చర్చ:ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2019

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మౌలిక పరిశోధన, మొదలైనవారు

[మార్చు]

@Pranayraj1985 గారూ,

  1. ఈ వ్యాసంలో విజేతల జాబితా కాకుండా ఉన్నది మూడే వాక్యాలు. మొదటి వాక్యానికి ఆధారం మూలాల్లో ఇచ్చిన బహుమతి కథల సంకలనంలోని రెండవ, మూడవ పేజీల్లోని వాక్యాలు. రెండో వాక్యానికి ఆధారం ఆ పుస్తకంలోని విషయసూచిక. మూడో వాక్యానికి ఆధారం అదే పుస్తకం (PDF) లోని 9 పేజీలో ఇచ్చిన జడ్జెస్ పేర్లు, ఫోటోలు. విజేతల వివరాలకు ఆధారం కూడా విషయసూచికే. వీటిలో ఏది "మౌలిక పరిశోధన" అంటారు?
  2. విజేతల వివరాలకు ఆధారం కూడా విషయసూచికే. యథాతథంగా వాడడం వికీ నియమాలకు విరుద్ధం కదా? ఏం చెయ్యమంటారు? టేబుల్ తీసెయ్యాల్సిందే అంటారా?
  3. న్యాయనిర్ణేతల పేర్ల చివర "మొదలైనవారు" అని ఎందుకు చేర్చినారు? కామాలు కనబడిన ప్రతిచోటా "మొదలైన" అని చేర్చడం తప్పనిసరా? నాకు తెలిసినంతవరకు అక్కడ పేర్కొనని మరి కొందరు కూడా ఉన్నప్పుడు, అందరి పేర్లను పేర్కొనే అవసరం గానీ, వీలు గానీ లేనప్పుడు "ఇంకా ఉన్నారు" అని సూచించడానికి మాత్రమే "మొదలైన" అని వాడుతారు. ఇక్కడ ఉన్న న్యాయనిర్ణేతలందరి పేర్లూ ఇచ్చిన తర్వాత ఇంకా "మొదలైన" అనడం ఎందుకు? ఈ పదాన్ని మీరు చేర్చిన ఉద్దేశం నాకు తెలియదు. నేను నేరుగా తొలగిస్తే "అట్లా చెయ్యకూడదు" అని మీరు మళ్ళా ఒక పేజీడు ఉపదేశం ఇస్తారనే ఉద్దేశంతో క్లారిఫై చెయ్యమని అడుగుతున్నాను. త్రివిక్రమ్ (చర్చ) 06:04, 5 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@త్రివిక్రమ్ గారూ... 'నేను నేరుగా తొలగిస్తే "అట్లా చెయ్యకూడదు" అని మీరు మళ్ళా ఒక పేజీడు ఉపదేశం ఇస్తారనే ఉద్దేశంతో' అని అంటున్నారు. నేరుగా తొలగించకూడదు అని చెప్పింది వికీ మూసలు, ఇతర నోటిఫికేషన్ల విషయంలో మాత్రమేకానీ, వ్యాసంలోని సమాచారం గురించి కాదు. అయినా వికీ నియమాలను చెబితే మీకు ఉపదేశం లాగా అనిపిస్తుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీకు ఉపదేశాలు ఇవ్వడానికి ఇక్కడ మాకేం పనిలేదు అనుకోకండి, ఎవరేం చేసినా వికీ అభివృద్ధికోసమేనని గమనించండి. అందుకు నిదర్శనంగా మీరు సృష్టించిన ములుకనూర్ ప్రజా గ్రంథాలయం వ్యాసాన్ని నేను అభివృద్ధి చేయడం, ఇతర వ్యాసాలలోని మూలాలను నేను ఆర్కైవ్ చేసి మూలంలో చేర్చడం వంటివి చూడవచ్చు.
ఈ వ్యాసానికి ఒకే ఒక్క మూలం చేర్చారు. అది కూడా వ్యాస విషయానికి సంబంధించిన వెబ్సైటులో ఉన్న పుస్తకం పిడిఎఫ్ లింకు. పుస్తకం లింకు ఇవ్వకూడదా అంటే, ఇవ్వవచ్చు. అయితే, దానితోపాటు మరో మూలం కూడా చేర్చాల్సిన అవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక మూలం పోయినా మరో మూలం ఉంటుంది.
యథాతథంగా వాడడం వికీ నియమాలకు విరుద్ధం అని చెప్పింది ఒక పేర లేదా ఒక వాక్యం విషయంలో మాత్రమే.
మొదలైనవారు అని వాడడంలో తప్పేమి లేదని నా అభిప్రాయం. అది మీకు అవసరం లేదు అనిపిస్తే నిరభ్యరంతంగా మీరు తీసుకోవచ్చు.
ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:39, 5 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, అందుబాటులో ఉన్న ఒక్క మూలం చేర్చినాను. మూస తీసెయ్యడానికి అది సరిపోతాదని ఆశిస్తున్నాను. - త్రివిక్రమ్ (చర్చ) 16:42, 9 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@త్రివిక్రమ్ గారూ, చూస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 02:57, 10 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]