Jump to content

1948 అఖండ భారత్

వికీపీడియా నుండి
1948 అఖండ భారత్
దర్శకత్వంఎం.వై.మహర్షి
రచనడా. ఆర్యవర్ధన్ రాజ్
నిర్మాతఈశ్వర్ బాబు.డి
తారాగణం
  • రఘనందన్
  • డా. ఆర్యవర్ధన్ రాజ్
  • శరద్ దద్భావల
  • మొహమ్మద్ ఇంతియాజ్
  • సమ్మెట గాంధీ
ఛాయాగ్రహణంఎస్.ఆర్.చంద్రశేఖర్
కూర్పురాజు జాదవ్
సంగీతంప్రజ్వల్ క్రిష్
నిర్మాణ
సంస్థ
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్
విడుదల తేదీ
12 ఆగస్టు 2022 (2022-08-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

1948 అఖండ భారత్ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.వై.మహర్షి నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్ బాబు.డి దర్శకత్వం వహించాడు. రఘనందన్, డా. ఆర్యవర్ధన్ రాజ్, శరద్ దద్భావల, మొహమ్మద్ ఇంతియాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 12న విడుదలైంది.[2]

దేశ విభజన అనంతరం మహాత్మాగాంధీ( రఘు నందన్) దేశంలో మతకలహాలు ఆగిపోవాలని, అలాగే పాకిస్తాన్ కి భారత ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.55 కోట్లు ఇవ్వాలని ఢిల్లీ లోని బిర్లా హౌస్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాడు. అలా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కొంతమంది హిందూ మహాసభ సభ్యులకు నచ్చదు. నాధూ రామ్ గాడ్సే (ఆర్య వర్ధన్ రాజ్) , నారాయణ ఆప్టే (దుర్గా ప్రసాద్), విష్ణు కర్కరే (సుహాస్), మదన్ లాల్ పహ్వ (నవీన్ మాదాసు), డా.పర్చూరేయ్ (నాగరాజు నన్నపనేని) అభ్యుదయ యువకులు వీర సావర్కర్ అధ్వర్యంలో గాంధీ చర్యలను వ్యతిరేకిస్తారు. గాంధీని చంపడానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి ? తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • రఘనందన్
  • డా. ఆర్యవర్ధన్ రాజ్
  • శరద్ దద్భావల
  • మొహమ్మద్ ఇంతియాజ్
  • సమ్మెట గాంధీ
  • ఆలేఖ్య శెట్టి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్
  • నిర్మాత: ఎం.వై.మహర్షి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఈశ్వర్ బాబు.డి
  • సంగీతం: ప్రజ్వల్ క్రిష్
  • సినిమాటోగ్రఫీ:ఎస్.ఆర్.చంద్రశేఖర్
  • ఎడిటర్:రాజు జాదవ్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (6 August 2022). "అఖండ భారత్‌". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. News18 Telugu (6 August 2022). "1948 Akhanda Bharath : ఆగస్టు 12న వస్తున్న '1948 - అఖండ భారత్' మూవీ." Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (13 August 2022). "మహాత్మ గాంధీ హత్యోదంతంగా '1948 అఖండ భారత్‌'.. మూవీ రివ్యూ". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.