వాడుకరి:Satya veena mondreti

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం నేను సత్యవీణమొండ్రేటి..కవయిత్రి,రచయిత్రి.వందల కవితలు రాసాను.150కథలు రాసాను..అనేక పురస్కారాలు పొందాను.సాహితీరత్న,జ్ఞానతేజ,తెలుగుకీర్తి,కవి శ్రేష్ఠ బిరుదులు ఉన్నాయి.సత్యవాక్కులు ఆధునిక ప్రక్రియల పుస్తకం .. వీణ నాదాలు కవితల పుస్తకం ప్రచురణ అయినవి.. సత్య వాక్కులు బుక్ కి తెలంగాణ,ఆంధ్ర రాష్ట్ర పురస్కారాలు లభించాయి. నేను పుట్టింది కాకినాడ ఆంధ్రప్రదేశ్ లో విద్యాభ్యాసం: ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్...పాలిటిక్స్ లెక్చరర్ గా ఉద్యోగం... భర్త ఉద్యోగరీత్యా గుజరాత్ లో నివాసం. సాహిత్య ప్రయాణం కాలేజ్ రోజులనుండి ఉంది


నా కవితలు 1.

అంశం: ప్రాణ వీణ ప్రణవ నాదం శీర్షిక: సృష్టికారం

ఓం కారనాదం ప్రాణ వీణానాదం సృష్టి లయ కారం సర్వేశుని అలంకారం ప్రతిధ్వనించే ప్రణవ నాదం సృష్టికి మూలాధారం ఓంకార సిద్ధ యోగం రుగ్మతల నివారణాయాగం నాభి నుండి ఉద్భవించే మహత్తర శబ్దం శంకరుని ఆభరణం.. ఓంకార నాదం వేదాల నిక్షిప్తం అజరామర సృష్టికి ఆధారం ఓంకారమే జీవన సారం అద్వైతానికి అమరత్వానికి ఓంకారమే సాన్నిహిత్యం ప్రాణవీణా ప్రణవ నాదం త్రిమూర్తుల త్రిమాతల లోక కళ్యాణార్థ మహిమాన్వితం ఓంకారం... సర్వరోగ నివారిణి సర్వరక్ష శుభకారిణి ఓం నమశ్శివాయ నాదం ఓంకార ఐశ్వర్య నిలయం ఓంకారేశ్వర హృదయం.. ఓం నమో నారాయణా నాదమే నీకు ఆమోదం పరబ్రహ్మ ప్రమోదం..... ఓంకార ఉచ్చారణం మానవ శరీర ఉత్తేరణం... ఓం ఓం ఓం ఓం ఓం ఓంకార ప్రాణ వీణ ప్రణవ నాదం నమోస్తుతే నమః శివాయ...

నా స్వీయ రచన

2 శ్రీమతి సత్యవీణమొండ్రేటి హైదరాబాద్

అంశం: గోమాత శీర్షిక; శుభ పూజిత

పవిత్ర దేవత గోమాత హిందువుల శుభ పూజిత గోపూజ సర్వపాపహరం సర్వశుభాలకుచిహ్నం గంగ గోవు గరిటడైన చాలు పుణ్య కార్యాలకు ఆవుపాలు పాలు మూత్రం పేడ శుభసిరులే గో హైందవ సంస్కృతి చిహ్నం గో పాదాలు పితృదేవతలు కాళ్లలో సమస్త పర్వతాలు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు కంటమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్ము నవగ్రహాలు మోపురమున బ్రహ్మదేవుడు గంగ డోలు నకాశీ ప్రయోగ నదులు సమస్త దేవతల నిలయం గోమాత గోమాతను ఏ తిధిని పూజించిన మహాబలమేను మహా ఫలమేను గోవుకు ఆహారం అందించిన సెనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు... శిశువులకు ఆవుపాలు సంపూర్ణ ఆహారం.... గో రక్షణ కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు... సర్వ శ్రేష్టతను కలిగిన కామధేనువు గోవు తిరుగాడు ముంగిళ్ళు స్వర్గధామపులోగిళ్లు గోవు దర్శనం సర్వ శుభకరం

నా స్వీయ రచన

3. జయహో దశ వార్షిక తెలంగాణ!

మహానుభావులు మహిని గెలిచిన రోజు పోరుగడ్డ నేడు జీవగడ్డ దశాబ్దాల విప్లవం దశదిశలా వెలిగే వీర విహార దినోత్సవం వేళ అవధులే లేని ఆనంద హేళ గుండె గూటిలో గువ్వఎగిరేనులే సంబరాలు అంబరాన సందడి చేయగా అభివృద్ధి పదాన అలరారే రాష్టం ఉద్యోగ అవకాశాలే ఉజ్వల భవిష్యత్తు. జలవనర సమృద్ధి జలజలా ప్రవహించే బాపు కేసీఆర్ ప్రభుత్వ పథకాలు ఆదుకునే ప్రజలను ఆవిర్భావ వేడుక ఆమనిగ అలరారే తెలంగాణ కోటి రతనాల వీణ త్యాగధనుల హృదయ వాణి. కళామతల్లి కొలువు కూటం సాహితీ వీరుల సుమ క్షేత్రం బోనాల పండుగ సందడి బతుకమ్మ పూల గౌరమ్మ జమ్మి ఆకు హరిసంపదసిరి రామప్ప గుడి న శిల్పకళ వేయి స్తంభాల సప్త స్వరాలు రుద్రమ్మ శౌర్యం ఓరుగల్లు వైభవం అడవి బిడ్డల సమ్మక్క సారక్క జాతర కృష్ణ గోదావరి ల ఒరవడి జల చింత తీర్చే కుంతాలా మంజీరమ్మ మంచి తీర్థం శక్తిపీఠ మా జోగులాంబ రఘువేంద్రుని రస జగతి ఏ దిక్కు వెళ్లిన తెలంగాణా సంస్కృతి సంప్రదాయపరగణా

సుమధుర భాగ్యనగరం 

హిందూ ముస్లింల మేలు కలయిక రాజస్థానాల పుట్టినిల్లు కీర్తి కలిగితురాయి తెలుగు యాసకు నుడికారం తెలుగు భాషకు మమకారం అద్వితీయ తెలంగాణా నవరసనాధాల నవ్య వీణ.. జయహో తెలంగాణా..

4,జిహ్వ

నర లేని నాలుక.. పుర్రెకు ఒక బుద్ధి.. జిహ్వకు ఒక రుచి అన్నారు పెద్దలు నాలుకపై నాట్యమాడే సరస్వతి నవరసాలు పలికించే వేదిక చాపల్యానికి అదుపు మాటల ప్రవాహానికి మదుపు ఉండాలి అదే ఆరోగ్యం చెంచలనాన్ని ఇంద్రియ జ్ఞానాన్ని సంవేదన తెలివి అనుభూతి జిహ్వ స్వభావాలు మనిషికి మాత్రమే భగవంతుని ప్రసాదాలు జిహ్వ దైవ తీర్థాన్ని సేవించే వరాన్ని ఇచ్చాడు ఆ జీవను ప్రదోపకారిగా ఉపయోగించి సిడిప్రలాపములు పలకరాదు నాలుక ఉంది కదా అని మాటలతో హింసింస్ రాదు మాట తూటా కన్నా మిన్న మృతులను తెలిపే నాలుక రసాస్వాదన పలకాలి నొప్పింపక తానవ్వక చక్కని ప్రతి పదజాల పరిమళం దైవారాధనకు మంత్రమాల విశ్వశాంతికి దీవెన పలకాలి రుచుల జిహ్వ సదా కమ్మని రుచుల తో ప్రగతికి దోహదం చేయాలి.మంచి పలుకులతో మానవతా మనుగడకు సహకరించాలి...






అంశం: కథా కవిత

శీర్షిక: జయహో మహిళ

సృష్టికి మూలమైన మగువా

చూపవమ్మ నీ తెగువ..

కోటి కలలతో అత్తింట అడుగు

పెట్టావ్..

ఆర్థికంగా కుటుంబాన్ని ఆదు కున్నావ్..

అనుబందాలకి విలువ నిచ్చావు..

సంసార బాధ్యతలు పంచు కున్నావు..

నిరాదరణకు లోనైనా ఓర్పు సహనంతో సంసార బంధాల న్ని‌ సక్రమంగా నెరవేర్చావు...

బిడ్డకు జన్మనిచ్చావ్

దుర్వ్యసనాలకు లోనైన భర్తను

భరించావ్...

పరాయిస్త్రీ తో భర్త ప్రవర్తనను

ఏ స్త్రీ భరించలేదు...

పసిపాప భవిత కోసం ధైర్యంగా

బయటికి వచ్చిన నీ ఆత్మ ధైర్యానికి జోహార్లు మహిళా

సాగిపో..ముందుకు....

నీ ఆత్మ విశ్వాసమే నీకు శ్రీరామ

రక్ష...బంగారు భవిష్యత్తు...

తర తరాలుగా పురుషాధిక్య

ప్రపంచంలో బలై పోతున్న

స్త్రీ  జీవితం పునరావృతం కారాదు...

బ్రతుకుభంగపడితే ....భరించేవాడు దుర్మార్గుడైన బాధలు

పడుతూ...రోగాలు తెచ్చుకుని

అతనితో గడపటం అవివేకం

నేటి సంఘం సహకరిస్తుంది...

దగా పడిన మహిళను ఆదరిస్తుంది....జయహో

మహిళా...జయోస్తు...

నా స్వీయ రచన