అక్షాంశ రేఖాంశాలు: 14°32′17″N 79°52′30″E / 14.538°N 79.875°E / 14.538; 79.875

బుచ్చిరెడ్డిపాలెం

వికీపీడియా నుండి
(బుచ్చిరెడ్డిపాలెము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 14°32′17″N 79°52′30″E / 14.538°N 79.875°E / 14.538; 79.875
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంబుచ్చిరెడ్డిపాలెం మండలం
జనాభా
 (2011)[1]
 • మొత్తం38,405
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08622 Edit this on Wikidata )
పిన్(PIN)524305 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata
బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయం

బుచ్చిరెడ్డిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని పట్టణం, మండలకేంద్రం.

భౌగోళికం

[మార్చు]

నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరంలో వాయవ్య దిశలో ఉంది.

పరిపాలన

[మార్చు]

జమీందార్లు, రాజకీయ పెత్తందార్లకు నెలవైన ఈ పంచాయతీ సర్పంచి పదవిని, 72 సంవత్సరాల తరువాత 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎస్.సి.వర్గానికి లభించింది. 1940 లలో బుచ్చి రెడ్డిపాలెం పంచాయతీ ప్రెసిడెంటుగా ఎస్.సి.సామాజిక వర్గానికి చెందిన జూగుంట బోడెయ్య పనిచేసాడు. 1940 జూన్ 12 నుండి 1941 ఏప్రిల్-2 వరకు, కేవలం 10 నెలలు ప్రసిడెంటుగా పనిచేశాడు. బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఇది నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉంది. సమీప రైల్వే స్టేషను‌ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నం వద్ద, విమానాశ్రయం రేణిగుంటలో ఉన్నాయి.

ప్రధాన వృత్తులు

[మార్చు]

ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం, వ్యాపారము. వరి, చెరుకు పండిస్తారు. రొయ్యలు, చేపల పెంపకము (ఆక్వా కల్చర్‌) కూడా చేస్తారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ కోదండ రామస్వామి ఆలయం - పల్లవుల నాటిది.
  • శ్రీ భద్రావతి దేవి సమేత శ్రీభావనాఋషిశ్వర స్వామి దేవస్థానం .
  • శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానం
  • శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం
  • శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం
  • శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం
  • శ్రీ సాయిబాబా మందిరం
  • శ్రీ చాముండేశ్వరి దేవస్థానం
  • శ్రీమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం
  • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం
  • శ్రీకృష్ణ మందిరం
  • శ్రీ కామాక్షమ్మ దేవస్థానం
  • శ్రీ బాల వరసిద్ధి వినాయక దేవస్థానము.
  • శ్రీ సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానము.

చిత్ర మాలిక

[మార్చు]

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానం .

[మార్చు]

బుచ్చి రెడ్డి పాలెం గ్రామంలో వెలసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణం కొరకు స్వస్తి శ్రీ మన్మధ నామ సంవత్సరం జేస్ట బహుళ పంచమి ఆదివారం తేదీ 07:06:2015 న శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో ఉదయం 8-2 9నుండి 8-53 ల మధ్య రామకృష్ణ నగర్ నందు శ్రీ ప్రజ్ఞా నంద స్వామి వారి (యోగి రామ తపోవనం) స్వహస్తాలతో శంకుస్థాపన మహోత్సవం పూజా కార్యక్రమం అత్యంత వైభవం గా జరిగినది.

ఇతర విశేషాలు

[మార్చు]
  • బుచ్చిరెడ్డిపాలెం విస్తారమైన ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి చెందింది.
  • అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.

ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. https://web.archive.org/web/20210422193328/https://cdma.ap.gov.in/en/nagarpanchayats. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 4 జూలై 2022. {{cite web}}: Missing or empty |title= (help)