74 భారత రాజ్యాంగ సవరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Emblem of India.svg భారత రాజ్యాంగ చట్ట సవరణలు జనవరి 2018 నాటికి, భారత రాజ్యాంగంలో 123 సవరణ ప్రతిపాదనలు, 101 సవరణ చట్టాలు జరిగాయి. మొట్టమొదటి సవరణను 1950 లో ప్రవేశపెట్టారు.[1] 74 వ రాజ్యాంగ సవరణ బిల్లును పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991 సెప్టెంబర్ 16 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 1992లో 74వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 12వ షెడ్యూల్‌ను చేర్చారు.రాష్ట్రపతి ఆమోదం తర్వాత 1993, జూన్ 1న ఈ చట్టం అమల్లోకి వచ్చింది.[2]

చట్ట సవరణ చరిత్ర[మార్చు]

భారత దేశంలో తొలిసారిగా 1687లో మద్రాస్‌లో మునిసిపల్ కార్పొరేషన్‌ను బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు. 1726లో బాంబే, కలకత్తా కార్పొరేషన్లు ఏర్పడ్డాయి.అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేందుకు నగరపాలక బిల్లును 1989, ఆగస్టులో 65వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టిన 65వ సవరణ బిల్లు లోక్‌సభలో ఉండగానే బిల్లు రద్దయింది.1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని భావించినప్పటికీ వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో ఈ ఆమోదం పొందడంలో విఫలమైందని. పీవీ నర్సింహారావు ప్రభుత్వం 65వ సవరణ బిల్లును అనేక మార్పులు చేసి 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటులో 1991, సెప్టెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టింది.1992లో 74వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది.నాటి రాష్ర్టపతి శంకర్ దయాల్ శర్మ ఆమోదించారు.1993, జూన్ 1న చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.[3]

74 రాజ్యాంగ సవరణ ముఖ్యాంశాలు[మార్చు]

పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో 'IXA' భాగంలో ప్రకరణ 243P నుంచి 243 ZG వరకు పొందుపరిచారు.

ప్రకరణ 243 P స్థానిక ప్రభుత్వ నిర్మాణం[మార్చు]

కమిటీ : 243 ప్రకారం అధికరణం క్రింద ఏర్పాటైన కమిటీ.

జిల్లా: అనగ రాష్ట్రంలో జిల్లా అని అర్థం.

మెట్రోపాలిటన్: 10 లక్షలు కంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రాతం. మెట్రో పాలిటన్ ప్రాంతంగా ఏర్పడినప్పుడు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంటుంది.

మున్సిపల్ ప్రాంతం: గవర్నర్ చే నోటిఫై చేయబడిన ప్రాంతం

మున్సిపాలిటీ : 243Q ప్రకరణ క్రింది ఏర్పాటు అయిన స్థానిక స్వపరిపాలన సంస్థ.

పంచాయతీ : 243 ప్రకరణ క్రింద పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది.

జనాభా :చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి, నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా అని అర్థం.

243Q మునిసిపాలిటీల నిర్మాణం[మార్చు]

గ్రామీణ ప్రాంతము నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు.చిన్న పట్టణాల్లో మునిసిపల్ కౌన్సిల్‌, అతి పెద్ద పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.ఒక పట్టణంగా పరివర్తన చెందుతున్న ప్రాంతం, చిన్న పట్టణం, పెద్ద పట్టణం అని రాష్ర్ట గవర్నర్ సరైన అర్థ వివరణ ఇస్తారు.

243R మున్సిపాలిటీల నిర్మాణం, ఎన్నికలు[మార్చు]

మున్సిపాలిటీల్లో, అన్ని స్థాయిల సభ్యులు పౌరుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి. మున్సిపాలిటీల్లోని సభ్యుల కూర్పు, అధ్యక్షుల ఎన్నికల విధానానికి ఆ రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ చట్టాలను రూపొందిస్తుంది.మున్సిపాలిటీల్లోని పరిపాలన నిర్వహణలో అనుభవం ఉన్నవారు ప్రభుత్వం ద్వారా నామినేట్ అవుతారు. (వీరికి ఓటుహక్కు ఉండదు) సంబంధిత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాకు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు హోదారీత్యా సభ్యులుగా కొనసాగుతారు.

243S వార్డు కమిటీలు నిర్మాణం[మార్చు]

మూడు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మునిసిపాలిటీల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్డులను కలిపి వార్డు కమిటీలను ఏర్పాటు చేయుట, వార్డ్ కమిటీలు సంబంధిత శాశన నిర్మాణ శాఖ చట్టం రూపొందించాలి. కార్పొరేషన్‌లో వార్డ్ కమిటీల సంఖ్య 50కి తగ్గకుండా,100కి మించకుండా ఉండాలి.

243T రిజర్వేషన్లు[మార్చు]

ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి.మొత్తం స్థానాల్లో కనీసం 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి. మున్సిపాల్టీ అధ్యక్షులలో కొన్నింటిని ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించే విధంగా ఆ రాష్ట్ర శాసనసభ చట్టం రూపొందించాలి. ఈ రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో కేటాయించాలి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంది

243U పదవీ కాలం[మార్చు]

ఈ చట్టము ద్వారా అధ్యక్షుడు పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఈ ఐదు సంవత్సరాల లోటు పదవి రద్దు అయితే ఆరు నెలలు ముందు ఎన్నికలు నిర్వహించాలి.

243V అనర్హతలు[మార్చు]

పంచాయతీలు రాజ్ వ్యవస్థ లో అధ్యక్షులు, సభ్యులు వారి అర్హతలు, అనర్హతలు నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. పార్లమెంటు, శాసనసభకు పోటీ చేయు అభ్యర్థుల అర్హతలు అనర్హతలు స్ధానిక సంస్థలకు వర్తిస్తాయి. పోటీ చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు.

243W అధికార విధులు[మార్చు]

12వ షెడ్యూల్‌లో 18 విధులను పట్టణ స్థానిక సంస్థలకు నిర్దేశించారు. వీటిని రాష్ర్ట ప్రభుత్వాలు బదిలీ చేస్తాయి. పన్నెండో షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధులు ఉన్నాయి. 1.నగర ప్రణాళిక 2. సమర్ధవంత భూ వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణ 3. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు 4. మురికివాడల నిర్మూలన. 5. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ 6. రహదారులు, వంతెనలు 7. ప్రజారోగ్యం, మురుగు నీటిపారుదల, చెత్త నియంత్రణ 8. అగ్నిమాపక వ్యవస్థ 9. పరిశ్రమలకు, గృహాలకు నీటి వసతి 10. బలహీన వర్గాల సంరక్షణ, వికలాంగులకు వసతి. 11. వీధి దీపాలు, బస్టాండుల నిర్వహణ 12. కబేళాలపై నియంత్రణ 13. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు 14. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు 15. జంతువుల పరిరక్షణ 16. ఆట స్థలాలు, ఉద్యానవనాల నిర్వహణ 17. శ్మశాన వాటికల నిర్వహణ 18. జనన, మరణాల నమోదు వంటివి ఉన్నాయి.

243X స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పన్నులు[మార్చు]

స్థానిక సంస్థలు ఆదాయం కోసం శాసనసభ నిర్ణయించిన మేరకు పన్నులు విధించి, వసూలు చేయడం. అలాగే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కూడా సహాయ నిధులు అందిస్తాయి.

243Y ప్రకారం ఫైనాన్స్ కమిషన్[మార్చు]

73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న ప్రకరణ 243 I లోని రాష్ర్ట ఫైనాన్స్ కమిషన్ పట్టణ స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.

243Z అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్[మార్చు]

పట్టణ, నగర కార్పొరేషన్ సంస్థల అకౌంట్‌లను పరిశీలించేందుకు రాష్ర్ట శాసనసభ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవచ్చు.

243ZA మునిసిపల్ ఎన్నికల నిర్వహణ[మార్చు]

ప్రకరణ 243 k లో ప్రస్తావించిన విధంగా రాష్ట్ర, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.

243ZB కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు[మార్చు]

74వ రాజ్యాంగ సవరణలోని అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. రాష్ట్రపతి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా వర్తింపచేవచ్చు.

243ZC షెడ్యూల్డ్ ప్రాంతాలకు మినహాయింపులు[మార్చు]

244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలు, 244(2) ప్రకారం షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ఈ విభాగం వర్తించదు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని కొండ ప్రాంతాలకు ఏర్పాటు చేసినగూర్ఖాహిల్ కౌన్సిల్‌కు ఈ విభాగం వర్తించదు.ప్రకరణ 244(1), 244(2) ప్రకారం షెడ్యూల్డ్, ఆదివాసీ ప్రాంతాలకు ఈ విభాగాన్ని వర్తింపచేస్తూ పార్లమెంట్ శాసనాలను రూపొందించవచ్చు. అవి రాజ్యాంగ సవరణలుగా పరిగణించబడవు.

243ZD జిల్లా ప్రణాళికా కమిటీ[మార్చు]

ప్రతి రాష్ర్టంలో జిల్లాలో ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ పంచాయతీ, మునిసిపాలిటీలు రూ పొందించిన ప్రణాళికలను సమీకరించి తుది ప్రణాళికలను రూపొందిస్తుంది. జిల్లా ప్రణాళిక కమిటీ నిర్మాణాన్ని రాష్ర్ట శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఈ జిల్లా ప్రణాళిక కమిటీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి వర్తించదు.

243ZE మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటిలు[మార్చు]

10 లక్షల దాటి జనాభా ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.దీనికి సంబంధించిన నిర్మాణం, విధులు ఆ రాష్ర్ట శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.నగరంలో మేయర్ ఈ కమిటీకి చైర్మన్‌గా, మునిసిపల్ కమిషనర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

243ZF పాత శాసనాల కొనసాగింపు[మార్చు]

74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరం వరకు ఆ రాష్ర్టంలో అమల్లో ఉన్న పాత చట్టాలే కొనసాగుతాయి. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను అనువర్తింప చేసుకోవాలి.

243ZG న్యాయ స్థానాలు నుండి మినహాయింపు[మార్చు]

మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లు ఎన్నికల నిర్వహణ వార్డుల విభజన విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోరాదు.

మూలాలు[మార్చు]

  1. "Constitution Amendment: Nature and Scope of the Amending Process, (page 10)" (PDF). Lok Sabha Secretariat. Archived from the original (PDF) on 3 డిసెంబర్ 2013. Retrieved 29 నవంబర్ 2019. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  2. "73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల వివరణ". www.eenadupratibha.net. Archived from the original on 2019-12-01. Retrieved 2019-11-29.
  3. "రాజ్యాంగ సవరణ చట్టాలు". Indiacode.nic.in. Archived from the original on 2008-04-27. Retrieved 2011-11-19.