అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, అనేది "అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం" అని కూడా పిలువబడుతుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా జూలై 17న జరుపుకుంటారు. దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు.
నేపథ్యం
[మార్చు]ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయవయ్వస్థకు పునాది. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా "జూలై 17" న అంతర్జాతీయ న్యాయదినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సృష్టికి కారణమయిన ఒడంబడిక 'రోమ్ స్టాట్యు' వార్షికోత్సవము కారణముగా జూలై 17 వ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఆంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతారు.[1]
చరిత్ర
[మార్చు]ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐ.సి.సి.) రోమ్ స్టాట్యూట్ పదవ వార్షికోత్సవం సందర్భంగా 2008 లో ఇంటర్నేషనల్ జస్టిస్ డేను సెలబ్రేట్ చేశారు. ఐ.సి, సి. అసాధారణ సేవల్ని గుర్తిస్తూ మరింత ప్రశాంత ప్రపంచసృస్టికి, మరింత న్యాయానికి అనువుగా ఎల్లలులేని న్యాయాన్నీ నొక్కిచెప్పడానికి గాను ఇంటర్నేషనల్ జస్టిస్ డేని ప్రకటించారు. జూలై 17 తేదీన ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా ప్రకటిస్తూ తీర్మానిస్తూ సంతకాలు చేసిన తొలి ఏకైక మేయర్ గా పోర్ట్ ల్యాండ్ మేయర్ - టామ్ పాటర్ 'నిలిచిపొయారు". ఒకరి హక్కుల్ని ఒకరం పరస్పరం కాపాడుకోలేక పోతే, మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, వాటిని బహుశా ఎవరూ కాపాడలేకపోవడం సంభవించే సమయం రాగలదని నేను ప్రగాఢముగా విశ్వసించే వ్యక్తిని" అని మేయర్ టామ్‌పాటర్ పేర్కొనారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సమానత్వం, సమాన న్యాయము ఉండాలని అభిప్రాయపడ్డారు. సుమారు 150 దేశాలు సభ్యులు చేరారు. అంతర్జాతీయ న్యాయానికి ఐ.సి.సి ఎంతగానో తోడ్పడుతుంది. టెర్రరిజం పెచ్చుమీరిన ఈ రోజుల్లో అన్నిదేశాలు కూడగట్తుకొని న్యాయాన్ని కాపాడెతేనే మానవ మనుగడ ప్రశాంతంగా అహింసామార్గములో పయనించడానికి వీలుపడుతుంది.
వివిధ దేశాలలో జరుపుకొనే దినాలు
[మార్చు]- చికాగొలో -- జూలై 17,
- బోస్టనలో -- జూలై 14,
- వాషింగ్టన్‌లో -- జూలై 17,
- ఇండియాలో -- జూలై 17
ఇలా ఒక్కొచోట ఒక్కోవిధంగా ఆరంభమైన ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డే ప్రపంచదేశాలన్నీ రెండు సంవత్సరాలుగా సమిస్టిగా జూలై 17 న నిర్వహించుకుంటున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ http://www.icc-cpi.int/iccdocs/asp_docs/Resolutions/RC-Decl.1-ENG.pdf Archived 2012-08-13 at the Wayback Machine Kampala Declaration, ICC-ASP/RC/Decl.1 (1 June 2010), p. 24.
యితర లింకులు
[మార్చు]- Take action for International Justice Day[permanent dead link] – Amnesty International
- International Criminal Justice Day - ICC