Jump to content

V నిర్మాణం

వికీపీడియా నుండి
వి ఆకారంలో ఎగురుతున్న పక్షుల సమూహం
వి ఆకారంలో యుద్ధ విమానాల విన్యాసాలు

v నిర్మాణం అనేది పెద్ద బాతులు, హంసలు, బాతులు ఇంకా ఇతర వలస పక్షుల గుంపులచే ఆకాశంలో ఆంగ్ల అక్షరం "వి" ఆకారంలో ఏర్పడే సౌష్టవ నిర్మాణం. ఆకాశంలో వి (v) ఆకారం నిర్మాణం వల్ల ప్రవాహి ఘర్షణ తగ్గడం మూలంగా విమానాల్లో ఇంధన సామర్థ్యం మెరుగు పడుతుంది. అందువలన ఈ నిర్మాణాన్ని సైనిక విమాన సంబంధించిన వివిధ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.

వాయుగతి శాస్త్రము

[మార్చు]

వి (v) ఆకారంలో ఎగురుట వలన పక్షుల్లో, ముఖ్యంగా ఎక్కువ దూరం ఎగిరే వలస పక్షుల మార్గాల్లో వాటి ఎగిరే సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.[1] వి ఆకారంలో ఎగరటం వలన అవి తక్కువ శక్తితో ఎక్కువ దూరం ఎగరగలవు.ఈ వి ఆకారంలో ముందు ఉన్న పక్షి రెక్కలు కిందికి ఊపినప్పుడు గాలిని రెక్కల క్రిందికి తోస్తుంది. దాంతో దాని రెక్కల కింద ఎక్కువ పీడనం ఉంటుంది. అలాగే రెక్కల పైన తక్కువ పీడనం ఉంటుంది. ఎప్పుడైనా సరే గాలి అనేది ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. రెక్కల పక్కన నుండి క్రింద ఉన్న గాలి పైకి చేరటంలో రౌండ్ గా తిరుగుతూ ఒక చిన్న సుడిగుండం లాంటిది ఏర్పడుతుంది. ఈ గాలి సుడులు తిరుగుతూ కిందికి వెళ్ళటానికి డౌన్వాస్ అనే జోన్ ని క్రియట్ చేస్తుంది. అలాగే పైకి వెళ్ళినప్పుడు అప్వాష్ అనే జోన్ ని క్రియేట్ చేస్తుంది.

అదే విధంగా ఇంజన్‌లేని విమానం (గ్లైడర్) పెరుగుతున్న గాలిలో నిరవధికంగా ఎత్తులకు అధిరోహించగలదు లేదా నిర్వహించగలదు. 1970లో వార్తాప్రత్రికనుసారం, 25 పక్షులు కలిసి వి (v) నిర్మించడంతో, ప్రతీ పక్షి గాలిలో ప్రేరేపితమైన ప్రవాహి ఘర్షణ (డ్రాగ్) ను తగ్గించుకోగలదు. దీని ఫలితంగా వాటి పరిధిని 71% పెంచుకుంటాయి.[2] వి (v) ఆకారంలో చివర, ముందు ఎగురుతున్న పక్షులు, అన్ని పక్షులకు ఎగిరినప్పుడు వచ్చే అలుపును వాటి సమూహంతో సమానంగా ఉంచుకోవడానికి సమయానుసారంగా చక్రియ ఆకారంలో పరిభ్రమిస్తూ తిరుగుతాయి. కెనడా బాతులు, బాతులు, ఇంకా హంసలు సాధారణంగా వి (v) నిర్మాణంలో ఒక కండే ఆకారంలో ఏర్పడతాయి.[3]

సైనిక విమాన లక్ష్యాలు

[మార్చు]

వి (v) లేదా విక్ (vic) నిర్మాణం అనేది అనేక వైమానిక దళాలలో సైనిక విమానాలకు ఒక ప్రాథమిక విమాన నిర్మాణం. ఉత్సవ సమయాలలో తిరిగే విమానాలు, గాలిలో విన్యాసాలు చేసే విమానాలు విక్ (vic) నిర్మాణం చేయడం సర్వసాధారణం.[4]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. USA Today: "Why birds fly in a V-formation" by Traci Watson January 15, 2014
  2. Lissaman, P.B.S. & Shollenberger, C.A. (1970). Formation flight of birds. Science 168(3934): 1003–1005 (same on JSTOR)
  3. "Oxford Dictionary: Skein". Archived from the original on 13 ఏప్రిల్ 2019. Retrieved 6 January 2019.
  4. Drinnon, Roger. "'Vortex surfing' could be revolutionary." Air Mobility Command, 10 October 2012.

బాహ్య లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • Holmes, Tony. Spitfire vs Bf 109: Battle of Britain. Oxford, UK/ New York: Osprey, 2007. ISBN 1-84603-190-7.