అరువు పదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరువు పదం అనేది అనువాదం జరగకుండా ఒక దాత భాషలో నుండి మరొక భాషలోనకు చోర్వబడిన పదము. అరువు అనువాదాలకు (loan translations) ఇది తేడా. ఒక భావాన్ని గాని, జాతీయాన్ని గాని ప్రతి పద అర్థాలతో, మూలాలతో అనువాదం చేస్తే అది అరువు అనువాదం అవుతాది. ఉదాహరణకు రోడ్డు (ఆంగ్లం:road) అరువు పదం, ముక్కోణం (సంస్కృతం:త్రికోణః) అరువు అనువాదం. ఈ కార్యం ప్రతీ భాషలోనూ సర్వసాధారణంగా కనబడుతుంది. కొన్నిసార్లు అరువు పదాలు, మాటలు స్వీకరణలుగా, అనుసరణలుగా లేదా నిఘంటువు అరువులుగా గుర్తింపబడతాయి. అరువు పదం అనునది గూడా ఒక అరువు అనువాదమే.

మూలాలు

[మార్చు]

అన్య సంస్కృతుల అవగాహనతో క్రొత్త సాంకేతిక పదాలు తరుచుగా స్వభాష పదజాలంలోనకు ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ అరువు పదాలు మూల సంస్కృతిలో కల్గిన ఒక విషయం కావొచ్చు, లేకుంటే ఆ పద రంగంలో దాత సంస్కృతి ఆధిపత్యంలో ఉండి ఉండవచ్చు.

దూర ప్రయాణాల నుండి

[మార్చు]

అన్వేషణా యాత్రలతో స్థానిక నాగరికతల వస్తువులు, జీవులు కనుగొనబడటంతో వాటి పేర్లు సాధారణంగా స్థానిక భాషల నుండి స్వీకరణ చెందుతాయి. ఐరోపా భాషలలో అన్య జీవులకు వాడుకలో ఉన్న పేర్లు చాలామట్టుకు ఈ వర్గానికి చెందిన అరువు పదాలు.

వివిధ రంగాలలో ఆధిపత్యం వలన

[మార్చు]
  • కళలలో: భారతదేశ సంగీతకళ పేర్లు, నృత్యకళ పేర్లు చాలావరకు సంస్కృతం నుండి వచ్చాయి.
  • వేదాంతం/మతం: హిందువులకు సంస్కృతం, క్రైస్తవులకు గ్రీకు, ఇస్లాంకు అరబ్బీ, యాదువులకు హీబ్రూ మొదలైన ప్రార్థనా భాషలకు పలుకబడి ఎంతగానో ఉంది. ఈ భాషలే ఆయా ప్రజల యొక్క ఇతర భాషలకు మత సంబంధిత పదాలను దారబోస్తాయి.
  • ఆధునిక విద్యా శాస్త్రాలు: సాంకేతిక పురోగమనాలలో, పరిశోధన ప్రచురణలలో కొన్ని భాషలు ముందంజులో ఉండటంతో ఈ ఆధిపత్య భాషలలో ఉద్భవించిను పదాలు మిగిలిన భాషలను ప్రభావిస్తాయి. నూతన ఆవిష్కరణాల నామాలలో ఆంగ్లభాష ఉనికిని గమనించవచ్చు.
  • రాజ్యాంగం: జాతీయ సరిహద్దుల్లో అధికార హోదా గల భాషలు అధికారం లేని భాషలలో వ్యావహారికంగా మార్పులు తీసుకురాగలవు.

తెలుగు భాషలో

[మార్చు]

తెలుగు భాష అన్య భాష పదాలను సులువుగా, నిరభ్యంతరంగా స్వీకరిస్తుంది. సంస్కృత భాష, పదావళి తెలుగు సాహిత్యాన్ని భారీగా ప్రభావితం చేశాయి. నిజానికి సంస్కృత పదాల రచన, ఉచ్చారణ సులభతరం చేయటానికి, కేవలస్థిర హల్లలు (ఖ, థ), తెలుగు లిపిలోనికి వచ్చాయి.[1] ఇదికాక అరబ్బీ, పెర్షియన్, ఉర్దూ పదాలు కూడా తెలుగు పరిపాలనా పడికట్టు భాషలోకి వచ్చాయి. బ్రిటీషు పాలన ఆగమనం, సాంకేతిక విప్లవం ప్రపంచం చుట్టుముట్టడంతో, వ్యవహారిక తెలుగులో ఎన్నో ఆంగ్ల పదాలు రంగప్రవేశం చేశాయి.

పొరుగుభాషల నుండి తెలుగులోనకి వచ్చిన కొన్ని పదాలు
తెలుగు పదం మూల పదం మూల భాష
బ్యాంకు బాంక్ ఆంగ్లం
లోకం లోకః సంస్కృతం
దరఖాస్తు దర్ ఖాస్త్ పర్షియన్
అలమరా అర్మారియో పోర్చుగీసు
కబురు ఖబర్ అరబ్బీ
రవాణా రవానా ఉర్దూ

సూచికలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అరువు_పదం&oldid=3129246" నుండి వెలికితీశారు