Jump to content

వాడుకరి:Haigopi

వికీపీడియా నుండి

నా పేరు గోపీ క్రిష్ణ. నేను పుట్టింది గుంటూరు. మా అమ్మ గారు, నాన్న గారు ఇద్దరు టీచర్సు. కన్నెవీడు అనే ఒక గ్రామం లో వారు 18 సంవత్సరములుగా పనిచేయుట వలన నేను ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అదే పల్లెటూరి లొ చదువుకున్నాను. బాల్యము ఎంత ఆనందంగా వుటుంది అనేది అలాంటి ఊరిలో పెరిగిన వారికి బాగానే తెలుస్తుంది.

నా పిజి (ఎమ్.స్.ఐ.స్) ఐన తరువాత ఐ.బి.మ్ లో 2003 లో ఉద్యోగములో చేరాను. అక్కడ నుంచి నా ప్రస్తానము ముదలైనట్లుంది, చాలా ప్రదేశాలలో పని చేశాను (ఇటలీ, జర్మనీ, లండన్, అమెరికా, బారి, రోమ్...ఇంకా వున్నా) చివరికి ఒక చోట స్తిరపడ్డాను. పనిలో మంచి పేరు సంపాదిచుకున్నాను. సమయాన్ని వ్రుధా చెయకుండా పని చేయటమే నా పని. కాని తెలుగు తనానికి దూరమయ్యాను. ఎక్కడ వున్నా, అన్నీ వున్నా, ఎన్ని వున్నా ఎదో కొరత. ఇంకొకటండోయ్, నాకు అంతరిష్కము అంటే ఎనలేని ఇష్టం కూడా. చాలా పరిశోధలని కూడా వూహించాను. త్వరలోనే వాటిని ప్రచురించాలని వుంది కూడా.

ఎక్కడ వున్నా, ఏమి చెస్తున్నా, దేశ భాషల యందు తెలుగు లెస్స అనేది మరిచిపోను, నా ప్రక్క వారిని మరువనీయను. ఇది నా ఒక్క అలవాటు కూడాను.