Jump to content

యల్లాయపాళెం

అక్షాంశ రేఖాంశాలు: 14°32′10″N 79°57′06″E / 14.536007°N 79.951553°E / 14.536007; 79.951553
వికీపీడియా నుండి
(యెల్లాయపాలెం నుండి దారిమార్పు చెందింది)
యల్లాయపాళెం
—  రెవిన్యూ గ్రామం  —
యల్లాయపాళెం బజారు
యల్లాయపాళెం బజారు
యల్లాయపాళెం బజారు
యల్లాయపాళెం is located in Andhra Pradesh
యల్లాయపాళెం
యల్లాయపాళెం
అక్షాంశరేఖాంశాలు: 14°32′10″N 79°57′06″E / 14.536007°N 79.951553°E / 14.536007; 79.951553
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కొడవలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,855
 - పురుషులు 4,485
 - స్త్రీలు 4,370
 - గృహాల సంఖ్య 2,366
పిన్ కోడ్ 524366
ఎస్.టి.డి కోడ్ 08622

ఎల్లాయపాలెం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొడవలూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నెల్లూరు నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2366 ఇళ్లతో, 8855 జనాభాతో 1609 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4485, ఆడవారి సంఖ్య 4370. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2742 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1468. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591900.[1]

సమీప గ్రామాలు

[మార్చు]

కోవూరు 3 కి.మీ, పాతూరు 3 కి.మీ, గండవరం 4 కి.మీ, గుండాలమ్మపాలెం 5 కి.మీ, కొడవలూరు 5 కి.మీ

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బుచ్చిరెడ్డిపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల ఉత్తర రాజుపాలెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నెల్లూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఎల్లాయపాలెంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

పుట్టుక

[మార్చు]

ఆ రోజు వాతావరణం కొద్దిగా మబ్బులు పట్టి ఉంది. ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా, 'ఆ, ఈ మబ్బులు కాసేపే' అంటూ రోజూ లాగే పశువులు తోలుకుని అడవిలోకి బయలుదేరాడు. వాతావరణం బావుందేమో! తెలీకుండానే పశువులతో పాటుగా చాలా దూరం వచ్చేశాడు. దారిలో చిన్న వాగు, వాగుకి అవతల వృక్షాలు, పచ్చటి ప్రాంతం చూసి నెమ్మదిగా వాగు దాటి అక్కడికి చేరాడు. ఇక ముందుకు కదలాలనిపించలేదు. అక్కడ పశువులని మేతకి వదలి, తను కూడా తనతో పాటే తెచ్చుకున్న చద్దన్నం తిని, వాగు లోని నీళ్ళు తాగాడు. ఇక్కడ నీళ్ళకి ఇంత రుచి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఓ చెట్టు కింద నిద్ర లోకి జారి పోయాడు. ముసురు పట్టిన మబ్బు ఇంకాస్త తీవ్ర రూపం దాల్చింది. ఒక్క సారిగా పెద్ద వర్షం. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొన్న అతను పశువులని హడావిడిగా తోలుకుంటూ కాస్త ఎత్తైన ప్రదేశం చేరాడు. సరేలే, ఈ వాన తగ్గాక, ఇక ఇంటికి వెల్లిపోదాం అనుకుంటున్నాడు. వర్షం తగ్గక పోగా ఇంకాస్త భీకరంగా మారింది. ఈ రాత్రికి ఇక ఇక్కడే, ఒక్కడినే ఎలానో అనుకుంటూ చాలా సేపటికి నిద్ర లోకి జారుకున్నాడు. రాత్రంతా కుండపోతగా కురిసిన వాన తెల్లవారేసరికి మందగించింది. దాంతో పశువులను తోలుకుని తిరుగుముఖం పట్టాడు. తీరా వాగు దగ్గరికి వచ్చేసరికి... నిన్నటి దాకా ప్రశాంతంగా వున్న పిల్ల వాగు ఉగ్ర నాగు లాగా ఉంది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. అది ఎప్పటికి తగ్గుతుందో తెలీని పరిస్ఠితి? అతనికేం తెలుసు, అక్కడే ఇంకొద్ది రోజులు గడపాలని... అలా వాగు మామూలు పరిస్ఠితికి వచ్చేవరకు, ఆ ప్రాంతంలో నే ఫలాలు తింటూ, పశువుల పాలు తాగుతూ కొద్దిరోజులు గడిపాడు. ఆశ్చర్యకరమేమిటంటే, ఆ ప్రాంతంలో మేత తిన్నాక పశువులు అంతకుముందెన్నడూ లేనట్లుగా విపరీతంగా పాలివ్వడం ప్రారంభించాయి. అతనికి కూడా అక్కడ వున్నన్ని రోజులు తిండికి ఇబ్బంది కాలేదు. కొద్దిరోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరిన అతను ఈ విషయాలన్నీ తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పాడు. దాంతో వారందరికీ కూడా ఆ ప్రాంతం చూడాలని అనిపించడంతో అందరూ కలిసి ఆ ప్రాంతం వచ్చి అంత మంచి ప్రాంతం వదలివెళ్ళడం ఇష్టం లేక అక్కడే స్ఠిర పడి పోయారు. ఇలా వారంతా స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది. ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు, తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్థులు ఊరి పుట్టుక గురించి చెప్పుకునే విషయాలలో ఇది ఒకటి.

చరిత్ర

[మార్చు]
1946 ముందు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మేటి గ్రామాలలో ఒకటి. ఊళ్ళో పంట రెడ్లు ఎక్కువ. వీరు భూస్వాములూ వ్యవసాయదారులూ కూడా. వీరు కాక దేవాంగులూ (చేనేత పనివారు), ముస్లిం లు, బలిజ వారు, హరిజనులు, ఇతర చేతి వృత్తుల వారు ఉండేవారు. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే చాలాకాలంగా పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, పెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో గూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహాలక్షమ్మ గుడి ఉంది.

1946 తర్వాత

చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ మేటి గ్రామం గానే వెలుగొందుతోంది. గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి.

1950 దశకంలో [ఆధారం చూపాలి] అప్పుడు నేను పది సం.వాడిని. నాకు నాకంటే పెద్దవారికి ఈసంగతులన్ని తెలుసు.ఇప్పుదు నేను అమెరికాలో ఉన్నాను. ఆధారాలు కోసం ప్రయత్నిస్తాను.

గ్రామంలో తగాదాలు వుండేవి.రైతులు హరిజనుల మధ్య కొట్లాటలు జరిగాయి.ఇరువురు కొన్నిసార్లు కర్రలతోను, కొన్నిసార్లు కత్తులతో కొట్లాడుకొన్నారు. చాలా మంది పెద్ద గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.ఇరువురు పోలీసు కేసులు పెట్టుకున్నారు.ఈ జామీనుకేసుల్లో జిల్లాలోని వివిధ కోర్టుల చుట్టూ తిరిగారు. అలిసిపోయారు.తిరిగి ప్రశాంతత నెలకొన్నది.

1960 దశకంలో

భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామంలోని యువత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసారు. యువత విజయం సాధించింది.గండవరపు బాలకృష్ణా రెడ్డి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

1970 దశకంలో

గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యం మొదలయింది.మళ్ళీ కొంతకాలం తగాదాలు, కొట్లాటలు జరిగాయి.ఒక రైతు కూడా చనిపోయాడు.ప్రస్తుతం పెద్ద తగాదాలు లేవు.కాని సదవగాహన కూడా లేదు.

గ్రామం లోని వివిధ ప్రాంతాలు

[మార్చు]

గ్రామములోని వివిధ ప్రాంతాలను గ్రామవాసుల పిలుపులలో ఈ విదంగా పలుకుతారు.చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం (యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం (రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ.

వాడుక పదాలు ప్రాంతాలు

చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్, మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఎల్లాయపాలెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామములో సౌకర్యాలు

[మార్చు]
యల్లాయపాళెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు
1977లో పదవ తరగతి చదివిన యల్లాయపాళెం విద్యార్థులు
  • 1-5 తరగతుల వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.
  • 6-10 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
  • తేజ్ నికేతన్ కాన్వెంట్.
  • అంగన్ వాడి బడి.
  • బలహీన, వెనుకబడిన వర్గాల పిల్లలకు వసతి గృహాలు.
  • పంచాయితీ కార్యాలయం.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  • పశువుల ఆస్పత్రి.
  • పోస్ట్ ఆఫీస్.
  • టెలిఫోన్ ఎక్స్ఛేంజ్.
  • పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం.
  • వ్యవసాయదారుల సహకార సంఘం.
  • ఆంధ్రా బ్యాంక్.
  • జిల్లా గ్రంథాలయం.
  • బాపూజీ విజ్ఞాన కేంద్రం.
  • కంప్యూటర్, కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు

దేవాలయాలు

[మార్చు]
  • మహాలక్ష్మమ్మ గుడి.
  • కంభం రాతి ఆంజనేయ స్వామి గుడి
  • సాయి బాబా గుడి.
  • కుమ్మరివీధి రామ మందిరం
  • గంగమ్మ గుడి
  • బ్రహ్మం గారి గుడి.
  • మసీదు.
  • శివాలయం.
  • తూర్పు వీధి రామ మందిరం.
  • శివబాబా ఆలయం (ఓం శాంతి)
  • చర్చి.
  • చెన్నకేశవ స్వామి ఆలయం.
  • గ్రామ పొలిమేరలలో గ్రామ దేవతలు

వ్యవసాయం

[మార్చు]

ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలుగా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.

  • ఇప్పుడు రొయ్యలసాగు ఆగిపోయింది.ఆ మాటకొస్తే జిల్లాలో కూడా సాగుబడి చాలవరకు తగ్గిపోయింది.ఒకప్పుడు 1,50,000 ఎకరాలు సాగులోవుండేవి.ఇప్పుడు 50,000.ఎకరాల కంటే సాగు తగ్గిపోయింది.రొయ్యల గుంటలన్ని పూడ్చి మళ్ళి వరి సాగుమొదలు పెట్టారు. గ్రామంలో దాదాపు 3,000ఎ.సాగుబడి పొలం ఉంది.పడమరనున్న అడవి పొలం తప్పితే మిగిలిన పొలానికి చాలవరకు బోరు బావులున్నాయి. మొదటి కారు, అప్పుడప్పుడు రెండొ కారు కనిగిరి చెరువు నీటితో సాగు అవుతున్నాయి. 20సం:ముందు ప్రధాన పంటగా మొలగొలుకులు, రెండో పంటగా దొంగ నెంబర్లు (అంతకుముందు ఎర్రకేసర్లు) పండించేవారు.ఇప్పుడు మొలగొలుకులు కనుమరుగయినాయి.మూడు పిడికిళ్ళులాంటి హైబ్రిడ్ రకాలు సాగుచేస్తున్నారు. పొలాల ధరలు కూడా బాగా పెరిగాయి.ఒక ఎకరం రూ.పది లక్షలు. గతంలో 200-300 ఎకరాల కమతాలు కొన్ని వుండేవి.ఇప్పుడు 30 ఎ.మించి ఎవరికి లేవు. గతంలో ఎద్దులు, బండ్లు, నాగళ్ళు, తదితర పరికరాలతో వ్యవసాయం చేసేవారు.ఇప్పుడు ట్రాక్టర్లు, వరికోత మిషన్లు. వ్యవసాయ కూలీలు బాగా తగ్గిపోయారు.సేద్యం చేయించడం చాలా కస్టంగా ఉంది.
  • పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిచెందినది.పాలు గతంలో బస్సులోను, సైకిళ్ళలోను నెల్లూరుకు తీసికెళ్ళి అమ్మేవారు.ఇప్పుడు పాల సొసైటీలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

మొదట్లో మోటారు వాహనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో ప్రజలు దగ్గర్లోని రాజుపాలెం, బుచ్చిరెడ్డిపాలెము లకు కాలి నడకన పొలాల వెంబడి వెళ్ళి పోయే వారు. కొద్దిగా స్థితి మంతులైతే బండ్లు కట్టించుకునే వారు. చాలా కొద్ది మందికి మాత్రమే గుర్రపు బగ్గీలుండేవి. ఆ రోజుల్లో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం కావడంతో మేలు జాతి ఎద్దులు, పశువులను కొనుక్కుని వందల కి.మీ. దూరం వాటిని తోలుకుంటూ కాలినడకనే వచ్చేసేవారు. 1980-85 ప్రాంతంలో అనికేపల్లి బస్సు, అగ్గిపెట్టె బస్సు అని ఉండేవి. వీటిని ప్రైవేటు వారు నడిపేవారు. వీటిని నడిపిన డ్రైవర్లకి ఆ పేర్లే ఇంటి పేర్లుగా మారిపోయాయి. (ఉదా:అనికేపల్లి శీనయ్య) తర్వాతి కాలంలో గ్రామస్తుల కోరిక మేరకు RTC కూడా ఒక బస్సు నడపడం ప్రారంభించింది. దీనిని డేవుడ్ బస్సు (Day-Out) గా వ్యవహరించే వారు. ఇది బుచ్చి కి, రాజుపాళెం మీదుగా నెల్లూరు, ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు నడిచేది. తర్వాత 90 ల ప్రాంతంలో జరిగిన శ్రీ రామ సేతు (మలిదేవి బ్రిడ్జి) నిర్మాణంతో పాటూరు, గుమ్మళ్ళదిబ్బ ల మీదుగా బస్సులు నడపడానికి వీలు కుదిరింది. ఈ మార్గంలో RTC రెండు బస్సులు నడిపేది. వీటిని Flight, Cheeta లుగా వ్యవహరించేవారు. Flight బుచ్చి నండి అయ్యప్ప గుడి వరకు, Cheeta రాజుపాళెం నుండి ఆమంచర్ల వరకు నడిచేవి. తర్వాత కొద్ది కాలంలోనే ఈ మార్గంలో 3-4 ప్రైవేటు బస్సులు కూడా నడవడం ప్రారంభించాయి.

ప్రస్తుతం అనేక ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆర్.టి.సి.బస్సులు ఏమీ లేవు.మూడు ప్రైవేటు బస్సులు మాత్రం ఉన్నాయి.

గ్రామ సర్పంచులు

[మార్చు]
  • ప్రస్తుత సర్పంచ్ - దేవిరెడ్డి శ్రీలక్ష్మి

గతంలోని సర్పంచులు

[మార్చు]
  • చేవూరు సుబ్బరామిరెడ్డి
  • పందిపాటి రామిరెడ్డి
  • రేబాల వేణు గోపాల కృష్ణారెడ్డి
  • గండవరపు బాలకృష్ణా రెడ్డి
  • బడుగు శ్రీనివాసులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • చింతా మోహన్ (ఎమ్.పి)
  • మేడా ఆదిశేషమ్మ/ఎన్.రాజ్యలక్ష్మి (మాజీమంత్రి)
  • పందిపాటి లచ్చా రెడ్డి (మొదటి ఇంజనీరు)
  • మందిపాటి వెంకట కృష్ణారెడ్డి (ఇంజనీరు)
  • సర్యాభొట్ల సీతారామయ్య "
  • దేవిరెడ్డి రామిరెడ్డీ "
  • తమ్మిరెడ్డీ రాధాకృష్ణా రెడ్డీ "
  • కట్టా పరంధామి రెడ్డి "
  • యేకొల్లు శ్రీనివాసులు రెడ్డి "
  • పెనుమల్లి మస్తాన్ రెడ్డి "
  • చలమ్చర్ల భాస్కర రెడ్డి "
  • మేడా వెంకట సుబ్బా రెడ్డి (డిజిఎం, రిటైర్, ఆప్ కాబ్)

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఎల్లాయపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 82 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 279 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 33 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 19 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 16 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1178 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 8 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1170 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఎల్లాయపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1170 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఎల్లాయపాలెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

ముఖ్య ఘటనలు

[మార్చు]
  • 1933, డిసెంబరు 30: మహాత్మా గాంధీ సందర్శన
  • 1935, నవంబరు 12: బాబూ రాజేంద్ర ప్రసాద్ సందర్శన.
  • యల్లాయపాళెం గ్రామంలో మద్యం ఆగడాలు తీవ్రమయ్యాయి. బెల్టు దుకాణాల తీరు శృతి మించిపోవడంతో, గ్రామంలో మద్యం అమ్మకాలు తుదముట్టించేందుకు గ్రామ మహిళలంతా సంఘటితంగా పోరాటం చేశారు. వీరికి జిల్లా శిక్షణ కలెక్టరు అళగ వర్షిణి అండగా నిలిచారు. దీనితో గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయినవి. గ్రామస్తుల సంతోషానికి హద్దులు లేకుండా పోయినవి. ఆ ఆనందం పంచుకోవడానికి మహిళలందరూ కలిసి నెల్లూరు వెళ్ళి, కలెక్టరును కృతగ్నతలతో ముంచెత్తి, పుష్పాభిషేకం చేశారు.
  • యల్లాయపాలెం గ్రామములోని శ్రీ దేవిరెడ్డి సుందరరామిరెడ్డి, బుజ్జమ్మల స్మారక క్రీడాప్రాంగణంలో జాతీయస్థాయి ప్రత్యేక ఆహ్వానితుల బాల్ బ్యాడ్మింటను పోటీలు 2014, ఫిబ్రవరి-22 నుండి జరుగును. [2]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]