1879 రంప తిరుగుబాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాసు ప్రెసిడెన్సీ, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం కొండప్రాంత ఏజెన్సీలోని రంప ప్రాంతంలో గిరిజనులు చేసిన తిరుగుబాటు 1879 నాటి రంప తిరుగుబాటు. 1922 నాటి రంప తిరుగుబాటు నుండి విడిగా చూపడానికి దీన్ని మొదటి రంప తిరుగుబాటు అని కూడా అంటారు.

కారణాలు

[మార్చు]

విశాఖపట్నంలోని కొండ ప్రాంతాలలోని గిరిజనులు శతాబ్దాలుగా కొద్దో గొప్పో స్వతంత్ర జీవన విధానాన్ని గడిపేవారు. ఈ తెగలు తెలుగు లేదా ఒడియా లేదా గిరిజన మాండలికాలు మాట్లాడతారు. బ్రిటిషు వారికి అంతేవాసులైన జమీందార్ లేదా మన్సబ్దార్‌లకు క్రమం తప్పకుండా కప్పం చెల్లిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతానికి చెందిన అప్పటి జమీందారు, అతని తండ్రికి చట్టబద్ధమైన కుమారుడు కాదు. అతను నిరంకుశుడు. ప్రజలను అణచివేతలకు గురిచేసేవాడు. ఇంతకు ముందు చిన్న చిన్న అల్లర్లు, తిరుగుబాట్లు జరిగాయి. ఈలోగా మద్రాసు ప్రభుత్వం కల్లుగీతను చట్టవిరుద్ధం చేస్తూ, కల్లు పన్నును ప్రవేశపెడుతూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. కల్లుగీత అక్కడి గిరిజనుల సంస్కృతిలో భాగం.[1] 1879 ప్రారంభంలో ఇది పూర్తి స్థాయి తిరుగుబాటుకు దారితీసింది.

ఘటనలు

[మార్చు]

తిరుగుబాటు 1879 మార్చిలో చోడవరం తాలూకాలోని పోలీస్ స్టేషన్లపై రంప కొండ తెగల గిరిజనులు దాడులు చేయడంతో ప్రారంభమైంది. వెంటనే, తిరుగుబాటు విశాఖపట్నం, భద్రాచలం తాలూకాలోని గోల్కొండ కొండలకు వ్యాపించింది. కొద్దికాలానికే తిరుగుబాటు జిల్లా మొత్తాన్ని చుట్టుముట్టింది.

మద్రాసు ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ సైన్యం నుండి అనేక కంపెనీల పోలీసులను, మద్రాసు పదాతిదళానికి చెందిన ఆరు రెజిమెంట్లను, మద్రాస్ అశ్విక దళానికి చెందిన ఒక స్క్వాడ్రన్, రెండు కంపెనీల సాపర్లు, మైనర్లనూ, ఒక పదాతిదళ రెజిమెంట్‌నూ పంపింది. చివరికి తిరుగుబాటును అణచివేసి, పెద్ద సంఖ్యలో విప్లవకారులను అండమాన్ జైలుకు పంపించింది.

అనంతర పరిణామాలు

[మార్చు]

తిరుగుబాటు తరువాత, బ్రిటిషు ప్రభుత్వం వివిధ సామరస్య చర్యలను చేపట్టింది. మద్రాసు ప్రెసిడెన్సీ ఉత్తర ప్రాంతంలోని తూర్పుగోదావరి ఏజెన్సీ లోను, కొండ ప్రాంతాల లోనూ ఉన్న గిరిజనుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించింది.

మూలాలు

[మార్చు]
  1. Tribes of India: The Struggle for Survival (in ఇంగ్లీష్). University of California Press. 1982-01-01. ISBN 978-0-520-04315-2.