చర్చ:యల్లాయపాళెం
స్వరూపం
సర్పంచ్ భర్త పేరు
[మార్చు]సర్పంచ్ లకు భర్త పేరు, తండ్రి పేరు పక్కన వ్రాయటంలో ఔచిత్యం నాకు కనిపించటం లేదు. నేను వాటిని తొలగిస్తున్నాను, మరళా కలపాలంటే ఇక్కడ చర్చించగలరు. Chavakiran 02:42, 1 జూలై 2010 (UTC) ఇప్పటి తరం వారి పేర్లు వెనకటి తరం వారికి తెలియాలంటే తండ్రి పేరు,ఇంటి పేరు అవసరము. ఓటర్ల లిస్టులో కూడ తండ్రి,భర్త పేర్లు వుంటాయి. ఒక్కోసారి అదేపేరు ఇద్దరికి వుంటుంది. అందుకని మళ్ళి కలపండి. ధన్యవాదములు.
- స్పందించినందుకు నెనర్లు. ఇంటి పేరు వ్రాయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం కనిపించటం లేదు. ఇలా ప్రధాన వ్యాసంలో అనగా గ్రామం పేరుతో ఉన్న వ్యాసంలో సర్పంచి ముఖ్యంగా ఆడ సర్పంచి యొక్క భర్త పేరు, తండ్రి పేరు సత్సంప్రదాయం కాదు. దానికి బదులుగా వారి పేరుతో ఒక వ్యాసం తయారు చేసి ఆ వ్యక్తిగత విషయాలు అన్నీ అక్కడ ఇవ్వగలరు. ఒక రకంగా ఆ ఆడ సర్పంచిని ఇలా భర్త పేరు, తండ్రి పేరు ప్రధాన గ్రామ పేజీలో ఇచ్చి అవమానిచ్చినట్టుగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మిగతా మగ సర్పంచులకు అలా చెయ్యటం లేదుకదా మనం. దానికి బదులుగా ఆ వ్యక్తి పేరుతో వ్యాసం సృజించి అందులో తండ్రి పేరు, భర్త పేరు, పిల్లల పేర్లు, చదువు, విజయాలు, అపజయాలు అన్నీ నమోదు చెయ్యవచ్చు. Chavakiran 13:45, 8 జూలై 2010 (UTC)