1996 ధర్మపురి
1996 ధర్మపురి | |
---|---|
దర్శకత్వం | జగత్ |
రచన | జగత్ |
నిర్మాత | భాస్కర్ యాదవ్ దాసరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కృష్ణ ప్రసాద్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఓషో వెంకట్ |
నిర్మాణ సంస్థ | భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా |
విడుదల తేదీ | 22 ఏప్రిల్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
1996 ధర్మపురి 2022లో విడుదలైన తెలుగు సినిమా. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమా నిర్మించాడు.[1] గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, శేఖర్ కళ్యాణ్, జనార్దన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదలైంది.[2]
కథ
[మార్చు]ధర్మపురిలో రాజ గడిలో పని చేసే తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసే సూరి (గగన్ విహారి) బీడీలు చుట్టే అమ్మాయి నాగమల్లి (అపర్ణా దేవి) తో ప్రేమలో పడతాడు. అయితే, మొదట్లో, ఆమె అతని ప్రేమను తిరస్కరించిన, కొంతకాలం తర్వాత ఆమె అంగీకరిస్తుంది. వీరి ప్రేమకి గ్రామ రాజకీయాలు అడ్డంకిగా మారిన, ఈ జంట అన్ని అసమానతలను అధిగమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో పెళ్లి రోజు సూరి అదృశ్యమవుతాడు, సూరికి ఏమైంది? అతడు ఎక్కడికి వెళ్ళాడు? తరువాత ఏమి జరిగిందనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- గగన్ విహారి
- అపర్ణ దేవి
- నాగ మహేష్
- శేఖర్ కళ్యాణ్
- జనార్దన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
- నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జగత్
- సంగీతం: ఓషో వెంకట్
- సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (22 April 2022). "ధర్మపురిలో అప్పుడేం జరిగింది?". Archived from the original on 23 April 2022. Retrieved 23 April 2022.
- ↑ Prajasakti (21 April 2022). "నేడు '1996 ధర్మపురి' రిలీజ్". Archived from the original on 23 April 2022. Retrieved 23 April 2022.
- ↑ 6TV News (14 April 2022). "ధర్మపురి లవ్‌స్టోరీ అందరీనీ ఆకట్టుకుంటుందా?". Archived from the original on 23 April 2022. Retrieved 23 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)