Jump to content

మషోనాలాండ్ ఈగల్స్

వికీపీడియా నుండి
(Mashonaland Eagles నుండి దారిమార్పు చెందింది)
మషోనాలాండ్ ఈగల్స్
cricket team
స్థాపన లేదా సృజన తేదీ2009 మార్చు
క్రీడక్రికెట్ మార్చు
దేశంజింబాబ్వే మార్చు
అధికారిక వెబ్ సైటుhttp://www.eaglescricket.co.zw మార్చు

మషోనాలాండ్ ఈగల్స్ అనేది జింబాబ్వేకి చెందిన ఐదు క్రికెట్ ఫ్రాంచైజీలలో ఒకటి. వారు హరారే మెట్రోపాలిటన్, మషోనాలాండ్ సెంట్రల్ ఏరియాకు చెందిన వారు. ఫస్ట్-క్లాస్, పరిమిత ఓవర్ల క్రికెట్ రెండింటినీ ఆడతారు. వారు తమ హోమ్ మ్యాచ్‌లను హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఆడతారు.[1]

ఫ్రాంచైజ్ చరిత్ర

[మార్చు]

2009-10 సీజన్‌లో, జింబాబ్వే క్రికెట్ క్రికెట్ కొంత క్షీణదశకి చేరుకోవడంతో ఆటలోని అన్ని ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ, టీ20 దేశీయ ఫార్మాట్‌లలో కొత్త జట్లను ఉపయోగించాలని నిర్ణయించింది. మొత్తం 5 జట్లు పేరు పెట్టబడ్డాయి. మషోనాలాండ్ ఈగల్స్ ఫ్రాంచైజీ హరారేలో ఉంది.[1]

ఆటగాళ్ళు

[మార్చు]

2009-10 లోగాన్ కప్‌లో ఫ్రాంచైజీ అరంగేట్రం చేసినప్పుడు వారు జింబాబ్వే అంతర్జాతీయ, దేశీయ క్రికెటర్లను కలిగి ఉన్నారు. ఆ సమయంలో ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్, ఆల్ రౌండర్ ఎల్టన్ చిగుంబురా, బ్యాట్స్‌మెన్ ర్యాన్ బటర్‌వర్త్, బర్నీ రోజర్స్, దూకుడుగా ఉండే సెఫాస్ జువావో, కెప్టెన్ వంటి ఆల్ రౌండర్లు, గ్రెగ్ లాంబ్, వికెట్ కీపర్లు రెగిస్ చకబ్వా, ఫాస్టర్ ముత్తీజ్వా, బౌలర్లు డగ్లస్ హోండో, డార్లింగ్టన్ మతంబనాడ్జో, రే ప్రైస్ వంటివారు ఉన్నారు.[2] 2009–10 స్టాన్బిక్ బ్యాంక్ 20 సిరీస్‌లో ఆడిన ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ సిల్వర్‌వుడ్ వారి మొదటి ప్రధాన విదేశీ సంతకం.[3]

హోమ్ స్టేడియం

[మార్చు]

నగరం నడిబొడ్డున చుట్టూ జకరందా చెట్లతో, అందమైన గేబుల్ పెవిలియన్‌తో హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ ఉంది. ఈగల్స్ తమ హోమ్ మ్యాచ్‌లను ఈ హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఆడతాయి. ఇందులో 10,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. 2011, ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌కు జింబాబ్వే తిరిగి రావడానికి సన్నాహకంగా స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి ఒకవైపు అత్యంత భద్రతతో కూడిన అధ్యక్ష భవనం, మరొక వైపున ప్రతిష్ఠాత్మకమైన రాయల్ హరారే గోల్ఫ్ క్లబ్ సరిహద్దులుగా ఉన్నాయి. 1992 అక్టోబరులో జింబాబ్వే మొదటి టెస్ట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పటి నుండి దేశ ప్రధాన టెస్ట్, వన్డే వేదికగా ఉంది.[4]

గౌరవాలు

[మార్చు]

ఛాంపియన్

  • లోగాన్ కప్ : 3
    • 2009-10, 2015-16, 2022-23
  • ప్రొ50 ఛాంపియన్‌షిప్ : 5
    • 2011-12, 2012-13, 2014-15, 2015-16, 2018-19,
  • జింబాబ్వే దేశీయ ట్వంటీ20 పోటీలు : 4
    • 2010-11,2016, 2022,2023

పరిపాలన

[మార్చు]
  • ఓనర్లు – జింబాబ్వే క్రికెట్
  • చీఫ్ ఎగ్జిక్యూటివ్: హ్యూగో రిబాటికా
  • ప్లేయర్-కోచ్: ఆండ్రూ హాల్[5]
  • టీమ్ మేనేజర్/టీమ్ పెర్ఫార్మెన్స్ అనలిస్ట్: జోసెఫ్ మడియెంబ్వా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Price, Steven (8 May 2009). "Zimbabwe rips up domestic structure and starts again". ESPNcricinfo. Retrieved 2010-11-23.
  2. Zimbabwe Domestic Season, 2009/10 Global / Mashonaland Eagles Squad ESPNcricinfo. Retrieved 9 December 2011
  3. Silverwood and Hendrick head to Zimbabwe ESPNcricinfo. Retrieved 10 December 2011
  4. Harare Sports Club Ground Page ESPNcricinfo. Retrieved 10 December 2011
  5. Zimbabwe franchises announce new signings ESPNcricinfo. Retrieved 10 December 2011