Jump to content

ప్రధానమంత్రి జీవనజ్యోతి

వికీపీడియా నుండి
(Pradanamantri jeevana jyothi నుండి దారిమార్పు చెందింది)

ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమాయోజన భారత ప్రభుత్వ జీవిత బీమాపథకం. ఈ పథకం వాస్తవంగా 2015 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చే బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించబడింది.[1] ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చే 2015 మే 9 న కోల్‌కతాలో ప్రారంభించబడింది.[2] 2015 మే వరకు భారత జనాభాలో 20 శాతం మంది మాత్రమే ఏదో ఒక జీవిత బీమాపాలసీని కలిగి యున్నారు. ఈ పథకం ద్వారా ఆ సంఖ్యను పెంచడమే దీని ఉద్దేశం.[3]

18 నుంచి 50 సంవత్సరాల వయసుగలిగి బ్యాంకు ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాలి. దీనికి జిఎస్టి ఉండదు. ఈ సొమ్ము నేరుగా ఖాతాల నుంచే తీసుకుంటారు. ఒకవేళ ఖాతాదారుకు ఏదైనా జరిగితే నామినీకి 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఖాతాదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తమ బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా తమ ఆధార సంఖ్యతో అనుసంధానం చేయాలి.

ఈ పథకం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన బ్యాంకు ఖాతాలకు కూడా వర్తిస్తుంది. అన్ని బ్యాంకుల ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్ళి అక్కడ ఒక ఫారంని సమర్పించడం కానీ చేయాలి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Jan Suraksha: Social security for masses, pricing woes for insurers". Business Standard. 9 May 2015. Retrieved 9 May 2015.
  2. "Banks advertise Pradhan Mantri Bima Yojana ahead of the roll out". Live Mint. 8 May 2015. Retrieved 9 May 2015.
  3. "'Jan Suraksha schemes to help eliminate Jan Dhan's zero balance accounts'". Business Standard. 8 May 2015. Retrieved 9 May 2015.
  4. "'Pradhan Mantri Suraksha Bima Yojana: Accidental death, disability cover@Rs 12 p.a'". Economic Times. 22 September 2016. Retrieved 22 September 2016.