వాడుకరి:Prathyusha Veeravalli
నా పేరు ప్రత్యూష వీరవల్లి. నేను విజయవాడ ప్రాంతములో నివసిస్తున్నాను. నేను కాకరపర్తి భావనారాయణ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను.
వ్యాసరచన పోటీ కొరకు వ్యాసం
అబ్బూరి ఛాయాదేవి
[మార్చు]అబ్బూరి ఛాయాదేవి గారు సాహిత్య సంప్రదాయాల విజ్ఞత, సర్వమూ ఆకళించుకున్న స్థితప్రజ్ఞ మూర్తీభవించిన విధుషీమణిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితురాలు. మంచి కథ మనల్ని మరోలోకంలోకి తీసుకువెళ్తుంది. అది కావ్యలోకం,రమణీయం. కానీ అది మనకు తెలియని లోకం కాదు. ఆ కావ్యలోకంలోకి ప్రయాణించడం ఒక విలువైన అనుభవం. ఆ అనుభవం ఏదో హాయినీ, ఏదో ఆనందాన్నీ కలుగజేస్తుంది.ఆ అనుభవాన్ని కలిగించే వారిలో ఒకరు అబ్బూరి ఛాయాదేవి గారు.ఆమె రచనలలో పఠనా వైశాల్యం,ఆలోచనల సాంద్రత,భావ వ్యక్తీకరణలో స్పష్టత ఎంతో అద్భుతంగా ఉంటుంది.
బాల్యం -వివాహం
[మార్చు]అబ్బూరి ఛాయాదేవి గారు అక్టోబరు 13, 1933 లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు.ఆమె వివాహం 1953 లో అబ్బూరి రామకృష్ణారావు గారి కుమారుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితో జరిగింది.వీరు రచయిత, విమర్శకుడు మరియు అధికారిక భాషలు కమిషన్ మాజీ ఛైర్మన్.
వృత్తి
[మార్చు]ఛాయాదేవి గారు వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
ప్రసిద్ధ రచనలు
[మార్చు]1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ.వీరికి ఎంతగానో ప్రసిద్ధి గాంచిన కథలలో బోన్ సాయ్ జీవితం ఒకటి.ఇందులోబాలికా విద్య అవసరం గురించి అభ్యర్ధన చేశారు.ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది.ప్రయాణం,సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు మరికొన్ని వీరి ప్రసిద్ధి గాంచిన రచనలు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.
ఇతర రచనలు
[మార్చు]1954 లో 'స్వతంత్ర'ను రచించారు.ఆమె 1955-1957 లో ఆంగ్ల అనువాదాలు ప్రచురించిన త్రైమాసిక తెలుగు కవిత్వం 'కవిత' ను సవరించారు.ఆమె తన భర్త సహాయంతో ఆంగ్లంలో రాసిన స్థానిక కవిత్వం మరియు అస్సాం కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారు.ఛాయాదేవిగారి కథలు హిందీ, మరాఠీ, తమిళ, ఆంగ్ల స్పానిష్ భాషల్లో అనువదింపబడ్డాయి.సుఖాంతం,ప్రయాణం,అనగనగా కథలు,డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జీవితం, మృత్యుంజయ,20 వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు వీరి ఇతర రచనలు.
అవార్దులు
[మార్చు]- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక అవార్డు
- సుశీలా నారాయణరెడ్డి అవార్డు
- తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు
- దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు