అర్ధ జీవిత కాలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరగతి గదిలో పాచికలతో అర్థ జీవిత కాల భావనను వివరించుట

ఒక రేడియో ధార్మిక పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు కాలమును "అర్థ జీవితకాలం" అంటారు.

వివరణ

[మార్చు]

రేడియోధార్మిక పదార్థం ద్రవ్యరాశి విఘటనం అయ్యే పదార్థ ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు., ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.

స్ట్రాన్షియం - 90 అర్థాయువు

[మార్చు]

స్ట్రాన్షియం - 90 అనే రేడియోధార్మిక పదార్థం అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం - 90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉంటాయి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]