Jump to content

2009 నాటి మలేషియా ఆవు తల నిరసన ప్రదర్శన

వికీపీడియా నుండి
(2009 నాటి మలేషియా ఆవు తల ప్రదర్శనలు నుండి దారిమార్పు చెందింది)

2009 ఆగస్టు 28 న మలేషియాలోని షా ఆలంలోని సుల్తాన్ సలావుద్దీన్ అబ్దుల్ అజీజ్ షా భవనంలో ఉన్న సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ముందు ఆవు తల నిరసనలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో పాల్గొన్నవారు ఆవు తలను నరికి వెంట తెచ్చుకుని ప్రదర్శించడంతో దానికి ఆ పేరు వచ్చింది. ప్రదర్శన తరువాత ఆ తలను అపవిత్రం చేసారు [1] ఆవును హిందువులు పవిత్ర జంతువుగా భావిస్తారు.

షా ఆలంలోని సెక్షన్ 19 అనే నివాస ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయాన్ని అక్కడి నుండి సెక్షన్ 23 కి మార్చాలని సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన కారణంగా ఈ నిరసన జరిగింది. నిరసనకారులు ప్రధానంగా ముస్లింలు. సెక్షన్ 23 ముస్లిం మెజారిటీ ప్రాంతం కాబట్టి ఆ తరలింపును వ్యతిరేకించారు.

2009 ఆగస్టు 28 న, దాదాపు 50 మంది మలేషియా ముస్లింల బృందం సుల్తాన్ సలావుద్దీన్ అబ్దుల్ అజీజ్ మసీదు నుండి సెలంగర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఉన్న సుల్తాన్ సలావుద్దీన్ అబ్దుల్ అజీజ్ షా భవనం వద్దకు ఆవు తలతో ప్రదర్శనగా వెళ్ళారు. హిందూమతంలో అవును పవిత్రమైనదిగా భావిస్తారు. అక్కడి నుండి తిరిగి వెళ్ళే ముందు ఆ ఆవు తలపై తొక్కి, దానిపై ఉమ్మివేసారు. [1] షా ఆలమ్‌లో గుడి గనక నిర్మిస్తే రక్తం ప్రవహిస్తుందని నిరసన నేతలు చెప్పారు. [2]

ఈ నిరసనను ప్రముఖ మలేషియా ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ మలేషియాకిని వీడియో తీసింది. [3]

UMNO, బారిసాన్ నేషనల్ స్పందన

[మార్చు]

మలేషియా హోం మంత్రి దాతుక్ సేరి హిషాముద్దీన్ హుస్సేన్ ఆ నిరసనను సమర్థించాడు. ఇరుగుపొరుగున ముస్లింలు ఉన్నందున హిందూ మందిరాన్ని అక్కడ నిర్మించడం తగదని అతడు వాదించాడు. “స్థానికులు తమ నిరసనను వినిపించాలని మాత్రమే కోరుకున్నారు. ఇది జాతి మతపరమైన భావాలతో ముడిపడి ఉండటాన వారికి ప్రతికూల ప్రచారం వచ్చింది. అది దురదృష్టకరం" అని అతడు అన్నాడు. [4]

దీనికి ప్రతిగా హిషాముద్దీన్ ఆందోళనకారులను చర్చకు ఆహ్వానించాడు. అనంతరం విలేకరుల సమావేశంలో హిషాముద్దీన్ మాట్లాడుతూ నిరసనకారుల చర్యలను తప్పుపట్టలేమని అన్నారు. దానికతను అనేక కారణాలను పేర్కొన్నాడు: [5]

  • ప్రదర్శన చట్టవిరుద్ధమే, ప్రభుత్వ అనుమతి లేదు నిజమే. కానీ నిరసనకారులు తమ ప్రదర్శనను పరిమితం గానే చేశారు
  • హిందూ దేవాలయాన్ని తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుడుది
  • ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం కల్పించాలి
  • ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి (యునైటెడ్ మలయ్ నేష్నల్ ఆర్గనైజేషన్ (UMNO) మైదానంలోకి పంది తలలను విసిరేసారు)

అతడి విలేకరుల సమావేశం కూడా దాదాపు నిరసన ప్రదర్శన అంత వివాదాస్పదమైంది. మలేషియాకిని దాన్ని కూడా రికార్డ్ చేసింది. ప్రతిపక్ష రాజకీయ నాయకులు మంత్రి చర్యను ఖండిస్తూ ఆయన రాజీనామా చెయ్యాలని డిమాండు చేసారు.

హిషాముద్దీన్‌కు మరింత ఇబ్బంది కలిగిస్తూ ప్రభుత్వ మల్టీమీడియా ఏజెన్సీ అయిన మలేషియా కమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా కమిషన్ (MCMC) మలేషియాకిని.కామ్‌కి ఒక లేఖ రాసింది. ఆవు తల నిరసనలు, మంత్రి చేసిన విలేకరుల సమావేశం -ఈ రెండు వీడియోలనూ తీసివేయమని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. హిషాముద్దీన్ చేసిన పత్రికా సమావేశం కారణంగా ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నియంత్రించుకునే ప్రయత్నంగా దీన్ని కొందరు వ్యాఖ్యానించారు. [6]

పోలీసుల స్పందన

[మార్చు]

ఆవు తలను తన్నుతూండగా, దానిపై ఉమ్ముతూండగా ఆందోళనకారులను అడ్డగించకుండా పోలీసులు కేవలం పక్కన నిలబడి చూస్తూ ఉన్నారని పలువురు విమర్శించారు. ప్రముఖ మలేషియా న్యూస్ ఆన్‌లైన్ పోర్టల్ మలేషియాకిని పట్టుకున్న నిరసన వీడియోలో దాన్ని చూడవచ్చు. [3]

2007 లో జరిగిన హింద్రాఫ్ ప్రదర్శన కారులపై పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించారు.

దీనికి విరుద్ధంగా 2007 లో జరిగిన హింద్రాఫ్ ర్యాలీలో పోలీసుల క్రూరత్వం స్పష్టంగా కనబడింది. ఐదు వేల మంది సభ్యులు గల పోలీసుల బృందం సంఘటనా స్థలానికి వెళ్ళి, జనాలను చెదరగొట్టడానికి బాష్పవాయువు,ను నీటి ఫిరంగినీ ప్రయోగించారు. [7]

2007 హింద్రాఫ్ ర్యాలీకి సంబంధించి అల్-జజీరా ఇచ్చిన కవరేజీలో [8] ప్రదర్శనలో పాల్గొన్నవారు క్వీన్ ఎలిజబెత్ II, మహాత్మా గాంధీ చిత్రాలను మోసుకుంటూ శాంతియుతంగా, అహింసాయుతంగా ఉన్నప్పటికీ వాళ్ళను చెదరగొట్టడానికి పోలీసు అధికారులు టియర్ గ్యాస్‌ను ఉపయోగించారు. [9] ఆ ప్రదర్శనలో 240 మందిని పోలీసులు అరెస్టు చేశారు. [10]

పకాటాన్ రక్యాత్ ప్రతిస్పందన

[మార్చు]

సెక్షన్ 23 షా ఆలంతో సహా బటు టిగా సెలంగోర్ రాష్ట్ర అసెంబ్లీ మహిళగా ఉన్న రోడ్జియా ఇస్మాయిల్, ఆలయ తరలింపును ఆపనందుకు గాను, నిరసనకారులు ఆమెను నేరుగా విమర్శించారు, అవమానించారు. [11] ఆలయ తరలింపును పర్యవేక్షించిన సెలంగోర్ రాష్ట్ర కార్యవర్గ మండలిలో ఆమె సంక్షేమం, మహిళా వ్యవహారాలు, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా ఉంది. ఆలయ పునరావాసానికి మతస్వేచ్ఛ హక్కు హామీ ఇచ్చిందని రోడ్జియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇతర మతాలను గౌరవించాలని నిరసనకారులకు సూచించిందిబ్.

సెలంగోర్ పకాటాన్ రక్యాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటన తర్వాత టౌన్‌హాల్ సమావేశాన్ని నిర్వహించింది. అయితే UMNO నుండి వచ్చిన నిరసనకారులు సమావేశంలో విధ్వంసం సృష్టించి, దాన్ని హైజాక్ చేయడంతో దాన్ని ఆకస్మికంగా ముగించవలసి వచ్చింది. టౌన్ హాల్ సమావేశం విఫలమైన తర్వాత 150 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మహామారియమ్మన్ ఆలయాన్ని తరలించడాన్ని మంత్రి బెసర్ తాన్ శ్రీ ఖలీద్ ఇబ్రహీం తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. [11]

శ్రీ మహామారియమ్మన్ దేవాలయాన్ని విభాగం 19 నుండి విభాగం 23 కు తరలిస్తామని 2010 అక్టోబరు 19 న సెలాంగోర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది [11]

అరెస్టులు, ఆరోపణలు

[మార్చు]

చట్టవిరుద్ధంగా సమావేశం నిర్వహించినందుకు గాను 2010 జూలైలో, షా ఆలంలోని సెషన్స్ కోర్టు 12 మంది నిరసనకారులకు ఒక్కొక్కరికి RM 1,000 జరిమానా విధించింది. నిరసనకారులలో ఇద్దరికి దేశద్రోహ నేరానికి గాను RM 3,000 జరిమానా విధించింది. ఇద్దరిలో ఒకరికి ఒక వారం జైలు శిక్ష విధించింది. [11] ఐజ్వా ఎజర్ రామ్లీ (31), మొహమ్మద్ అజ్మీర్ మొహమ్మద్ జెయిన్‌ లపై "ఆవు తలను ప్రదర్శిస్తూ జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టినందుకు" దేశద్రోహ చట్టం 1948 లోని సెక్షన్ 4(1)(a) కింద అభియోగాలు మోపారు. [11] మహ్మద్ అజ్మీర్ పై "జాతి విద్వేషాన్ని సృష్టించే ఉద్దేశ్యంతో" ఆవు తలపై తన్నడం, తొక్కడం చేసినందుకు కూడా అదే చట్టం కింద అభియోగాలు మోపారు. RM 3,000 జరిమానా విధించారు. [11]

వాస్తవానికి దేశద్రోహ చట్టం కింద అభియోగాలు మోపబడిన మరో నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Malaysian Muslims protest against proposed construction of Hindu temple (archived)". The Boston Globe. Associated Press. 29 August 2009. Archived from the original on 1 September 2009. Retrieved 2010-09-12.
  2. Malaysia Muslims protest proposed Hindu temple Associated Press – 28 August 2009
  3. 3.0 3.1 Temple demo: Residents march with cow's head YouTube. 28 August 2009
  4. "Hisham defends cow-head protestors". MySinchew.com. 2 September 2009. Retrieved 2010-09-12.
  5. Holy cow! Minister defends protesters Archived 15 మార్చి 2010 at the Wayback Machine Malaysiakini. 9 September 2009
  6. MCMC tells Malaysiakini: Take down videos Archived 14 మార్చి 2010 at the Wayback Machine Malaysiakini. 9 September 2009
  7. Cops forced to use tear gas, water cannons Archived 3 అక్టోబరు 2012 at the Wayback Machine
  8. [1]
  9. Time
  10. [2] Archived 10 అక్టోబరు 2012 at the Wayback Machine
  11. 11.0 11.1 11.2 11.3 11.4 11.5 Selangor to proceed with temple in Section 23 Archived 8 డిసెంబరు 2015 at the Wayback Machine, The Malaysian Insider, 19 October 2010