ఐ పీ అడ్రసు

వికీపీడియా నుండి
(IP address నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Ipv4 అడ్రస్ నొటేషన్

ఐ పి అడ్రసు (ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పంపేటపుడు కంపూటర్ల వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే

నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. మనుష్యులు చదివే విధంగా వుండే www.wikipedia.org వంటి అడ్రసును డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను డోమైన్‌ నేమ్‌ పరిష్కరణ (resolution of the domain name) అని అంటారు.

మరిన్ని వివరాలు

[మార్చు]

ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ (IP) ప్రతి లాజికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ను ఈ ఐ పి అడ్రసు ద్వారా గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (unique) వుంటుంది. ఇంటర్నెట్‌ వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి హోస్ట్‌ నేమ్‌ను కూడా వాళ్ళ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఇస్తారు.

World wide webను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్లతో సంభాషిస్తాయి. మనం పంపే ఈ-మెయిల్‌ యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి TCP/IP ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.

వాడే ఇంటర్నెట్‌ కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒ4కటే వుండటం గానీ (స్థిర ఐ పి అడ్రసు అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ (గతిశీల ఐ పి అడ్రసు అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా Dynamic Host Configuration Protocol అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.

ఇంటర్నెట్‌ అడ్రసులు మాట్లాడుకునే వివిధ వర్గాల కొరకే కాక, సమాచార రవాణా కొరకు కూడా అవసరం. అందుచేతనే చాలా భాగం అడ్రసులు వాడకుండానో లేక ఒక పక్కన పెట్టబడో (reserved) వుంటాయి.

ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్‌లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.

ఐ పి కూర్పు (వెర్షన్) 4

[మార్చు]

అడ్రసులు ఇవ్వటం ఎలా

[మార్చు]

ప్రస్తుత ప్రామాణికమైన ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4 (IPv4) లో ఐ పి అడ్రసు 32 బిట్లు కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కింద చూడండి).

మామూలుగా IP4 లోని అడ్రసులను చుక్కల చదర (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు అష్టంలు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు ఉంది. దాన్ని బేస్‌-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207×2563 + 142×2562 + 131×2561 + 236×2560. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ సర్వర్లు చూసుకుంటాయి.)