కంప్యూటరులో ఉపయోగించే ఒక తార్కిక లేదా భౌతిక నిల్వ పరికరం. ఇది హార్డ్ డిస్క్ డ్రైవ్ (HDD) తో NAND ఫ్లాష్ సాలిడ్-స్టేట్ డ్రైవ్ (SSD) వంటిది కూడిన వేగవంతమైన నిల్వ మాధ్యమం. హైబ్రిడ్ డ్రైవ్ అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగవంతమైన, ఎక్కువ కెపాసిటి కలిగిన ప్రయోజనం కొరకు రూపొందించబడింది. సాలిడ్-స్టేట్ డ్రైవులు హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల వేగం కంటే చదవడం/వ్రాయడం లో చాలా వేగాన్ని కలిగివుంటాయి, ఎక్కువ కెపాసిటీ ఉన్న సాలిడ్-స్టేట్ డ్రైవ్ కొనాలంటే చాలా ఎక్కువ ఖరీదు, అందువలన హైబ్రిడ్ డ్రైవ్ లో చాలా వేగంగా పనిచేయుటకు తక్కువ నిల్వ సామర్థ్యమున్న సాలిడ్-స్టేట్ డ్రైవ్‌ను, తక్కువ ఖరీదులో లభించే ఎక్కువ నిల్వ సామర్థ్యమున్న హార్డ్ డిస్క్ డ్రైవ్‌ను మిళితం చేశారు.