Jump to content

వాడుకరి:Kbssarma

వికీపీడియా నుండి

తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ

భాష,సాహిత్యం,సంస్కృతి,కళలు,జనపదం,వికాసం,ఆధ్యాత్మికం - అన్న అంశాలను స్థూలంగా పరిగణనలోకి తీసుకొని, తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేషమైన, స్వచ్చంద సేవలను అందించేందుకు 'తెలుగురధం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థని, ఆశ్వయుజ బహుళ ఏకాదశి రోజున - 24 అక్టోబర్ 2008 న పద్మభూషణ్,జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు హైదరాబాద్,నగర కేంద్ర గ్రంథాలయంలో ప్రారంభించారు.ఆ ప్రారంభ సభలో - తెలుగు భాషా పరిరక్షకులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, ప్రముఖ కవి,రచయిత, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డా.జొన్నలగడ్డ అనూరాధ గారు,శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు గారు, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, నగర కేంద్ర గ్రంథాలయం అధ్యక్షులు శ్రీ గడ్డం శ్రీనివాస్ గారు ప్రారంభ సభలో పాల్గొన్నారు.