Jump to content

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

వికీపీడియా నుండి
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం
కుటుంబ విగ్రహం, స్విట్జర్లాండ్
యితర పేర్లుప్రపంచ కుంటుబ దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుమే 15
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి ఏట మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]

ప్రారంభం

[మార్చు]

గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడంకోసం 1993, మే 15న అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రారంభించింది.[2]

లక్ష్యం

[మార్చు]

మన సమాజంలో కుటుంబాలు పోషించే కీలక పాత్రను, ప్రామ్యుఖ్యతను, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, జనాభా సమస్యల గురించి అవగాహన పెంచడానికి, సమాజం లో  కుటుంబం  కీలక పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, అంతర్జాతీయ సమాజాన్ని ప్రోత్సహించడానికి   ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవం రోజును ఏర్పాటు చేసింది. ఒక రకంగా భావిస్తే, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం  మన కుటుంబాలలో మేము పంచుకునే ప్రేమ, బంధం, సంబంధాల మద్దతును జరుపుకునే రోజు గా భావించవచ్చు[3]. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబ విలువలను తెలియజేయడం కోసం, ఉమ్మడి కుటుంబాల అవసరం గురించి వివరించడం కోసం ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.

2024 లక్ష్యం

[మార్చు]

2024 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వాతావరణ మార్పు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుందో, వాతావరణ చర్యలో కుటుంబాలు పోషించగల పాత్ర గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది[4].

కార్యక్రమాలు

[మార్చు]
  1. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి.
  2. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏట ఒక అంశం థీమ్గా ప్రకటించబడుతుంది.
  3. 2016: హెల్తీ లైవ్స్ అండ్ సస్టెయినబుల్ ఫ్యూచర్
  4. 2018: కుటుంబాలు, అందరికీ భాగస్వామ్యం కల్పిం చుకునే సమాజాలను నిర్మించడం

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, సంపాదకీయం (15 May 2018). "సమాజాన్ని, సంస్కృతినీ కాపాడేది కుటుంబమే". ముప్పవరపు వెంకయ్యనాయుడు. Archived from the original on 15 May 2019. Retrieved 15 May 2019.
  2. ఆంధ్రభూమి, ఆదివారం సంచిక (14 May 2016). "జగమంత కుటుంబం". Archived from the original on 14 August 2018. Retrieved 15 May 2019.
  3. "International Family Day". Days Of The Year (in ఇంగ్లీష్). 2024-05-15. Retrieved 2024-05-15.
  4. Nations, United. "International Day of Families". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2024-05-15.