2022 శ్రీలంక అత్యవసర పరిస్థితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీలంకలో 2022 ఏప్రిల్ 13న ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ముందు ప్రభుత్వ వ్యతిరేక నిరసన

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి (Sri Lanka Emergency) - తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఈ ఏడాది రెండుసార్లు అత్యవసర పరిస్థితిని విధించింది. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స 2022 మే 6 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీని విధించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులకు విశేష అధికారాలు కల్పించారు. రెండు వారాలుగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితి కారణంగా దేశంలో తిరిగి పరిస్థితులు కొద్దిమేర మెరుగయ్యి, శాంతిభద్రతలు అదుపులోకి వస్తున్నందున ప్రభుత్వం మే 21న ఎమర్జెన్సీని ఎత్తివేసింది.[1]

2022 ఏప్రిల్ 1న కూడా శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించి ఏప్రిల్ 5వరకు కొనసాగించారు.[2] కారణం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొని నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్యం కొరతతో చమురు దిగుమతులకు చెల్లింపులు జరపలేని పరిస్థితిలు ఎదురయ్యాయి. దీంతో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కొందరు నిరసనకారులు 2022 మార్చి 31న రాత్రి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో మరుసటిరోజు రాత్రి పొద్దుపోయిన తరువాత అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్థిక సంక్షోభం[మార్చు]

శ్రీలంక ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం 2019లో ప్రారంభమైంది. ఇది 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం. ఇది తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు దాదాపు క్షీణించడం, వైద్య సామాగ్రి కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీసింది. పన్ను తగ్గింపులు, డబ్బు సృష్టి, సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి దేశవ్యాప్త విధానం, 2019లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వంటి బహుళ సమ్మేళన కారకాల కారణంగా సంక్షోభం ప్రారంభమైంది. ఈ ఆర్థిక కష్టాల ఫలితంగా 2022లో శ్రీలంక నిరసనలకు దారితీసింది.

రాజకీయ సంక్షోభం[మార్చు]

శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, శ్రీలంక పార్లమెంటు మధ్య ఆధిపత్య పోరు కారణంగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు దిగుతున్నారు. శ్రీలంకలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ అంతర్యుద్ధం తర్వాత దేశం చూడని రాజకీయ అస్థిరతను రేకెత్తించింది.

మూలాలు[మార్చు]

  1. "Crisis-Hit Sri Lanka Lifts State Of Emergency After 2 Weeks". web.archive.org. 2022-05-21. Archived from the original on 2022-05-21. Retrieved 2022-05-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Sri Lankan President revokes emergency with effect from April 5 midnight - World News". web.archive.org. 2022-05-21. Archived from the original on 2022-05-21. Retrieved 2022-05-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

list