Jump to content

వికీపీడియా:మాతో సంప్రదింపు/అనుమతి

వికీపీడియా నుండి
(‌వికీపీడియా:మాతో సంప్రదింపు/అనుమతి నుండి దారిమార్పు చెందింది)
Contact us

వేరే చోట విడుదలచేసిన ‌విషయం (పాఠ్యం, బొమ్మలు) నాదికాని లేక నకలుహక్కుల కర్తనుండి అనుమతి పొందాను కాబట్టి నేను వికీపీడియాలో చేర్చుదామనుకుంటున్నాను.

లైసెన్స్ మూల విడుదల జరిగిన సైట్ దగ్గర (ఆన్లైన్ అయితే) లేక ఈ మెయిల్ ద్వారా ధృవపరచుకోవచ్చు. ధృవపరచుకోవడానికి పూర్తి వివరాలు , మీకే నకలుహక్కులు వుంటే నకలుహక్కులగల సమాచారాన్ని దానం చేయటం (ఆంగ్లం), లేక మీకు నకలుహక్కులు లేకపోతే నకలుహక్కులు అనుమతి అభ్యర్థన(ఆంగ్లం) చూడండి.

కామన్స్ లో చేర్చటానికి,ఈమెయిల్ ద్వారా ధృవపరచుకోవాలంటే permissions-commons@wikimedia.org కు మెయిల్ చేయండి. ఆ ఈ మెయిల్ లో తప్పనిసరిగా పొందుపర్చవలసినవి:

  1. మూల మాధ్యమానికి సంపర్కం. మీ ఈ మెయిల్ చిరునామా లేకు మీరు ఎవరితరపున అనుమతి ఇస్తున్నారో ఆ వ్యక్తి ఈ మెయిల్ మూల వనరుకు స్పష్టమైన సంపర్కం
  2. నకలు హక్కుల యజమాని గుర్తింపు.
  3. విడుదల చేయదలచుకున్న నకలు హక్కు లైసెన్స్. మీరు ఎంచుకున్న లైసెన్స్ తప్పనిసరిగా విషయాన్ని స్వేచ్ఛగా మరియు వుచితంగా ఎవరిచేతైనా నకలు మరియు మార్పు (వికీపీడియాకు సంబంధంలేని వారుకూడా), ఏవిధమైన లక్ష్యాలకైనా. వ్యాపార దృక్పథంకూడా దీనిలో భాగమే( చూడండి Licensing/Justifications అలా ఎందుకు అనే మరిన్ని వివరాలకోసం.) మేము సిఫారస్ చేసే క్రియేటివ్ కామన్స్ ఎట్రిబ్యూషన్ -షేర్ఎలైక్ 3.0 లైసెన్స్(Creative Commons Attribution-ShareAlike 3.0 license). పాఠ్యమైతే , మీరు హక్కుదారులైతే క్రియేటివ్ కామన్స్ ఎట్రిబ్యూషన్ -షేర్ఎలైక్ 3.0 లైసెన్స్ మరియు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్(GNU Free Documentation license) ( రూపమార్పులు లేకుండా,మార్చలేని విభాగాలు , ముఖ పత్ర పాఠ్యము, లేక చివరి పేజీ పాఠ్యము లేకుండా).
  4. సంబంధించిన సమాచారం వికీ ప్రాజెక్టులలోకి ఎగుమతి చేసినట్లయితే దాని లింకు. సంబంధించిన సమాచారం వికీ ప్రాజెక్టులలోకి ఎగుమతి చేసినట్లయితే దాని లింకు చేర్చండి.

పై వివరాలు లేకుండా పంపించే ఈమెయిల్ పరిశీలించబడవు. అసౌకర్యానికి చింతిస్తున్నాము. వికీపీడియాలో మాత్రమే ఉచితంగా వాడుకోటానికి అని అనుమతినిచ్చిన కృతులను స్వీకరించలేము. ఎందుకంటే అనుమతినిచ్చిన కృతులు, షరతులకు లోబడి వికీపీడియా బయట వాడలేదని ఖచ్చితంగా హామీ ఇవ్వలేము. అందుకని ముందస్తుగానే కేవలం వికీపీడియాలోనే మాత్రమే వాడుకోవటానికి అనుమతినిచ్చిన వాటిని తీసుకోవటం లేదు.

ఉదాహరణ

[మార్చు]
నా కలం-నా గళం
నా కలం- నా గళం పుస్తకాన్ని వికీమీడియాసభ్యుల అభ్యర్ధన మేరకు స్వేచ్ఛా నకలుహక్కులతో(CC-BY-SA, GFDL) విడుదల చేసిన తుర్లపాటి కుటుంబరావు ధృవపత్రము

16 ఫిభ్రవరి 2014న తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల రెండవరోజు సమావేశానికి అధ్యక్షునిగా విచ్చేసిన తుర్లపాటి కుటుంబరావు తెలుగు రచనలు వికీసోర్స్ లో చేర్చుటకు హక్కుదారులు స్వేచ్ఛానకలుహక్కులతో తమ రచనలను విడుదల చేయవలసిన ఆవశ్యకతను వివరించిన వికీపీడియా సభ్యులకు స్పందనగా తన ఆత్మకథను సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) మరియు జిఎఫ్డిఎల్(GFDL) షరతులతో విడుదల చేశాడు [1]. అనుమతి మూలపాఠ్యపు మూసలకు Commons:Commons:Email templates చూడండి.

మూలాలు

[మార్చు]
  1. ప్రపంచంలోనే రెండవ ఉత్తమ లిపి తెలుగు, ఈనాడు విజయవాడ సంచిక 2014-02-17