వాడుకరి:Dvlaxmikanth
మీరు గమనించారా! రోడ్డుపై మనం టూ వీలర్ పై వెళ్ళుతున్నప్పుడు మన ముందు వెళ్ళుతున్న ఆటో పొగ గొట్టం నుండి రోడ్డుపైకి గురి చూసి మరీ వదులుతుంది పొగను. అసలే వాయు కాలుష్యం తో అల్లాడి పోతుంటే పొగ గొట్టం నుండి వేగంగా వచ్చే గాలి డివైడర్ పక్కన భారీగా పేరుకొన్న ఉన్న దుమ్మును గాలిలోనికి లేపుతుంది. ఒకే సారి ముక్కుల్లోకి ప్రమాదకరమైన పొగ, కళ్ళల్లో మంటపుట్టించే దుమ్ము ఇక మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. తట్టుకోలేక కళ్ళు మూసుకున్నామా మనకు పెట్రోల్ ఖర్చులు మిగులుతాయి ఎందుకంటే మనకోసం అంబులెన్స్ వస్తుంది కాబట్టి. అలాగే బస్సులు లారీలు కూడా పొగను రోడ్డుపైకి గురిపెట్టి వేగంగా వదులుతాయి. మనం ఓవర్టేక్ చేసేది కూడా పొగగొట్టం పక్కనుండే. అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఎలాగూ వాయికాలుశ్యం అరికట్టలేము కాని సదరు కాలుష్యం డైరెక్ట్ గా మన ఊపిరితిత్తులలోనికి వెళ్ళకుండా మరియు రోడ్డుపై దుమ్ము లేవకుండా చేయగల అవకాశం ఉన్నది. మీరు గమనించారా ఆయిల్ టాంకర్ పొగ గొట్టాలను పైకి ఎయిమ్ చేసి పెడతారు. అలాగే ట్రాక్టర్ కు కూడా పైకే ఉంటుంది. అన్ని వాహనాలకు కూడా అలాగే పెడితే ట్రాఫిక్ లో వెళ్ళే వారికి పొగ దుమ్ము నుండి విముక్తి ఉంటుంది కదా. వాహనాల పొగ వేడిగా ఉండి దానికి వత్తిడి కూడా ఉండటంతో అది ఆటోమాటిక్ గా పైకి వెళుతుంది. ఇది ఎప్పటినుండో నా మనసులో ఉన్న అలోచన. ఇట్టి ఇబ్బంది అందరూ పడేదే కాని ఎవరూ ఆలోచించడం లేదు. వాహన తయారిదారులారా మీరైనా ఆలోచించండి.
మన చేతిలో లేనిదానిని, మరీ కష్టసాధ్యమైనది అయితే నిస్సహాయంగా చూస్తూ కూర్చోవటం తప్ప చేసేదేమీ ఉండదు. కాని కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చి తక్కువ ఖర్చుతో, సులభంగా చాలా పెద్ద సమస్యను తీర్చగలిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది? నా ఉద్దేశ్యంలో పైన చెప్పిన ఆలోచన తప్పనిసరిగా సత్పలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇట్టి ఆలోచన పై మేధావులు, (సామాన్యులుకూడా) చర్చించి తగు సలహాలను ఇవ్వగలిగితే సమాజానికి చాలా మేలు చేసినవారవుతారు.
మీ లక్ష్మీకాంత్