99టీవీ
| దేశం | India |
|---|---|
| ప్రసారపరిధి | India Asia |
| నెట్వర్క్ | India Cable News |
| కేంద్రకార్యాలయం | Kondapur Hyderabad, Telangana, India |
| ప్రసారాంశాలు | |
| భాష(లు) | తెలుగు |
| చిత్రం ఆకృతి | 576i |
| యాజమాన్యం | |
| యజమాని | New Waves Media |
| ప్రధాన వ్యక్తులు | తోట చంద్రశేఖర్, &న్యూ వేవ్స్ మీడియా |
| చరిత్ర | |
| ప్రారంభం | 20 జులై 2014 |
| లింకులు | |
| వెబ్సైట్ | www.99tv.co.in |
| లభ్యత | |
| ఉపగ్రహం | |
| Dish TV | Channel 735 |
| Videocon D2H | Channel 735 |
| Tata Sky | Channel 1478 |
| Hathway | Channel 55 |
99టీవీ ఒక తెలుగు వార్త ఛానల్. ఇందులో 24 గంటలు తెలుగు వార్తలు ప్రసారం అవుతాయి.న్యూ వేవ్స్ మీడియా అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ నిర్వహించబడుతుంది.[1] ఈ ఛానెల్ 2018 జూలై 11 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. ఆ ఛానల్ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. 99 టివి 2014 లో స్థాపించబడింది, ప్రస్తుతం తోటా చంద్రశేఖర్ నేతృత్వంలోని న్యూ వేవ్స్ మీడియా యాజమాన్యంలో ఉంది.
ఉపగ్రహం INSAT-4A (C-BAND) డౌన్‌లింక్ పౌనపున్యం- 3921 MHZ, symbol rate- 13000, System DVB-S2/QPSK/MPEG-4.
చరిత్ర
[మార్చు]99 టీవీని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా 2014 జూలై 20 న హైదరాబాద్‌లో స్థాపించారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, అప్పటి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, రామకృష్ణ, వివిధ మీడియా సభలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.తరువాత 99TV పూర్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) చే స్వాధీనం చేయబడింది.
ఈ ఛానల్ ను న్యూ వేవ్స్ డిజిటల్ మీడియా ద్వారా 2018 జూలై 11న చేపట్టారు, ఈ ఛానల్ యొక్క ప్రధాన కార్యాలయంగా ఉన్న హైదరాబాద్ కొండాపూర్ లో న్యూ వేవ్స్ మీడియా ప్రధాన కార్యాలయం నుండి ప్రసారం ప్రారంభమైంది.[2]
ప్రోగ్రామింగ్
[మార్చు]సీరియస్ రిపోర్టింగ్ తో ఈ ఛానల్ రాజకీయ, కరెంట్ అఫైర్స్ ను ప్రసారం చేస్తుంది, ఛానల్ లో వ్యాపారం, టాక్ షో, సినిమా, క్రీడలు వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నెట్ వర్క్ ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "99tv managment". Times of India. 24 ఆగస్టు 2011. Retrieved 16 సెప్టెంబరు 2018.
- ↑ kavirayani, suresh (14 జూలై 2018). "Pawan Kalyan's master stroke!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 31 ఆగస్టు 2020.
- ↑ "Pawan Kalyan to host talk show?". The Indian Express (in ఇంగ్లీష్). 27 ఆగస్టు 2018. Retrieved 31 ఆగస్టు 2020.