వాడుకరి:Ram.mohanreddy223
అభినందనలు
[మార్చు]రామ్‌మోహన్‌రెడ్డిగారూ! నమస్తే. ముందస్తుగా, వికీ సభ్యులైన ఈ మంచి తరుణంలో అభినందనలు అందుకోండి. మీరు గ్రామ గురించి వ్రాసినదు చూశాను. చక్కాగా వ్రాశారు. చిన్న చిన్న మార్పులు చేశాను, ఒక సారి చూడండి. తరువాత, వ్యాసంలో సాధ్యమైనంతవరకు, ఆంగ్ల పదాలు దొర్లకుండా చూడండి. మీ దగ్గర గ్రామానికి సంబంధించిన ఫొటోలు(దేవాలయాలు, చెరువు/లు) ఏమైనా ఉంటే అప్‌లోడ్ చెయ్యండి. ఈ ఊరికి పేరు ఎలా వచ్చింది, ఇంకా ఇతర వృత్తులు ఏమేమి ఉన్నాయి, విద్యా, సమాచార, వైద్య సౌకర్యాలు ఏమి ఉన్నాయి అన్న విషయాలు కూడ వ్రాస్తే బాగుంటుంది.
ఇతర గ్రామాల వ్యాసాలు కూడ ఒక సారి చదివి చూడండి. యెల్లాయపాలెం, శాయపురం వ్యాసాలు చూడండి, మరికొంత అవగాహన వస్తుంది. చక్కగా వ్రాస్తున్నారు. కొనసాగించండి. చిన్న చిన్న అక్షర దోషాలు వస్తే ఇతర సభ్యులు సరిచేస్తారు. మీరు మరిన్ని చక్కటి వ్యాసాలు వ్రాస్తారని ఆశిస్తూ,--S I V A 01:30, 19 జనవరి 2009 (UTC)