2001 గుజరాత్ భూకంపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2001 గుజరాత్ భూకంపం
2001 గుజరాత్ భూకంపం is located in India
2001 గుజరాత్ భూకంపం
తేదీ2001 జనవరి 26 (2001-01-26)
ఆరంభ సమయం03:16 UTC
తీవ్రత7.7 Mw[1]
లోతు16 kilometres (10 mi)
భూకంపకేంద్రం23°25′08″N 70°13′55″E / 23.419°N 70.232°E / 23.419; 70.232[2]
రకంOblique-slip
ప్రభావిత ప్రాంతాలుభారతదేశం, పాకిస్తాన్
అత్యధిక తీవ్రతX (Extreme)
ప్రమాద బాధితులు13,805–20,023 dead[3][4]
~ 166,800 injured[4]
గుజరాత్ భూకంప బాధితులకు ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల సహాయం

2001 గుజరాత్ భూకంపం జనవరి 26 న భారత 52వ గణతంత్ర దినోత్సవం రోజున 08:46 AM IST లకు సంభవించి రెండు నిమిషాలు కంపించింది. భూకంప కేంద్రం గుజరాత్ రాష్ట్రం లోని కఛ్ జిల్లాకు చెందిన బాచావు తాలూకాలోని ఛోబారి గ్రామానికి నైఋతి దిశలో 9 km వద్ద ఉంది.[5] ఈ భూపలకలలో గల యేర్పడిన భూకంపం మోమెంట్ మాగ్నిట్యూడ్ స్కేలులో 7.7 నమోదైనది. ఇది మెర్కాలీ ఇంటెన్సిటీ స్కేలులో అధిక తీవ్రతగా నమోదైనది. ఈ భూకంపంలో 13,805, 20,023 మధ్యలో ప్రజలు ( దక్షిణ పాకిస్తాన్ లో 18 మందితో కలిపి) మరణించారు. 167,000 మంది గాయాలపాలయ్యారు. సుమారు 400,000 గృహాలు ధ్వంసమయ్యాయి.[6]

ప్రభావం[మార్చు]

కచ్ ప్రాంతంలో మొత్తం మరణాలు 12,300. భూకంప కేంద్రానికి సుమారు 20 కి.మీ దూరంలో ఉన్న భుజ్ ప్రాంతం బీభత్సంగా నష్టపోయింది. బచావూ, అంజర్ ప్రాంతాలలో కొంత నష్టం జరిగింది. ఈ ప్రాంతంలో వందల గ్రామాలు నేలమట్టమయ్యాయి. మిలియన్ నిర్మాణాలు ధ్వంసమై పూర్తిగా నాశనమైనవి. అనేక చారిత్రిక భవనాలు, యాత్రికుల పర్యాటక ప్రదేశాలు నాశనం అయినవి.[7] ఈ భూకంపం భుజ్ ప్రాంతంలో సుమారు 40శాతం గృహాలు, ఎనిమిది పాఠశలలు, రెండు వైద్యశాలలు, 4 km రహదారులను నాశనం చేసింది. చారిత్రిక ప్రసిద్ధి పొందిన శ్రీ స్వామినారాయణ దేవాలయం పాక్షికంగా ధ్వంసం అయింది. చారిత్రిక ప్రదేశాలైన అలీనా మహల్ అంరియు ప్రాగ్ మందిరం కొంత ధ్వంసం చెందాయి.

5.6 మిలియన్ల ప్రజలు కలిగిన గుజరాత్ యొక్క వాణిజ్య రాజధాని అయిన అహ్మదాబాదులో 50 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనాయి, అనెక వందల ప్రజలు మరణించారు. ఆస్తి నష్టం 5.6 మిలియన్ల కంటే అధికంగా ఉందని అంచనా వేయబడింది. కచ్ ప్రాంతంలో 60 శాతం వరకు ఆహారం, నీటి సరఫరా నాశనం అయింది. సుమారు 258,000 ఇండ్లు (జిల్లాలో సుమారు 90 శాతం) నాశనం అయ్యాయి. భుజ్ సివిల్ హాస్పిటల్ కు తీవ్ర నష్టం కలిగింది. భారత సైజికదళం అత్యవసర సహాయం అందించిది. తరువాత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ సహాయాన్ని అధికం చేసింది. తాత్కాలిక రెడ్ క్రాస్ హాస్పటల్ భుజ్ లో నిర్మించబడి వైద్యసేవలనందించింది.[8]

U.S. Air Force personnel unload relief supplies destined for earthquake victims in India from a C-5A Galaxy at Andersen Air Force Base, Guam, on Feb. 3, 2001. Tons of relief supplies are being flown to Andersen where they will be loaded onto C-17 Globemaster III aircraft for transport to India to aid victims of the earthquake.

స్మారకం[మార్చు]

స్మృతివనం

స్మృతివన్ అనేది ఒక స్మారక ఉద్యానవనం, మ్యూజియం. దీనిని భూకంప బాధితులకు అంకితం చేసారు. దీనిని భుజియా కొండపై నిర్మించారు. ఇచట 13,805 వృక్షాలు ప్రతీ బాధితునికీ అంకితం చేయబడినవి. ఇచట 108 చిన్న నీటి రిజర్వాయర్లు ఉన్నాయి.[3]

మూలాలు[మార్చు]

  1. "M7.7 Bhuj " Republic Day " Earthquake, 2001". Archived from the original on 2007-09-27. Retrieved 2016-05-05.
  2. NGDC. "Comments for the Significant Earthquake". Retrieved 27 January 2011.
  3. 3.0 3.1 Ray, Joydeep (April 16, 2004). "Gujarat to set up quake memorial in Bhuj". Business Standard.
  4. 4.0 4.1 USGS (4 September 2009), PAGER-CAT Earthquake Catalog, Version 2008_06.1, United States Geological Survey, archived from the original on 28 మార్చి 2015, retrieved 5 మే 2016
  5. Gupta, HARSH K., et al. "Bhuj earthquake of 26 January, 2001." JOURNAL-GEOLOGICAL SOCIETY OF INDIA 57.3 (2001): 275-278.
  6. "Preliminary Earthquake Report". USGS Earthquake Hazards Program. Archived from the original on 2007-11-20. Retrieved 2016-05-05.
  7. "Interdisciplinary Observations on The January 2001 Bhuj, Gujarat Earthquake" (PDF). Archived from the original (PDF) on 2009-02-26. Retrieved 2016-05-05.
  8. John M. Eidinger, ed. (2001). Gujarat (Kutch) India M7.7 Earthquake of January 26, 2001. Reston, VA: ASCE, TCLEE. ISBN 9780784405840. Archived from the original on 2013-12-03. Retrieved 2016-05-05.

ఇతర లింకులు[మార్చు]